MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Facts : రూ.50, రూ.100, రూ.200 నోట్లను ప్రజలు ఇళ్లలో ఎందుకు దాచుకుంటున్నారు? తెలిస్తే మీరూ ఇలాగే చేస్తారు

Facts : రూ.50, రూ.100, రూ.200 నోట్లను ప్రజలు ఇళ్లలో ఎందుకు దాచుకుంటున్నారు? తెలిస్తే మీరూ ఇలాగే చేస్తారు

ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగినా ప్రజలు మళ్లీ రూ.100, రూ.200 వంటి చిన్న నోట్లను ఇళ్లలో దాచుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 29 2026, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇండియాలో చిన్ననోట్లకు పెరుగుతున్న డిమాండ్.. ఎందుకో  తెలుసా?
Image Credit : Gemini AI

ఇండియాలో చిన్ననోట్లకు పెరుగుతున్న డిమాండ్.. ఎందుకో తెలుసా?

ఇండియాలో వచ్చిన డిజిటల్ విప్లవం ప్రజల ఆర్థిక అలవాట్లను పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. గతంలో జేబులో డబ్బులు లేకుంటే బయటకు వెళ్లేవారు కాదు... కానీ ఇప్పుడు పర్సులో రూపాయి లేకున్నా ఇంకా చెప్పాలంటే పర్సే లేకున్నా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుగుతున్నారు. ప్రతి దగ్గరా డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు... కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతోంది. ఒక్కరూపాయి నుండి లక్ష రూపాయల వరకు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపిఐ యాప్స్... ఇంతకంటే ఎక్కువ డబ్బులు అవసరం అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారు. దీంతో డబ్బులు వెంటపెట్టుకుని తిరిగే అవసరం లేకుండా పోయింది.

అయితే ఇటీవల కాలంలో ఓ కొత్త ట్రెండ్ ప్రారంభమయ్యింది. దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నా చాలామంది ఇళ్లలో రూ.50, రూ.100, రూ.200 వంటి కరెన్సీ నోట్లను ఎక్కువగా నిల్వ ఉంచుకుంటున్నారని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతో చిన్న నోట్లకు బాగా డిమాండ్ ఏర్పడుతోందట. ఇంతకూ డిజిటల్ పేమెంట్స్ జోరుగా సాగుతున్న సమయంలా ఇండియన్స్ మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు చిన్న నోట్లను ఎందుకు దాచుతున్నారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు ఆర్థిక నిపుణులు చెప్పే కారణాలు ఇలా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు..
Image Credit : Getty

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు..

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న దాడులు, అంతకుముందు రష్యా-ఉక్రెయిన్ యుద్దం, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దూకుడు నిర్ణయాలు, ముడిచమురు రవాణా సమస్యలు... ఇలా వరల్డ్ ఎకానమీని ప్రభావితం చేసేలా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. అందుకే కొంత నగదు దాచుకోవడం మంచిదనే అభిప్రాయం భారతీయుల్లో ఏర్పడింది. ఏదైనా ఊహించని పరిణామాలు జరిగితే ఈ డబ్బులు ఉపయోగపడాయని భావిస్తున్నారట.

36
కరోనా మహమ్మారి నేర్పిన ఆర్థిక పాఠాలు..
Image Credit : Getty

కరోనా మహమ్మారి నేర్పిన ఆర్థిక పాఠాలు..

ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు... ఒక్కసారిగా తారుమారు అవుతాయనే జీవిత పాఠాన్ని కరోనా మహమ్మారి నేర్పింది. అందుకే కరోనా తర్వాత ప్రజల ఆర్థిక అలవాట్లు మారినట్లు నిపుణులు చెబుతున్నారు. ఊహించని పరిస్థితుల్లో బ్యాంకింగ్ సేవలు లేదా ఇంటర్నెట్‌కు అంతరాయం కలిగితే… కరోనా సమయంలో మాదిరిగా బ్యాంకులకు వెళ్లలేని పరిస్థితి వస్తే చేతిలో ఉన్న నగదు ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే చిన్న నోట్లు దాచుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

46
ప్రధాని మోదీ ప్రకటన..
Image Credit : iSTOCK

ప్రధాని మోదీ ప్రకటన..

ఇటీవల స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖర్చులు తగ్గించుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బంగారం ఎక్కువగా కొనొద్దని, పెట్రోల్ పొదుపుగా వాడాలని, ఎక్కువ ఖర్చు వద్దని సూచించారు. దీంతో రాబోయే రోజుల్లో ఏదో జరగబోతోందనే భయం ప్రజల్లో మొదలయ్యింది. అందుకే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలనే కొంత డబ్బును క్యాష్ రూపంలో పొదుపు చేస్తున్నారు. యూపిఐ పేమెంట్, డిజిటల్ లావాదేవీలు జరక్కపోయినా దాచుకున్న క్యాష్ తో మేనేజ్ చేయవచ్చన్నది వారి అభిప్రాయం.

56
చిల్లర సమస్య, ఆర్థిక భద్రత
Image Credit : Gemini AI

చిల్లర సమస్య, ఆర్థిక భద్రత

రూ.50, రూ.100, రూ.200 నోట్లను ఈజీగా మార్చుకోవచ్చు... అదే రూ.500 నోటును అంత ఈజీగా మార్చలేం. అంటే కూరగాయలు, కిరాణా సామాను లాంటి చిన్న చిన్న కొనుగోళ్లకు రూ.500 నోటు ఇస్తే చిల్లర దొరకడం కష్టమవుతుంది... అదే రూ.50.రూ.100 నోటుతో ఇబ్బంది ఉండదు. ఇది కూడా ప్రజలు చిన్ననోట్లు దాచడం వెనక కారణంగా తెలుస్తోంది.

చిన్ననోట్లతో ఆర్థిక భద్రత అని ప్రజలు భావిస్తున్నారు. రూ.500 లేదా అంతకంటే పెద్ద నోట్లను దాచడం వల్ల ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అదే రూ.100, రూ.200 నోట్లు అయితే సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు. అందుకే ఈ నోట్లను డిమాండ్ పెరిగింది.

66
ఇండియాలో రూ.100, రూ.200 నోట్ల కొరత రానుందా..?
Image Credit : AI gemeni

ఇండియాలో రూ.100, రూ.200 నోట్ల కొరత రానుందా..?

అయితే ప్రస్తుతం మార్కెట్లో రూ.100, రూ.200 నోట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా అధికారికంగా ఎలాంటి కొరత లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇతర బ్యాంకుల్లో తగినన్ని నోట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత డిమాండ్ కేవలం ప్రజల ముందుజాగ్రత్త చర్యేనని నిపుణులు చెబుతున్నారు. కానీ భవిష్యత్ లో ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందులు తప్పవంటున్నారు. కరెన్సీ అనేది మార్కెట్లో ఉండాలి కానీ ఇళ్లలో కాదు... దీనివల్ల ద్రవ్యోల్బనం పెరిగి చివరకు ప్రజలకే ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోజువారీ ఖర్చులు, అత్యవసరాల కోసం కొంత నగదు ఇంట్లో ఉంచుకోవడం మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఎక్కువ మొత్తంలో డబ్బును ఇంట్లో దాచుకోవడం కంటే బ్యాంకు ఖాతాలు, సురక్షితమైన డిజిటల్ పెట్టుబడి మార్గాల్లో ఉంచడమే ఉత్తమమని సలహా ఇస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hamsa: హంస పాలు - నీళ్లను ఎలా వేరు చేస్తుంది? పాలను మాత్రమే తాగి నీళ్లు ఎలా వదిలేస్తుంది?
Recommended image2
Snakes : బాత్రూమ్, టాయిలెట్లలోకి పాములు ఎందుకు వస్తాయి? రాకుండా ఎలా ఆపాలి?
Recommended image3
Birds Facts : పక్షులు చెట్టు చిటారుకొమ్మలపై నిద్రించినా ఎందుకు కిందపడిపోవు? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Related Stories
Recommended image1
Currency Notes: జూన్ 30 తర్వాత ఇప్పుడున్న నోట్లన్నీ రద్దు కానున్నాయా.. మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు.?
Recommended image2
Indian Currency Secrets : 100, 200, 500 రూపాయల నోట్ల చివర్లో ఈ గీతలు ఎందుకుంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved