MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Feature
  • Psychology: ఒక వ్యక్తిని మర్చిపోవడం ఎందుకు అంత కష్టం? సైకాలజీ ఏం చెబుతోంది?

Psychology: ఒక వ్యక్తిని మర్చిపోవడం ఎందుకు అంత కష్టం? సైకాలజీ ఏం చెబుతోంది?

Psychology: మన జీవితంలోకి చాలామంది వస్తుంటారు. కొంతమంది కొంతకాలం ట్రావెల్ చేస్తారు. ఆ తర్వాత ఏదో ఒక కారణంతో దూరమవుతుంటారు. వాళ్లు దూరమైనా, వాళ్ల జ్ఞాపకాలు మాత్రం మనల్ని వదలవు. మరి ఒక వ్యక్తిని మర్చిపోవడం ఎందుకు అంత కష్టం? సైకాలజీ ఏం చెబుతోందో చూద్దాం

2 Min read
Author : Kavitha G
Published : Sep 16 2026, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సైకాలజీ ఫ్యాక్ట్స్
Image Credit : AI

సైకాలజీ ఫ్యాక్ట్స్

మన జీవితంలో కొంతమంది వ్యక్తులు మనతో లేకపోయినా.. మన ఆలోచనల్లో మాత్రం కొనసాగుతూనే ఉంటారు. ఒకప్పుడు రోజూ మాట్లాడిన వ్యక్తి, కలిసి గడిపిన సమయం, చెప్పుకున్న మాటలు, చిన్న చిన్న జ్ఞాపకాలు.. రిలేషన్ షిప్ క్లోజ్ అయిన తర్వాత కూడా పదేపదే గుర్తుకొస్తుంటాయి. వారిని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా.. ఎందుకు కుదరడం లేదు? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంది. సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తిని మర్చిపోవడం ఎందుకు కష్టమో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మెదడు చేసే మాయాజాలం
Image Credit : AI

మెదడు చేసే మాయాజాలం

మనిషి మెదడు ముఖ్యమైన సంబంధాలను సాధారణ జ్ఞాపకాలుగా మాత్రమే గుర్తు పెట్టుకోదు. మనకు దగ్గరైన వ్యక్తితో భద్రత, సంతోషం, ఓదార్పు వంటి భావాలు అనుసంధానమవుతాయి. అందుకే ఆ వ్యక్తి దూరమైన తర్వాత కూడా వారి గురించి ఆలోచనలు ఈజీగా మనసులోకి వస్తాయి. ముఖ్యంగా ప్రేమ సంబంధాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బంధంలో విడిపోవడం అంటే కేవలం ఒక వ్యక్తి దూరం కావడం కాదు.. మన రోజువారీ జీవితంలో ఉన్న ఒక ముఖ్యమైన భావోద్వేగ వ్యవస్థలో మార్పు రావడం కూడా. కొన్ని పరిశోధనల ప్రకారం, రిలేషన్ షిప్ బ్రేక్ అయినప్పుడు ఆ వ్యక్తి జ్ఞాపకాలు కొంతకాలం కొనసాగడం సహజమైన ప్రక్రియ.

34
జ్ఞాపకాల పాత్ర
Image Credit : AI Generated

జ్ఞాపకాల పాత్ర

ఒక వ్యక్తితో కలిసి గడిపిన రోజుల్లో జరిగిన ప్రతి సంఘటన మనకు గుర్తుండకపోవచ్చు. కానీ బాగా ఎమోషనల్ అయిన సంఘటనలు మాత్రం ఎక్కువగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. మొదటి పరిచయం, ఫస్ట్ ఫోన్ కాల్, కలిసి వెళ్లిన ప్రదేశం, ప్రత్యేకమైన రోజు, ఒక పాట, ఒక మాట.. ఇలాంటి వాటికి మన మెదడు ఆ వ్యక్తితో సంబంధం కల్పిస్తుంది. తర్వాత అదే పాట వినిపించినా, అదే ప్రదేశం కనిపించినా లేదా అలాంటి పరిస్థితి ఎదురైనా పాత జ్ఞాపకం మళ్లీ యాక్టివేట్ కావచ్చు.

పదేపదే ఆలోచించడం

“అలా ఎందుకు జరిగింది?, నేను అప్పుడు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, మళ్లీ ఒకసారి అవకాశం వస్తే బాగుండు”… వంటి ఆలోచనలకు మనసులో పదేపదే సమాధానాలు వెతుక్కోవడాన్ని సైకాలజీలో రూమినేషన్‌ అంటారు. ముఖ్యంగా అభద్రతా భావం ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో విడిపోయిన తర్వాత ఈ రకమైన ఆలోచనలు ఎక్కువగా కనిపించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

44
బలవంతంగా ప్రయత్నించడం
Image Credit : AI

బలవంతంగా ప్రయత్నించడం

ఒక వ్యక్తిని మర్చిపోవాలి.. అని బలవంతంగా ప్రయత్నించడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఒక ఆలోచన రావద్దని ఎంతగా ప్రయత్నిస్తే, అదే ఆలోచనపై మన దృష్టి మరింత నిలిచిపోయే అవకాశం ఉంటుంది. బాధాకరమైన జ్ఞాపకాలను పూర్తిగా అణచివేయడం కంటే, అవి వచ్చినప్పుడు వాటిని గుర్తించి, వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయడం మంచిది. జరిగిన విషయాన్ని అర్థం చేసుకోవడం, మన భావాలను రాసుకోవడం లేదా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం, రోజువారీ పనులను కొనసాగించడం, కొత్త అనుభవాలకు అవకాశం ఇవ్వడం వంటివి మనల్ని మనం తిరిగి పొందడానికి పాత జ్ఞాపకాల నుంచి బయటపడ్డానికి సహాయపడవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Fennel Benefits : హోటల్స్‌లో భోజనం తర్వాత సోంపు, చక్కెర కలిపి ఇస్తారు? ఎందుకో తెలుసా?
Recommended image2
Razor Blade : రేజర్ బ్లేడ్ మధ్యలో రంధ్రాలు ఎందుకుంటాయో తెలుసా? వీటివెనక ఇంత సైన్స్ దాగుందా?
Recommended image3
భారతదేశం నడిబొడ్డున ఉన్న నగరం ఏదో తెలుసా? ఇది వెరీ స్పెషల్
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. ఈ 4 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన పని!
Recommended image2
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved