MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Indian Currency Secrets : 100, 200, 500 రూపాయల నోట్ల చివర్లో ఈ గీతలు ఎందుకుంటాయో తెలుసా?

Indian Currency Secrets : 100, 200, 500 రూపాయల నోట్ల చివర్లో ఈ గీతలు ఎందుకుంటాయో తెలుసా?

మీ పర్సులో ఉండే రూ.100, రూ.200, రూ.500 నోట్లను బైటికితీసి సరిగ్గా గమనిస్తే సరికొత్తగా కనిపిస్తాయి. నిత్యం వాడుతున్నా కరెన్సీ నోట్లపై కొన్ని గుర్తులు ఎందుకుంటాయో చాలామందికి తెలియదు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 16 2026, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కరెన్సీ నోట్లపై సీక్రేట్...
Image Credit : Pixabay

కరెన్సీ నోట్లపై సీక్రేట్...

మనం రోజూ వాడే కరెన్సీ నోట్లపై చాలా విషయాలు ఉంటాయి. గాంధీ తాత బొమ్మ, నోటు నంబర్, సెక్యూరిటీ దారం, వివిధ భాషల్లో నోటు విలువ వంటివి గమనిస్తాం. కానీ రూ.100, రూ.200, రూ.500 నోట్ల చివర్లో ఉండే వాలు గీతలను ఎందుకు ముద్రిస్తారో ఆలోచించారా? ఈ చిన్న గుర్తుల వెనుక ఓ పెద్ద సామాజిక బాధ్యత ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బ్లైండ్ మార్క్స్ అంటే ఏంటి?
Image Credit : Getty

బ్లైండ్ మార్క్స్ అంటే ఏంటి?

నోటుకు రెండుచివర్ల (ఎడమ, కుడి వైపులా) కనిపించే వాలు గీతలను 'బ్లైండ్ మార్క్స్' అని పిలుస్తారు. ఇవి మామూలు ప్రింటింగ్‌లా కాకుండా కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి. చేత్తో తాకితే ఇవి స్పష్టంగా తెలుస్తాయి. దీనివల్ల కంటిచూపు సరిగా లేనివారు కూడా ఆ కరెన్సీ నోటు విలువను సులభంగా గుర్తిస్తారు.

Related Articles

Related image1
Currency notes: మనదేశంలో కరెన్సీ నోట్లను, నాణేలను ముద్రించే యూనిట్లు ఎక్కడున్నాయో తెలుసా?
Related image2
Fake currency: ATMలో న‌కిలీ నోటు వ‌స్తే ఏం చేయాలో తెలుసా.?
34
ఏ నోటుపై ఎన్ని గీతలు?
Image Credit : Freepik

ఏ నోటుపై ఎన్ని గీతలు?

రూ.100 నోటుపై రెండు వైపులా నాలుగు వాలు గీతలు ఉంటాయి. రూ.200 నోటుపై కూడా నాలుగు గీతలే ఉంటాయి, కానీ వాటితో పాటు రెండు చిన్న సున్నాలు కూడా ఉంటాయి. ఇక రూ.500 నోటుకు ఇరువైపులా ఐదు గీతలు కనిపిస్తాయి. ఈ తేడాలతోనే కంటిచూపు లేనివారు కరెన్సీ నోట్ల విలువను గుర్తిస్తారు.

44
 ప్రతి కరెన్సీ నోటుపై ప్రత్యేక గుర్తులు..
Image Credit : Getty

ప్రతి కరెన్సీ నోటుపై ప్రత్యేక గుర్తులు..

బ్లైండ్ మార్క్స్‌ మాత్రమే కాదు ప్రతి నోటుపై ప్రత్యేక ఆకారాలు కూడా ఉంటాయి. రూ.100 నోటుపై త్రిభుజం, రూ.200 నోటుపై 'H' ఆకారం, రూ.500 నోటుపై వృత్తం ముద్రించి ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టిలోపం ఉన్నవారి కోసమే ఏర్పాటు చేశారు. దీంతో కంటిచూపు లేనివారిని ఇతరులు మోసం చేసే వీలుండదు. 

నోట్లపై ఉండే సెక్యూరిటీ దారం, రంగు మారే ఇంక్ వంటివి దొంగ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడతాయి. అదే సమయంలో బ్లైండ్ మార్క్స్ లాంటివి అందరికీ సమానమైన వినియోగాన్ని అందిస్తాయి. నెక్స్ట్ టైమ్ కరెన్సీ నోటు చేతిలోకి తీసుకున్నప్పుడు దాని వెనుక ఉన్న ఈ గొప్ప ఆలోచనను, సామాజిక బాధ్యతను గుర్తుచేసుకోండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
జెన్ జి, జెన్ ఆల్ఫా, జెన్ ఎక్స్, మిల్లీనియల్ తెలుసు.. ఈ బేబీ బూమర్స్, సైలెంట్ జనరేషన్ ఏంటి? మీ జనరేషన్ ఏది?
Recommended image2
Breakup: లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారా? బ్రేకప్ బాధ నుండి బయటపడటానికి 3 కఠినమైన సూత్రాలు
Recommended image3
Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌
Related Stories
Recommended image1
Currency notes: మనదేశంలో కరెన్సీ నోట్లను, నాణేలను ముద్రించే యూనిట్లు ఎక్కడున్నాయో తెలుసా?
Recommended image2
Fake currency: ATMలో న‌కిలీ నోటు వ‌స్తే ఏం చేయాలో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved