MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?

Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?

Dream Astrology: కలలో కనిపించే కొన్ని దృశ్యాలు ఉదయం లేచిన తర్వాత కూడా మనసును వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా కొన్ని కలలు యాదృచ్ఛికంగా వచ్చినట్లు అనిపించవు. ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నట్లు అనిపిస్తాయి. మరి ఏ కలల గురించి ఇతరులకు చెప్పకూడదో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 15 2026, 06:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏ కల వస్తే ఇతరులకు చెప్పొద్దు?
Image Credit : Getty

ఏ కల వస్తే ఇతరులకు చెప్పొద్దు?

మనకు నిద్రలో కనిపించే కొన్ని కలలు ఉదయం లేచిన తర్వాత కూడా చాలా సేపు గుర్తుండిపోతాయి. మరికొన్ని కలలు మాత్రం ఎందుకు వచ్చాయో అర్థం కాకుండా మనల్ని ఆలోచనలో పడేస్తాయి. ముఖ్యంగా దేవుడు, మరణించిన వ్యక్తులు, పాము, నీరు, డబ్బు, పెళ్లి వంటి విషయాలు కలలో కనిపిస్తే వాటికి ప్రత్యేకమైన అర్థం ఉందని చాలామంది నమ్ముతారు. స్వప్న శాస్త్రం ప్రకారం 3 కలల గురించి ఎవ్వరికీ చెప్పకూడదట. అవేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కలలో దేవుడు కనిపించడం
Image Credit : ChatGPT

కలలో దేవుడు కనిపించడం

స్వప్నశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం దేవతా దర్శనం, ఆలయం, దీపం లేదా పవిత్రమైన ప్రదేశం కలలో కనిపించడాన్ని చాలామంది శుభసూచకంగా భావిస్తారు. ముఖ్యంగా చాలాకాలంగా ఎదురుచూస్తున్న పని పూర్తయ్యే అవకాశం, జీవితంలో మంచి మార్పు రావడం, మనసులో ఉన్న కోరిక నెరవేరే సూచనగా కొందరు పండితులు దీన్ని వివరిస్తున్నారు. అందుకే ఇలాంటి కలను అందరికీ చెప్పకుండా మనసులోనే ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

34
కలలో పాము కనిపించడం
Image Credit : ChatGPT

కలలో పాము కనిపించడం

పాము కలలో కనిపిస్తే చాలామంది భయపడతారు. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం పాముకు ఒక్క అర్థమే లేదు. పాము ఎలా కనిపించింది, అది కరిచిందా, దూరంగా ఉందా, ప్రశాంతంగా ఉందా, దాన్ని చూసినప్పుడు కలలో మనకు భయం కలిగిందా వంటి అంశాల ఆధారంగా వివిధ రకాల అర్థాలు ఉంటాయి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం పామును శక్తి, మార్పు లేదా దాగి ఉన్న విషయాలకు ప్రతీకగా చూస్తారు. మరికొన్ని సంప్రదాయాల్లో నాగదేవతకు సంబంధించిన ఆధ్యాత్మిక సంకేతంగా భావిస్తారు. అందుకే పాము కలను వెంటనే చెడు శకునంగా భావించడం సరైంది కాదని పండితులు సూచిస్తున్నారు. ఇలాంటి కల వచ్చినప్పుడు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.

44
కలలో మరణించిన వ్యక్తి కనిపించడం
Image Credit : Ai generated

కలలో మరణించిన వ్యక్తి కనిపించడం

మనకు ఎంతో దగ్గరైన వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారు కలలో కనిపించడం చాలా సాధారణమైన అనుభవం. స్వప్న శాస్త్రం, ఆధ్యాత్మిక విశ్వాసాల్లో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కొందరు దీన్ని ఆ వ్యక్తి ఆశీర్వాదంగా, మరికొందరు మన జీవితంలో ఒక విషయం గురించి ఆలోచించాల్సిన అవసరానికి సంకేతంగా భావిస్తారు. అందుకే ఇలాంటి కలను అందరికీ చెప్పకూడదని పెద్దలు సూచిస్తారు.

జ్యోతిష్య పండితుల ప్రకారం ఇలాంటి కలలు వచ్చినప్పుడు భయపడటం కంటే వాటిని ప్రశాంతంగా గమనించడం మంచిది. కల ఎప్పుడు వచ్చింది, అందులో ఏం కనిపించింది వంటి విషయాలను తెలుసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Recommended image2
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. ఈ 4 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన పని!
Recommended image2
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved