MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Razor Blade : రేజర్ బ్లేడ్ మధ్యలో రంధ్రాలు ఎందుకుంటాయో తెలుసా? వీటివెనక ఇంత సైన్స్ దాగుందా?

Razor Blade : రేజర్ బ్లేడ్ మధ్యలో రంధ్రాలు ఎందుకుంటాయో తెలుసా? వీటివెనక ఇంత సైన్స్ దాగుందా?

షేవింగ్ కోసం ఉపయోగించే రేజర్ బ్లేడ్ మధ్యలో ప్రత్యేక ఆకారంలో రంధ్రాలు ఉంటాయి… ఇవి కేవలం డిజైన్ కోసమే అనుకుంటే మీరు పొరబడినట్లే, వీటివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 16 2026, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రేజర్ బ్లేడ్ మధ్యలోని రంధ్రాల వెనక ఇంజనీరింగ్ కారణం
Image Credit : stockPhoto

రేజర్ బ్లేడ్ మధ్యలోని రంధ్రాల వెనక ఇంజనీరింగ్ కారణం

మనం ప్రతిరోజూ ఉపయోగించే వస్తువులను చాలాసార్లు సరిగ్గా గమనించం… కానీ వాటి ఆకారం, డిజైన్ వెనుక మనకు తెలియని ఉపయోగం ఏదో దాగి ఉంటుంది. ఇలా మనం షేవింగ్ కోసం ఉపయోగించే రేజర్ బ్లేడ్‌ను గమనిస్తే.. దాని మధ్య భాగంలో ఒక ప్రత్యేకమైన ఆకారంలో రంధ్రాలు కనిపిస్తాయి. అసలు ఇవి ఎందుకు ఉంటాయి? బ్లేడ్‌ను అలా తయారు చేయడం వెనుక కారణమేంటి? కేవలం డిజైన్ కోసం అలా ఉంచారా, ఇకేదైనాా కారణం ఉందా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.

నిజానికి రేజర్ బ్లేడ్ మధ్యలో కనిపించే ఈ డిజైన్‌ రంధ్రాల వెనక ఇంజనీరింగ్ కారణం ఉంది. బ్లేడ్ రేజర్‌లో సరిగ్గా కూర్చోవడం, సరైన స్థానంలో స్థిరంగా ఉండటం, సులభంగా బ్లేడ్‌ను మార్చడం… ఇలాంటి అంశాల్లో ఈ డిజైన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అన్ని రకాల రేజర్ బ్లేడ్లలో ఈ ఆకారం, దాని ఉపయోగం ఒకేలా ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రేజర్‌లో బ్లేడ్ మధ్యలో ఈ రంద్రాలెందుకు ఉంటాయి?
Image Credit : stockPhoto

రేజర్‌లో బ్లేడ్ మధ్యలో ఈ రంద్రాలెందుకు ఉంటాయి?

సాంప్రదాయ డబుల్ ఎడ్జ్ సేఫ్టీ రేజర్ బ్లేడ్‌ను గమనిస్తే.. మధ్యలో ఒక ప్రత్యేకమైన ఆకారంలో రంధ్రాలు ఉంటాయి. రేజర్ హెడ్‌లో ఉండే సెంటర్ పోస్టులు, పిన్స్ లేదా ఇతర నిర్మాణాలతో ఈ భాగం సరిపోయేలా బ్లేడ్‌ను రూపొందిస్తారు.

దీని ప్రధాన ఉద్దేశం బ్లేడ్‌ను రేజర్‌లో సరైన స్థానంలో ఉంచడమే. బ్లేడ్‌ను రేజర్‌లో అమర్చినప్పుడు అది అటూ ఇటూ ఎక్కువగా కదలకుండా ఉండాలి. అందుకోసం బ్లేడ్‌లోని మధ్య భాగం, రేజర్‌లోని సంబంధిత భాగంతో సరిగ్గా సరిపోయేలా డిజైన్ చేస్తారు.

షేవింగ్ సమయంలో బ్లేడ్ స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. బ్లేడ్ తన స్థానంలో సరిగా లేకపోతే షేవింగ్ నాణ్యత తగ్గడమే కాకుండా చర్మంపై అసౌకర్యం, గీతలు లేదా చిన్న గాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. షేవింగ్ సులవుగా, సురక్షితంగా సాగేలా ఈ బ్లేడ్ రంధ్రాలు ఉపయోగపడతాయి.

35
ఈ రంధ్రాలే గాయాలనుండి కాపాడతాయా?
Image Credit : stockPhoto

ఈ రంధ్రాలే గాయాలనుండి కాపాడతాయా?

రేజర్‌తో షేవ్ చేసేటప్పుడు బ్లేడ్ చర్మానికి దగ్గరగా పనిచేస్తుంది. అందువల్ల బ్లేడ్‌కు సరైన పొజిషన్ ఉండాలి. అది రేజర్ హెడ్‌లో స్థిరంగా లేకపోతే బ్లేడ్ అంచు చర్మాన్ని సమానంగా తాకకపోవచ్చు... దీంతో గాయాలయ్యే అవకాశాలుంటాయి. అందుకే రేజర్ లో బ్లేడ్ సరిగ్గా కూర్చునేలా మధ్యలో ప్రత్యేక రంద్రాలుంటాయి... ఇవి బ్లేడ్, రేజర్ ల మధ్య అనుసంధానంగా పనిచేస్తాయి... షేవింగ్ సమయంలో గాయాలు కాకుండా కాపాడతాయి.

అయితే బ్లేడ్‌ను పూర్తిగా కదలకుండా ఉంచేది కేవలం మధ్యలోని ఓపెనింగ్ మాత్రమే కాదు. రేజర్ హెడ్ ఆకారం, బ్లేడ్ ప్లేట్, స్క్రూ లేదా క్లాంపింగ్ మెకానిజం వంటి ఇతర భాగాలు కూడా కలిసి బ్లేడ్‌ను స్థిరంగా ఉంచుతాయి.

45
బ్లేడ్ రంధ్రాల వెనక మరిన్ని ఉపయోగాలు
Image Credit : stockPhoto

బ్లేడ్ రంధ్రాల వెనక మరిన్ని ఉపయోగాలు

రేజర్ లో బ్లేడ్‌ను మార్చేటప్పుడు దాన్ని సరైన స్థానంలో అమర్చడం అవసరం. ముఖ్యంగా డబుల్ ఎడ్జ్ సేఫ్టీ రేజర్లలో బ్లేడ్ మధ్య భాగంలోని ఆకారం రేజర్ హెడ్‌లోని మౌంటింగ్ భాగంతో సరిపోవడం వల్ల బ్లేడ్‌ను ఎలా అమర్చాలో గుర్తించడం సులభమవుతుంది. అంటే ఈ డిజైన్ కేవలం బ్లేడ్‌ను పట్టుకోవడానికి మాత్రమే కాకుండా, దాన్ని సరైన విధంగా అమర్చడంలో కూడా సహాయపడుతుంది. బ్లేడ్ సరిగ్గా అమర్చిన తర్వాత రెండు వైపులా ఉండే పదునైన అంచులు రేజర్ హెడ్‌లో నిర్ణయించిన స్థానంలో ఉంటాయి.

ఈ డిజైన్‌ను ముఖ్యంగా సంప్రదాయ డబుల్ ఎడ్జ్ సేఫ్టీ రేజర్ బ్లేడ్లలో స్పష్టంగా చూడొచ్చు. ఈ రేజర్లలో ఒకే బ్లేడ్‌కు రెండు వైపులా కటింగ్ ఎడ్జ్‌లు ఉంటాయి. బ్లేడ్‌ను రేజర్ హెడ్‌లోని సెంటర్ మెకానిజంతో కలిపి అమర్చిన తర్వాత రెండు వైపులా కొంత భాగం బయటకు ఉంటుంది. మధ్యలోని ఓపెనింగ్, రేజర్‌లోని సంబంధిత భాగాలు కలిసి బ్లేడ్‌ను సరైన స్థానంలో ఉంచుతాయి. రేజర్ హెడ్‌ను బిగించినప్పుడు బ్లేడ్ స్థిరంగా ఉండేలా మొత్తం మెకానిజం పనిచేస్తుంది.

ఇక ఈ బ్లేడ్ రంధ్రాల వల్ల మరో ఉపయోగం ఏంటంటే.. షేవింగ్ సమయంలో వెంట్రుకలు, ఫోమ్, నీరు రేజర్ హెడ్‌లోకి చేరుతాయి. సరైన ఛానల్స్ లేదా గ్యాప్స్ ఉంటే అవి బయటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దీంతో బ్లేడ్ ప్రాంతంలో పదార్థాలు ఎక్కువగా పేరుకుపోకుండా రేజర్‌ను ఉపయోగించడం, శుభ్రం చేయడం సులభమవుతుంది.

55
చిన్న రంధ్రాలు... పెద్ద ఇంజనీరింగ్ ఆలోచన
Image Credit : stockPhoto

చిన్న రంధ్రాలు... పెద్ద ఇంజనీరింగ్ ఆలోచన

బ్లేడ్ మధ్యలో పెద్ద భాగం కట్ చేసి ఉండటంతో అది బలహీనపడుతుందేమో అనిపించవచ్చు. కానీ ఆ భాగాన్ని యాదృచ్ఛికంగా తొలగించరు. బ్లేడ్‌ను రేజర్‌లో ఎలా అమర్చాలి, ఏ భాగంతో లాక్ అవ్వాలి, ఎంత స్థిరంగా ఉండాలి అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని దాని ఆకారాన్ని రూపొందిస్తారు.బ్లేడ్ తయారీ సమయంలో ఉపయోగించే లోహం, దాని మందం, కటింగ్ ఎడ్జ్‌ల ఆకారం, రేజర్ హెడ్‌తో ఉండే అనుసంధానం వంటి అంశాలు కూడా మొత్తం డిజైన్‌లో భాగమే.

మొత్తానికి రేజర్ బ్లేడ్ మధ్యలో కనిపించే ఖాళీని కేవలం అలంకరణ కోసం చేసిన కట్‌గా భావించడం సరైంది కాదు. రేజర్ రకాన్ని బట్టి దాని ఆకారం, పరిమాణం, ఉపయోగం మారవచ్చు. అయితే బ్లేడ్‌ను రేజర్‌లో సరైన స్థానంలో అమర్చడం, దాని స్థిరత్వాన్ని మెరుగుపరచడం, వినియోగాన్ని సులభతరం చేయడం వంటి అవసరాలు ఈ డిజైన్‌కు ముఖ్యమైన కారణాలు.

మనం రోజూ చేతిలోకి తీసుకునే రేజర్‌లో కనిపించే ఈ చిన్న డిజైన్.. వినియోగదారుడికి తెలియకుండానే పనిచేసే ఒక ఇంజనీరింగ్ పరిష్కారం. ఇకపై రేజర్ బ్లేడ్ మధ్యలో ఉన్న ఆ ఖాళీని చూసినప్పుడు.. అది అలా వదిలేసిన భాగం కాదని, రేజర్ సరిగ్గా పనిచేయడానికి రూపొందించిన మెకానిజంలో ఒక ముఖ్యమైన భాగమని గుర్తు చేసుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River : కృష్ణా నది 64 కి.మీ దూరముండే అరేబియాలో కాకుండా.. 1400 కి.మీ దూరమున్న బంగాళాఖాతంలో ఎందుకు కలుస్తుంది?
Recommended image2
అత్యంత అందమైన ఊరు.. కానీ ఏడాదిలో 4 నెలలు చిమ్మచీకటే
Recommended image3
Unique Village : ఇళ్ల పైకప్పులే రోడ్లుగా మారిన వింత గ్రామం... ఎక్కడుందో తెలుసా?
Related Stories
Recommended image1
Facts : వాటర్ బాటిల్‌పై అడ్డంగా గీతలుంటాయి కదా.. ఎందుకో తెలుసా?
Recommended image2
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved