MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • Electricity Bill : పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి చాలు..మీ ఇంటి కరెంట్ బిల్లు తగ్గడం ఖాయం

Electricity Bill : పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి చాలు..మీ ఇంటి కరెంట్ బిల్లు తగ్గడం ఖాయం

కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతోందా? అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. రాత్రిపూట కొన్ని పరికరాలను ఆఫ్ చేయడం వల్ల 'స్టాండ్‌బై పవర్' వాడకం తగ్గుతుంది. ఈ చిన్న అలవాటుతో మీ కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 10 2026, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కరెంట్ బిల్లు తగ్గించుకునే చిట్కాలు
Image Credit : unsplash

కరెంట్ బిల్లు తగ్గించుకునే చిట్కాలు

ప్రతి నెలా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుండటంతో చాలా కుటుంబాలు ఖర్చు తగ్గించుకునే మార్గాలు వెతుకుతుంటాయి. అయితే కరెంటు ఆదా చేయడానికి పెద్ద ఉపకరణాల వాడకం తగ్గించడమే కాదు, వాడని ఎలక్ట్రానిక్ పరికరాలను ప్లగ్‌లో ఉంచకుండా తీసేయడం కూడా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు అనవసరమైన ఛార్జర్లు, అడాప్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అన్‌ప్లగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం “ఛార్జ్ ఇట్ రైట్, అన్‌ప్లగ్ ఎట్ నైట్” అనే నినాదాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాత్రిపూట ఛార్జర్ అన్‌ప్లగ్
Image Credit : Gemini

రాత్రిపూట ఛార్జర్ అన్‌ప్లగ్

ముందుగా ఫోన్ ఛార్జర్ విషయం చూద్దాం. రాత్రి పడుకునే ముందు ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి, అది పూర్తయ్యాక ఛార్జర్‌ను సాకెట్ నుంచి తీసేయాలి. అలాగే వాడని అడాప్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ యాక్సెసరీలను కూడా అన్‌ప్లగ్ చేయడం మంచిది. రాత్రంతా రౌటర్ ఆన్‌లో ఉండాల్సిన అవసరం లేనివాళ్లు, దాన్ని కూడా ఆఫ్ చేయొచ్చు. అయితే ఇంట్లో సెక్యూరిటీ సిస్టమ్స్, స్మార్ట్ డివైజ్‌లు లేదా నిరంతరం ఇంటర్నెట్ అవసరమయ్యే పరికరాలు ఉంటే, వాటిని మాత్రం ఆపొద్దు.

Related Articles

Related image1
Free Current : తెలుగోళ్లకు బంపరాఫర్... ప్రభుత్వం నుండి నెలనెలా రూ.1800, ఏటా రూ.21,600
Related image2
FREE current: ఉచిత విద్యుత్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి..
35
'స్టాండ్‌బై పవర్' అంటే ఏమిటి?
Image Credit : Getty

'స్టాండ్‌బై పవర్' అంటే ఏమిటి?

స్టాండ్‌బై మోడ్‌లో ఉన్న కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసినా కూడా సాకెట్‌లో ప్లగ్ చేసి ఉంటే కొద్దిగా కరెంటును వాడుకుంటాయి. దీన్నే 'స్టాండ్‌బై పవర్' లేదా 'వాంపైర్ పవర్' అంటారు. ఒక్క ఛార్జర్‌ను అన్‌ప్లగ్ చేయడం వల్ల వెంటనే పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుందని అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి పరికరం వాడే కరెంటు వేర్వేరుగా ఉంటుంది. కానీ వాడని చాలా పరికరాలను ప్లగ్‌లో ఉంచకుండా తీసేస్తే, దీర్ఘకాలంలో కరెంటు వృథాను తగ్గించవచ్చు.

45
కరెంటు ఆదా మాత్రమే కాదు భద్రత పెరుగుతుంది
Image Credit : Gemini

కరెంటు ఆదా మాత్రమే కాదు భద్రత పెరుగుతుంది

రాత్రిపూట కొన్ని పరికరాలను అన్‌ప్లగ్ చేయడం వల్ల కరెంటు ఆదా అవ్వడమే కాదు, వాటి భద్రత కూడా పెరుగుతుంది. పవర్ సప్లైలో హెచ్చుతగ్గులు (ఫ్లక్చుయేషన్స్) లేదా సర్జ్‌లు వచ్చినప్పుడు, సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే వాడని ఛార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అన్‌ప్లగ్ చేయడం మంచిది. కానీ ఫ్రిజ్, మెడికల్ పరికరాలు, సెక్యూరిటీ కెమెరాల వంటివి నిరంతరం పనిచేయాలి. కాబట్టి వాటిని అనవసరంగా ఆఫ్ చేయకూడదు.

55
స్టాండ్‌బై పవర్ కంట్రోల్ చేస్తే ఎంత కరెంట్ ఆదా అవుతుంది?
Image Credit : Getty

స్టాండ్‌బై పవర్ కంట్రోల్ చేస్తే ఎంత కరెంట్ ఆదా అవుతుంది?

స్టాండ్‌బై పవర్ వల్ల ఇంటి కరెంట్ వాడకం కాస్త పెరుగుతుంది… అయితే దీని కంట్రోల్ చేయడం వల్ల ప్రతి ఇంట్లో ఆదా అయ్యే యూనిట్లు ఒకేలా ఉండవు. ఇంట్లోని పరికరాల సంఖ్య, వాటి పవర్ వాడకం, స్టాండ్‌బై సామర్థ్యం, వాడే సమయం, కరెంట్ టారిఫ్ వంటి వాటిపై ఆదా ఆధారపడి ఉంటుంది. కాబట్టి 'రాత్రిపూట అన్‌ప్లగ్ చేస్తే ఏడాదికి ఇన్ని యూనిట్లు కచ్చితంగా ఆదా అవుతాయి' అని కచ్చితంగా చెప్పలేం.

మొత్తంమీద పడుకునే ముందు ఇంట్లో ఒకసారి తిరిగి వాడని ఛార్జర్లు, అడాప్టర్లు, అనవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలు ప్లగ్‌లో ఉన్నాయేమో చూసుకోవడం మంచి అలవాటు. దీనివల్ల అనవసరమైన స్టాండ్‌బై పవర్ వాడకాన్ని తగ్గించవచ్చు. అదే సమయంలో నిరంతరం పనిచేయాల్సిన ఫ్రిజ్, మెడికల్ పరికరాలు, సెక్యూరిటీ కెమెరాలు వంటి వాటిని పొరపాటున కూడా అన్‌ప్లగ్ చేయకూడదు. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే కరెంట్ వాడకాన్ని, నెలవారీ ఖర్చును కంట్రోల్ చేయడానికి సాయపడతాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Related Stories
Recommended image1
Free Current : తెలుగోళ్లకు బంపరాఫర్... ప్రభుత్వం నుండి నెలనెలా రూ.1800, ఏటా రూ.21,600
Recommended image2
FREE current: ఉచిత విద్యుత్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved