MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. ఈ 4 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన పని!

Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. ఈ 4 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన పని!

Chanakya Niti: మనిషి మాటకు ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. ఒక్క మాట మనసును గెలుచుకోగలదు, అలాగే మాయని గాయం చేయగలదు. అందుకే ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడం ముఖ్యం. చాణక్యుడి ప్రకారం 4 సందర్భాల్లో మౌనంగా ఉండటం మంచిదట. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 14 2026, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చాణక్యుడి ప్రకారం మౌనంగా ఉండాల్సిన సందర్భాలు
Image Credit : Asianet News

చాణక్యుడి ప్రకారం మౌనంగా ఉండాల్సిన సందర్భాలు

మాట అనేది మనిషికి ఉన్న గొప్ప శక్తి. అయితే అదే మాటను ఆలోచించకుండా ఉపయోగిస్తే సమస్యలు, అపార్థాలు, సంబంధాల్లో దూరం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఆచార్య చాణక్యుడు మాటల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మన అభిప్రాయాన్ని వెంటనే వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండటం వల్ల మన గౌరవం, మనశ్శాంతి కాపాడుకోవచ్చని చాణక్య నీతి చెబుతోంది. మరి ఏ సందర్భాల్లో మౌనంగా ఉండటం తెలివైన నిర్ణయం అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎదుటివారు కోపంగా ఉన్నప్పుడు
Image Credit : AI

ఎదుటివారు కోపంగా ఉన్నప్పుడు

ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు అతని ఆలోచనా విధానం నార్మల్ గా ఉండదు. ఆ సమయంలో మనం ఎంత మంచి విషయం చెప్పినా అది తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా మనం కూడా కోపంతో సమాధానం ఇస్తే చిన్న సమస్య పెద్ద గొడవగా మారుతుంది. అందుకే ఎదుటివారి కోపానికి వెంటనే మాటలతో ప్రతిస్పందించకుండా కొంత సమయం మౌనంగా ఉండటం మంచిది. పరిస్థితి చల్లబడిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడితే సమస్యను ఈజీగా పరిష్కరించుకోవచ్చు.

35
మన మాటకు విలువ ఇవ్వని వ్యక్తుల ముందు
Image Credit : Gemini AI

మన మాటకు విలువ ఇవ్వని వ్యక్తుల ముందు

ప్రతి ఒక్కరినీ మన ఆలోచనా విధానంతో ఒప్పించాల్సిన అవసరం లేదు. కొంతమంది నిజం తెలుసుకోవడానికి కాకుండా కేవలం వాదించడానికి మాత్రమే మాట్లాడుతుంటారు. అలాంటి వారికి ఎంత వివరించినా వారు తమ అభిప్రాయాన్ని మార్చుకోకపోవచ్చు. అప్పుడు మన సమయం, శక్తి రెండూ వృథా అవుతాయి. ప్రతి వాదనలో గెలవడం కంటే, వాదన నుంచి తప్పుకోవడమే మంచిది. అవసరమైన చోట మాట్లాడటం, అవసరం లేని చోట మౌనంగా ఉండటం మెచ్యూరిటీకి సంకేతం.

45
భవిష్యత్ గురించి మాట్లాడే సందర్భంలో
Image Credit : AI

భవిష్యత్ గురించి మాట్లాడే సందర్భంలో

మన జీవితంలో ఏదైనా మంచి పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వెంటనే అందరికీ చెప్పడం కంటే ముందుగా ఆ పనిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. మన లక్ష్యాలు, ఆలోచనలు అందరితో పంచుకోవడం వల్ల కొందరి నుంచి అనవసరమైన విమర్శలు, నిరుత్సాహపరిచే మాటలు రావచ్చు. మరికొందరు మన ఆలోచనలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే చేయాల్సిన పనిని నిశ్శబ్దంగా చేసి, ఫలితాలు మాట్లాడేలా చేయడం తెలివైన పని.

55
రహస్యాలు తెలిసినప్పుడు
Image Credit : Gemini

రహస్యాలు తెలిసినప్పుడు

ఎవరైనా మనపై నమ్మకంతో ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని ఇతరులతో పంచుకోవడం ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. మనకు తెలిసిన ప్రతి విషయాన్ని ఇతరులతో చెప్పడం తెలివితేటలకు సంకేతం కాదు. ఏ విషయం బయటకు చెప్పాలి, ఏ విషయం మన దగ్గరే ఉంచుకోవాలి అనే విచక్షణ ఉన్నవారే జీవితంలో స్థిరమైన సంబంధాలను ఏర్పరుచుకోగలరని చాణక్యుడు బోధనలు వివరిస్తున్నాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఉప్పు డబ్బాలో వీటిని వేస్తే గడ్డ కట్టదు, చెమ్మపట్టదు
Recommended image2
Fashion Tips: ఈ వర్షాకాలంలో ఉన్న వాతావరణానికి ఏ బట్టలు వేసుకోవాలి? ఉక్కపోత తగ్గించే బెస్ట్ ఫ్యాబ్రిక్స్
Recommended image3
Gardening Tips: ఈ మొక్కలను ఇంటి లోపల పెంచకపోవడమే మంచిది!
Related Stories
Recommended image1
Telugu Saying: లోకువ మొగుడికి నూకల జావ! ఈ సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
Recommended image2
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved