- Home
- Feature
- విద్యుత్ మీటర్లలో ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పసుపు లైట్లు ఎందుకుంటాయి? ఇవి వెలిగితే అర్థమేంటి?
విద్యుత్ మీటర్లలో ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పసుపు లైట్లు ఎందుకుంటాయి? ఇవి వెలిగితే అర్థమేంటి?
కరెంట్ బిల్లు ద్వారానే కాదు మన ఇంటి విద్యుత్ మీటర్లో ఉండే చిన్నచిన్న లైట్ల ద్వారా కూడా కరెంట్ వాడకం, సరఫరా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవచ్చని చాలామందికి తెలియదు. ఏ లైట్ దేనికి సంకేతమో తెలుసా?

విద్యుత్ మీటర్లలో ఎన్ని లైట్లు ఉంటాయి?
చాలామందికి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ బిల్లు ఇస్తేగానీ ఎన్ని యూనిట్లు వాడారో తెలియదు. బిల్లు ఎక్కువొస్తే ఎవ్వరైనా కంగారు పడతారు. కానీ విద్యుత్ మీటర్‌లోని లైట్లను గమనిస్తే కరెంట్ వాడకం గురించి తెలుసుకోవచ్చు. డిజిటల్ మీటర్లలో ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పసుపు రంగు లైట్లు ఉంటాయి. ఏ లైట్ దేనికి సంకేతమో తెలుసా?
మీటర్ లో ఆకుపచ్చ లైట్ అర్థమేంటి?
మీటర్‌లో ఆకుపచ్చ లైట్ వెలుగుతుందంటే.. మీటర్‌కు కరెంట్ సరఫరా అవుతోందని అర్థం. ఇంట్లో పవర్ ఉన్నప్పుడు ఈ లైట్ వెలిగితే కంగారు పడాల్సిన పనిలేదు. ఒకవేళ కరెంట్ లేకున్నా ఈ లైట్ వెలుగుతున్నా, ఏదైనా తేడా కనిపించినా మీటర్‌ను చెక్ చేయించడం మంచిది.
మీటర్ లో ఎరుపు, నీలం లైట్ అర్థమేంటి?
చాలా మీటర్లలో ఎర్ర లైటుకు, ఇంట్లో వాడుతున్న కరెంట్ లోడ్‌కు సంబంధం ఉంటుంది. ఏసీ, కూలర్, ఫ్రిజ్, మోటార్ వంటివి ఒకేసారి వాడితే ఈ లైట్ వేగంగా బ్లింక్ అవుతుంది. అలా వేగంగా వెలిగితే మీటర్ పాడైందని కాదు… ఎక్కువు విద్యుత్ వినియోగిస్తున్నట్లు అర్థం. ఇలా రెడ్ లైట్ ఎక్కువగా బ్లింక్ అయితే కరెంట్ ఖర్చు పెరగడం ఖాయం.
ఇక కొన్ని డిజిటల్ మీటర్లలో నీలం రంగు లైట్, కరెంట్ వాడకాన్ని సూచిస్తుంది. ఇంట్లో కరెంట్ వాడుతున్నప్పుడు ఈ లైట్ వెలుగుతుంది లేదా బ్లింక్ అవుతుంది. కరెంట్ వాడకం ఎంత ఎక్కువగా ఉంటే, ఈ లైట్ అంత వేగంగా బ్లింక్ అవుతుంది.
పసుపు లైట్ వెలిగితే..
మీటర్లలో ఈ లైట్లు కూడా ఉంటాయి
కొన్ని స్మార్ట్ మీటర్లలో 'Reverse' అనే లైట్ ఉంటుంది. కరెంట్ ప్రవాహం వ్యతిరేక దిశలో వెళ్తున్నప్పుడు ఈ లైట్ వెలుగుతుంది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ ఉన్న కనెక్షన్లలో ఇలాంటి సిగ్నల్ కనిపించవచ్చు. ఈ లైట్ వెలిగితే మీరే మీటర్ తెరవొద్దు. కరెంట్ సిబ్బందితో చెక్ చేయించడమే సురక్షితం.
కొన్ని మీటర్లలో 'Tamper' లేదా 'Fault' అనే లైట్ ఉంటుంది. మీటర్‌తో ఎవరైనా ట్యాంపరింగ్ చేసినా లేదా సాంకేతిక సమస్య ఉన్నా ఇది సూచిస్తుంది. ఈ లైట్ ఆగకుండా వెలుగుతున్నా, డిస్‌ప్లేపై ఏదైనా హెచ్చరిక కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే కరెంట్ ఆఫీస్ సిబ్బందితో మీటర్‌ను చెక్ చేయించాలి.

