MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Solar vs Electricity : కరెంట్ బిల్ కట్టాలా? సోలార్ పెట్టుకోవాలా? ఇంటి ఖర్చు తగ్గాలంటే ఏది బెస్ట్ ఆప్షన్?

Solar vs Electricity : కరెంట్ బిల్ కట్టాలా? సోలార్ పెట్టుకోవాలా? ఇంటి ఖర్చు తగ్గాలంటే ఏది బెస్ట్ ఆప్షన్?

ప్రతినెలా కట్టే కరెంట్ బిల్లుకు ఫుల్‌స్టాప్ పెట్టడానికి సోలార్ ప్యానెల్స్ పెట్టాలా? లేదంటే నెలనెలా కరెంట్ బిల్లు కట్టడమే లాభదాయకమా? లాంగ్ రన్‌లో ఏది లాభమో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మరి మీ ఇంటి ఖర్చు తగ్గించుకునేందుకు ఏది బెస్ట్ ఛాయిస్?

3 Min read
Author : Arun Kumar P
Published : Aug 14 2026, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సోలార్ సిస్టమ్ పెట్టడం లాభమా?
Image Credit : ChatGPT

సోలార్ సిస్టమ్ పెట్టడం లాభమా?

ప్రతినెలా వచ్చే కరెంట్ బిల్లు చూసి "ఇక ఇంట్లో సోలార్ ప్యానెల్ పెట్టేస్తే ఈ బిల్లు గోల ఉండదు కదా?" అని చాలామంది అనుకుంటారు. కానీ సోలార్ పెట్టాలంటే మొదట్లోనే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాలి. అదే కరెంట్ కనెక్షన్‌కు మొదట్లో పెట్టుబడి అవసరం లేదు, కానీ జీవితాంతం బిల్లు కడుతూనే ఉండాలి. ఇంతకీ సోలార్ సిస్టమ్ పెట్టడం లాభమా? లేక కరెంటు బిల్లు కట్టుకోవడమే బెటరా? ఓ సింపుల్ లెక్కతో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోలార్‌తో ఎంత కరెంట్ వస్తుంది?
Image Credit : gemini

సోలార్‌తో ఎంత కరెంట్ వస్తుంది?

మంచి వాతావరణంలో 1 kW గ్రిడ్-కనెక్టెడ్ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ రోజుకు సగటున 4-5 యూనిట్ల వరకు కరెంటును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్యానెల్స్ లైఫ్‌టైమ్ 25 ఏళ్ల వరకు ఉంటుంది. అంటే 1 kW సోలార్ సిస్టమ్ ఏడాదికి సుమారు 1,460-1,825 యూనిట్ల వరకు కరెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ సూర్యరశ్మి, నీడ, ప్యానెల్ నాణ్యత, ఇంటి పైకప్పు నిర్మాణం, నిర్వహణ వంటి కారణాలతో ఉత్పత్తిలో మార్పులు ఉంటాయి. 1 kW సోలార్ సిస్టమ్ పెట్టడానికి దాదాపు 10 చదరపు మీటర్ల నీడ పడని ఖాళీ స్థలం అవసరం.

2–3 kW సోలార్ ఎవరికి కరెక్ట్?

ఒక ఇంట్లో నెలకు 200–300 యూనిట్ల కరెంట్ వాడితే, వాళ్లు 2 kW లేదా 3 kW రూఫ్‌టాప్ సోలార్ గురించి ఆలోచించవచ్చు. 2 kW సోలార్ సిస్టమ్ రోజుకు సుమారు 8–10 యూనిట్లు, 3 kW సోలార్ సిస్టమ్ రోజుకు సుమారు 12–15 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. అయితే వర్షాలు, మబ్బులు, నీడ వల్ల ఉత్పత్తి తగ్గవచ్చు.

Related Articles

Related image1
Solar Kitchen: కరెంట్ వాడరు, గ్యాస్ వెలిగించరు..కానీ రోజూ 50వేల మందికి భోజనం, ఇదెలా సాధ్యం?
Related image2
Now Playing
రైతులందరికీ ఫ్రీగా సోలార్ పెట్టిస్తాం: CM Chandrababu Speech | Solar | Farmers | Asianet News Telugu
35
సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు సబ్సిడీ
Image Credit : gemini

సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు సబ్సిడీ

కేంద్ర ప్రభుత్వ 'పీఎం సూర్యఘర్ యోజన (PM-Surya Ghar: Muft Bijli Yojana)' పథకం కింద, ఇళ్లపై సోలార్ సిస్టమ్స్ పెట్టుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం… మొదటి 2 kW సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60% వరకు, అదనంగా మరో 1 kW సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే దీనిపై 30% వరకు సబ్సిడీ ఇస్తారు. 3 kW దాటితే అదనపు సబ్సిడీ ఉండదు. దీనివల్ల 3 kW వరకు సోలార్ సిస్టమ్ పెట్టుకునే వాళ్లకు పెట్టుబడి భారం తగ్గుతుంది.

45
ఎలక్ట్రిసిటీ బిల్లు vs సోలార్ ... దేంతో ఖర్చు తక్కువ?
Image Credit : Chhattisgarh PR

ఎలక్ట్రిసిటీ బిల్లు vs సోలార్ ... దేంతో ఖర్చు తక్కువ?

ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. ఓ ఇంట్లో నెలకు సగటున 250 యూనిట్ల కరెంట్ వాడుతున్నారనుకుందాం.

ఆప్షన్ 1 : సోలార్ లేకుంటే ప్రతినెలా కరెంట్ బిల్లు కట్టాలి. ఏడాదికి 12 నెలలూ ఈ బిల్లు తప్పదు. భవిష్యత్తులో టారిఫ్, వాడకం, ఫిక్స్‌డ్ ఛార్జీలు మారితే ఖర్చు కూడా మారుతుంది.

ఆప్షన్ 2 : రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ పెట్టడానికి మొదట పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. కానీ ఆ తర్వాత ఇంట్లోనే తయారైన కరెంటును వాడుకోవచ్చు. వాడగా మిగిలిన కరెంటును గ్రిడ్‌కు పంపితే, నిబంధనల ప్రకారం దానిపై క్రెడిట్/సెటిల్‌మెంట్ కూడా పొందొచ్చు. అందుకే సోలార్‌ను "ఈరోజు ఖర్చు పెడితే రేపటి నుంచి ఫ్రీ కరెంట్" అని కాకుండా "ఈరోజు పెట్టుబడి పెట్టి ఏళ్ల తరబడి కరెంట్ ఖర్చు తగ్గించుకునే ఆస్తి"గా చూడాలి.

సోలార్ ప్యానెల్స్ పెట్టినా రాత్రిపూట కరెంట్ ఉత్పత్తి కాదు… ఈ విషయాన్ని విద్యుత్ శాఖ స్పష్టంగా చెబుతోంది. సోలార్ ఉత్పత్తి లేని సమయాల్లో గ్రిడ్ నుంచే కరెంట్ తీసుకోవాలి. అందుకే ఇంట్లో బ్యాటరీ బ్యాకప్ లేకపోతే రాత్రిపూట వాడకానికి ఎలక్ట్రిసిటీ సప్లై కచ్చితంగా అవసరం. అలాగే బ్యాటరీ సోలార్ సిస్టమ్, ఆన్-గ్రిడ్ సోలార్ సిస్టమ్ రెండూ ఒకటి కాదు. బ్యాటరీ కూడా పెట్టాలనుకుంటే పెట్టుబడి ఇంకా బాగా పెరుగుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే… తక్కువ కాలానికి చూస్తే కరెంట్ బిల్లు కట్టడమే సులభమైన మార్గం. ఎక్కువ కాలానికి చూస్తే సరైన కెపాసిటీతో సోలార్ సిస్టమ్ పెట్టి, సబ్సిడీ వాడుకుంటే కరెంట్ ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. కానీ సోలార్ కొనేముందు కేవలం ప్యానెల్ ధర మాత్రమే చూడకూడదు. ఇన్‌స్టాలేషన్ ఖర్చు, సబ్సిడీ, ఇన్వర్టర్, మెయింటెనెన్స్, మీ నెలవారీ యూనిట్ల వాడకం, పైకప్పుపై ఎండ, బిల్లింగ్ విధానం.. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకోవాలి.

మీ ఇంట్లో కరెంట్ వాడకం ఎక్కువగా ఉండి, ఎండ బాగా పడే పైకప్పు ఉంటే సోలార్ సిస్టమ్ అనేది కేవలం "బిల్లు తగ్గించే పరికరం" మాత్రమే కాదు, అది దీర్ఘకాలంలో ఖర్చును నియంత్రించే ఒక పెట్టుబడి.

55
ఎవరికి సోలార్ మంచిది, ఎవరికి కరెంట్ బిల్లు మంచిది?
Image Credit : Getty

ఎవరికి సోలార్ మంచిది, ఎవరికి కరెంట్ బిల్లు మంచిది?

నెలకు ఎక్కువ కరెంట్ వాడే ఇళ్లకు, నీడ పడని విశాలమైన పైకప్పు ఉన్నవాళ్లకు, చాలా ఏళ్లు అదే ఇంట్లో ఉండాలనుకునే వాళ్లకు సోలార్ ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా పగటిపూట ఇంట్లో కరెంట్ వాడకం ఎక్కువగా ఉంటే సోలార్ కరెంటును నేరుగా వాడుకోవచ్చు. దీనివల్ల గ్రిడ్ నుంచి కరెంట్ కొనాల్సిన అవసరం తగ్గుతుంది. దీనికి బదులుగా, కరెంట్ వాడకం చాలా తక్కువగా ఉండి, త్వరలో ఇల్లు మారే అవకాశం ఉంటే, సోలార్‌పై పెట్టిన పెట్టుబడి తిరిగి రావడానికి చాలా సమయం పట్టొచ్చు.

సోలార్ సిస్టమ్‌కు అస్సలు మెయింటెనెన్స్ అవసరం లేదనుకుంటే పొరపాటే. ప్యానెల్స్‌పై దుమ్ము చేరితే కరెంట్ ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. జాగ్రత్తగా వాడుకుంటే రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్ లైఫ్‌టైమ్ సుమారు 25 ఏళ్లు ఉంటుంది. అంతేకాదు పీఎం సూర్య ఘర్ పథకం కింద గుర్తింపు పొందిన వెండర్ ద్వారా సోలార్ సిస్టమ్ పెడితే, వాళ్లు 5 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ అందించాలని MNRE సూచనలు చెబుతున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
పకోడీలు, పూరీలు వేయించాక మిగిలిన నూనెను పారేస్తున్నారా? దాన్ని ఇలా తెలివిగా వాడేయండి
Recommended image2
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
Recommended image3
Viral Post: నాకు మొగుడు కావాలంటే ఈ 11 రూల్స్ పాస్ అవ్వాల్సిందే.. షాకింగ్ వైరల్ పోస్ట్ !
Related Stories
Recommended image1
Solar Kitchen: కరెంట్ వాడరు, గ్యాస్ వెలిగించరు..కానీ రోజూ 50వేల మందికి భోజనం, ఇదెలా సాధ్యం?
Recommended image2
Now Playing
రైతులందరికీ ఫ్రీగా సోలార్ పెట్టిస్తాం: CM Chandrababu Speech | Solar | Farmers | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved