MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Hotel Secrets : హోటల్ రూమ్‌లో గోడ గడియారం ఎందుకుండదు? దీనివెనక ఇంతపెద్ద బిజినెస్ ట్రిక్ దాగుందా?

Hotel Secrets : హోటల్ రూమ్‌లో గోడ గడియారం ఎందుకుండదు? దీనివెనక ఇంతపెద్ద బిజినెస్ ట్రిక్ దాగుందా?

ఫైవ్ స్టార్ హోటల్ అయినా, మామూలు లాడ్జ్ అయినా... గదిలో గోడ గడియారం అస్సలు కనిపించదు. దీని వెనుక ఓ బలమైన సైకలాజికల్, బిజినెస్ ట్రిక్ దాగుంది… అందేంటో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 05 2026, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హోటల్ గదిలో గడియారం ఎందుకు ఉండదు?
Image Credit : Gemini AI

హోటల్ గదిలో గడియారం ఎందుకు ఉండదు?

మనం హోటల్‌కు వెళ్లినప్పుడు రూమ్‌లోకి అడుగుపెట్టగానే అక్కడ ఏమేం వస్తువులు ఉన్నాయో చూస్తాం. ఇలా గోడలవైపు చూస్తే అంతా ఖాళీగా ఉంటుంది… ఒక్క గడియారం కూడా కనిపించదు. రూం అందం దెబ్బతింటుందనో లేక హోటల్ వాళ్లు మర్చిపోయారేమో అనుకుంటే పొరబడినట్లే… కావాలనే గోడ గడియారం పెట్టరు. దీని వెనుక మూడు ముఖ్యమైన కారణాలున్నాయి. మన మంచికోసమే ఇవి తెలుసుకోవడం బెటర్… లేదంటే నష్టపోయేది మనమే.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1. సమయాన్ని మరిపించడమే మొదటి లక్ష్యం
Image Credit : Getty

1. సమయాన్ని మరిపించడమే మొదటి లక్ష్యం

మీరు సమయం గురించి అస్సలు పట్టించుకోకూడదనే హోటళ్లు కోరుకుంటాయి. గడియారం చూస్తే, 'అయ్యో, చెక్-అవుట్ టైమ్ అయిపోతోంది'. వెంటనే బయల్దేరాలి' అనే టెన్షన్ మొదలవుతుంది. గడియారం లేకపోతే మీరు రిలాక్స్‌గా ఉంటారు. హోటల్‌లో ఎంత ఎక్కువ సేపు ఉంటే, అంతగా రూమ్ సర్వీస్, స్పా, బార్, రెస్టారెంట్లలో ఖర్చు చేస్తారు. దీన్నే 'క్యాసినో స్ట్రాటజీ' అంటారు. హోటల్లో మాదిరిగానే క్యాసినోలలో కూడా గడియారాలు ఉండవు… దీనివెనక కూడా ఇదే స్ట్రాటజీ దాగుంది.

 

35
2. లేట్ చెక్-అవుట్ చేయించడం
Image Credit : AI Image

2. లేట్ చెక్-అవుట్ చేయించడం

గదిలో గడియారం ఉంటే ఉదయం 10 గంటలకే చెక్-అవుట్ చేయడానికి తొందరపడతారు. గడియారం లేకపోవడం వల్ల, మీరు ఫోన్‌లో టైమ్ చూసుకుంటారు లేదా రిసెప్షన్‌కు ఫోన్ చేసి అడుగుతారు. అప్పుడు హోటల్ సిబ్బంది, 'సార్, మరికొంత సేపు ఉండండి, లేట్ చెక్-అవుట్ ఆఫర్ ఉంది' అని చెబుతారు. దీనికి వాళ్లు అదనంగా డబ్బు వసూలు చేస్తారు. ఇదే వాళ్ల వ్యాపార ట్రిక్.

45
3. డిజిటల్ యుగం, ఖర్చు తగ్గించుకోవడం
Image Credit : Getty

3. డిజిటల్ యుగం, ఖర్చు తగ్గించుకోవడం

ఇప్పుడు అందరి దగ్గరా మొబైల్, ల్యాప్‌టాప్ ఉంటున్నాయి. వాటిలోనే టైమ్ చూసుకోవచ్చు. అలాంటప్పుడు ప్రత్యేకంగా గోడ గడియారం పెట్టి, దానికి బ్యాటరీలు మార్చి, మెయింటెయిన్ చేయడం అంతా హోటల్‌కు అనవసరమైన ఖర్చు. కొన్నిసార్లు గెస్టులు గడియారాలను పగలగొట్టడం లేదా తీసుకెళ్లిపోవడం వంటివి చేస్తుంటారు. అందుకే ఈ తలనొప్పి ఎందుకని హోటల్ యాజమాన్యాలు గడియారాలు పెట్టడం మానేశాయి.

 

55
మరి సమయం చూడటం ఎలా?
Image Credit : Getty

మరి సమయం చూడటం ఎలా?

ఇప్పుడు చాలా హోటళ్లలో బెడ్‌ పక్కన డిజిటల్ అలారం క్లాక్ పెడుతున్నారు. లేదంటేటీవీ స్క్రీన్‌పైనే సమయం కనిపిస్తుంది. రిసెప్షన్‌కు ఫోన్ చేసినా టైమ్ చెబుతారు. కాబట్టి, నెక్స్ట్ టైమ్ హోటల్‌కు వెళ్లినప్పుడు గోడపై గడియారం లేకపోతే ఆశ్చర్యపోకండి. మిమ్మల్ని మరికొంత సేపు అక్కడే ఉంచి, డబ్బు సంపాదించడానికే ఈ స్మార్ట్ ట్రిక్ అని అర్థం చేసుకోండి.

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Andhra Kashmir: ఆంధ్రాలో మంచు కురిసే ఏకైక ప్రాంతం ఇదే.. అందుకే ఆంధ్రా కాశ్మీర్ పేరు
Recommended image2
రూ.13 వేలకే 46 ఇంచుల స్మార్ట్ టీవీ, పైగా 15 ఫ్రీ గిఫ్ట్స్.. హైదరాబాద్‌లోని ఈ షాపుల్లో భారీ ఆఫర్లు
Recommended image3
కన్నకొడుకుల్ని విదేశాలకు పంపి.. అక్కడి నుంచి కుక్కల్ని తెచ్చుకుంటున్నారు, గరికపాటి మాస్ కౌంటర్
Related Stories
Recommended image1
Hotel Secrets : హోటల్ రూమ్స్ కి మామూలు తాళాలు కాకుండా కీ కార్డ్స్ వాడతారు.. ఎందుకో తెలుసా?
Recommended image2
Hotel Room Secrets : హోటల్ రూమ్‌లో బెడ్ ముందే అద్దం ఉంటుంది.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved