MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఆరోగ్యం బాగుండాలంటే పుచ్చకాయను తిన్న తర్వాత వీటిని అస్సలు తినకండి.. ! ఒకవేళ తిన్నారో?

ఆరోగ్యం బాగుండాలంటే పుచ్చకాయను తిన్న తర్వాత వీటిని అస్సలు తినకండి.. ! ఒకవేళ తిన్నారో?

పుచ్చకాయలో ఫైబర్, వాటర్ కంటెంట్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ సీజన్ లో ఈ పండును తింటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఏదేమైనా ఈ పండు ప్రయోజనాలను పొందాలన్నా.. దీనితో ఎలాంటి సమస్యలు రాకూడదన్నా.. ఈ పండును తిన్న తర్వాత కొన్ని ఆహారాలను తినడమే మానేయాలి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 28 2023, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎండాకాలంలో పుచ్చకాయను ఇష్టంగా తింటుంటారు. ఈ పండ్లు ఒక్క ఎండాకాలంలోనే పండుతాయి. ఈ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలోని వాటర్ కంటెంట్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే దీనిలోని పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పుచ్చకాయ బరువు తగ్గేందుకు, డీహైడ్రేషన్, వేసవి దాహం వంటి సమస్యలను పోగొట్టేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ పండును కొన్ని పండ్లతో కలిపి తింటే దీని ప్రయోజనాలకు బదులుగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పుచ్చకాయతోనే కాదు దీన్ని తిన్న తర్వాత కూడా ఈ పండ్లను తినకూడదు. ఒకవేళ తింటే కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అసలు పుచ్చకాయను తిన్న వెంటనే వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image: Getty Images

Image: Getty Images

పాలు 

పుచ్చకాయను తిన్న తర్వాత పాలు తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నిజానికి పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుంది. పుచ్చకాయను తిన్న తర్వాత పాల ఉత్పత్తులను తీసుకుంటే అవి ఒకదానితో ఒకటి స్పందించి ఉబ్బరం కలిగిస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తాయి. అలాగే అజీర్ణానికి కారణమవుతాయి.

35
protein rich foods

protein rich foods

ప్రోటీన్ ఆహారాలు

పుచ్చకాయ తిన్న తర్వాత ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయితే పుచ్చకాయలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో కొంత పిండి పదార్థం కూడా ఉంటుంది. పప్పుధాన్యాలు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైమ్లు దెబ్బతింటాయి. కడుపు సమస్యలు కూడా వస్తాయి. 
 

45

గుడ్డు

పుచ్చకాయను తిన్న తర్వాత గుడ్డును అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇలా తింటే ఎన్నో కడుపు సమస్యలు వస్తాయి. గుడ్లలో ప్రోటీన్లే కాదు ఒమేగా -3 వంటి కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.  పుచ్చకాయ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండు. ఇలాంటి వాటిని ఒకటి తర్వాత ఒకటి తిన్నా.. కలిపి తిన్నా సరిగ్గా జీర్ణం కాదు. అలాగే కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. 
 

55
watermelon

watermelon

కాబట్టి పుచ్చకాయను తిన్న తర్వాత ఈ ఆహారాలను తినడం మానేయండి. అంతేకాదు మీరు పుచ్చకాయ తిన్నప్పుడల్లా సుమారు 30 నిమిషాల వరకు ఎలాంటి ఆహారాలను తినకండి. ఈ సమయంలో శరీరం పుచ్చకాయ పోషకాలను గ్రహిస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Earbuds : వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ వాడుతున్నారా? అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వార్నింగ్ మీకే
Recommended image2
Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
Recommended image3
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved