MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Transgenders : హిజ్రాలు ఎందుకు అడుక్కుంటారు? ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతుందో వీళ్లకు ఎలా తెలుస్తుంది?

Transgenders : హిజ్రాలు ఎందుకు అడుక్కుంటారు? ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతుందో వీళ్లకు ఎలా తెలుస్తుంది?

మారుమూల ప్రాంతంలో ఫంక్షన్ జరుగుతున్నా హిజ్రాాలకు సమాచారం అందుతుంది… ఇందుకోసం వాళ్లు స్పెషల్ నెట్ వర్క్ ఏర్పాటుచేసుకున్నారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?

4 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 09 2026, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ట్రాన్స్ జెండర్స్ డబ్బులు వసూళ్ల వివాదం
Image Credit : Gemini AI

ట్రాన్స్ జెండర్స్ డబ్బులు వసూళ్ల వివాదం

కొత్త ఇంటి గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు పిలిచిన అతిథులు వస్తారో రారో తెలీదుగానీ పిలవని అతిథులుగా ట్రాన్స్ జెండర్స్ రావడం కాయం. ఇంటిముందు టెంట్ కనిపిస్తే చాలు హిజ్రాలు ఊడిపతారు... వేలల్లో డబ్బులు డిమాండ్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తారు. ఇటీవల కాలంలో వీరి దౌర్జన్యాలు మరీ ఎక్కువయ్యాయి... ఎంతలా అంటే అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఇంటివారిపైనే దాడులకు దిగే స్థాయికి పరిస్థితి వచ్చింది. ఇక వారి నోటినుండి వచ్చే తిట్లు, చీరఎత్తి చేసే చేష్టలగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ట్రాన్స్ జెండర్ ముఠాల ఆగడాలు తట్టకోలేక కొందరు పోలీసులను ఆశ్రయిస్తున్న ఘటనలు ఉన్నాయి.

శుభకార్యాల సమయంలో ఆశీర్వదించేందుకు వచ్చే హిజ్రా సమూహాలకు డబ్బులు ఇవ్వడం ఒకప్పటి సాంప్రదాయం. కానీ ఇది ఇప్పుడు డబ్బులు వసూలు చేసే దందాగా మారింది... చాలామంది వీరి వల్ల ఇబ్బందిపడ్డారు, కానీ ఎవరు తమ బాధను బైటపెట్టలేదు. అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ తన గృహప్రవేశం సందర్భంగా ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఎంతో ఆనందంగా ఫంక్షన్ జరుపుకుంటుంటే కొందరు ట్రాన్స్ జెండర్స్ వచ్చి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారని తెలిపారు. వీళ్ల వల్ల తాను ఫంక్షన్‌ను సంతోషంగా జరుపుకోలేకపోయానని తెలిపింది.

అరియానా ట్రాన్స్ జెండర్స్ దౌర్జన్యం గురించి స్పందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెకు నెటిజన్స్ నుండి సపోర్ట్ లభిస్తోంది... ట్రాన్స్ జెండర్స్ నుండి తమకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని చాలామంది చెబుతున్నారు. ఇలా ఫంక్షన్లలో హిజ్రాల డబ్బులు వసూలు వ్యవహారంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో అసలు శుభకార్యాలకు హిజ్రాలు రావడం ఎలా ప్రారంభమైంది? ఆశీర్వాదాలకు డబ్బులు ఇవ్వడం వెనుక ఉన్న సంప్రదాయం ఏమిటి? కాలక్రమేనా ఈ వ్యవహారంలో ఎలా మారింది? అసలు ఎక్కడ ఏ ఫంక్షన్ జరుగుతోంది హిజ్రాలకు ఎలా తెలుసుంది? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హిజ్రాలను శుభకార్యాలకు పిలిచే సాంప్రదాయం ఎలా వచ్చింది?
Image Credit : Getty

హిజ్రాలను శుభకార్యాలకు పిలిచే సాంప్రదాయం ఎలా వచ్చింది?

భారతీయ సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ కు శతాబ్దాలుగా ప్రత్యేకమైన సామాజిక, సాంస్కృతిక స్థానం ఉందని చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా కొన్ని సంప్రదాయాల్లో వారి ఆశీర్వాదానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేవారు. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులను, పుట్టిన శిశువులను లేదా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే కుటుంబాలను హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని ప్రజలు నమ్మేవారు. ఈ నమ్మకమే శుభకార్యాలకు వారిని ఆహ్వానించే సంప్రదాయానికి దారితీసింది.

గతంలో శుభకార్యాలకు వచ్చే హిజ్రాలు కేవలం ఆశీర్వదించి వెళ్లిపోకుండా పాటలు పాడటం, చప్పట్లు కొట్టడం, నృత్యాలు చేయడం వంటి కార్యక్రమాలతో అక్కడి వాతావరణాన్ని సందడిగా మార్చేవారు. కుటుంబ సభ్యులు కూడా వారిని గౌరవంగా స్వాగతించి తమకు తోచినంత మొత్తాన్ని కానుకగా ఇచ్చేవారు. ఇచ్చిన డబ్బును స్వీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. అంటే సంప్రదాయ విశ్వాసం ప్రకారం ఆశీర్వదించడంతో పాటు వినోదాత్మక ప్రదర్శన చేసినందుకు కానుకగా డబ్బులు ఇచ్చేవారు. ఇలా ఇటు శుభకార్యం చేసేవాళ్లు, అటు ట్రాన్స్ జెండర్స్ హ్యాపీగా ఉండటంతో ఈ సాంప్రదాయం చాలాకాలం కొనసాగింది.

అయితే కాలక్రమంలో ఈ వ్యవహారంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. శుభకార్యాలకు ఆహ్వానం లేకపోయినా ట్రాన్స్‌జెండర్ సమూహాలు అక్కడికి చేరుకుని డబ్బులు అడుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో తమకు తోచినంత మొత్తాన్ని ఇస్తే తీసుకునే పరిస్థితి ఉండేది... ఇప్పుడు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని కార్యక్రమాల నిర్వాహకులు చెబుతున్నారు. పెద్ద స్థాయిలో జరిగే వేడుకలు, ఖరీదైన ఫంక్షన్ హాళ్లు లేదా కొత్త ఇళ్ల గృహప్రవేశాల వంటి సందర్భాల్లో మరింత ఎక్కువ మొత్తం అడుగుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఏ ఫంక్షన్ జరిగినా హిజ్రాల వస్తారు... అడిగినన్ని డబ్బులు ఇవ్వడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తే ఒత్తిడి చేయడం, గొడవకు దిగడం, అసభ్యంగా మాట్లాడటం వంటివి చేస్తారు. ఇదే అంశాన్ని అరియానా గ్లోరీ తన గృహప్రవేశం అనుభవంతో ప్రస్తావించారు... ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీయడంతో ఈ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది.

Related Articles

Related image1
Transgender Dream: పదేపదే మీ కలలో ఒక ట్రాన్స్ జెండర్ కనిపిస్తున్నారా.. అయితే జరిగేది ఇదే
Related image2
Transgender Clinic: ఉస్మానియా ఆస్ప‌త్రిలో ట్రాన్స్ జెండర్ క్లినిక్ ప్రారంభం..
34
శుభకార్యం గురించి సమాచారం హిజ్రాలకు ఎలా తెలుస్తుంది?
Image Credit : AI Generated

శుభకార్యం గురించి సమాచారం హిజ్రాలకు ఎలా తెలుస్తుంది?

అసలు ప్రశ్న ఏమిటంటే.. శుభకార్యం ఎక్కడ జరుగుతుందో ట్రాన్స్ జెండర్స్ కి ఎలా తెలుస్తోంది? ఒక ఇంట్లో గృహప్రవేశం లేదా ఇతర కార్యక్రమం జరుగుతున్న విషయం చుట్టుపక్కల వారికి తెలిసేకంటే ముందే హిజ్రాలకు తెలిసిపోతుంది. ఇందుకోసం ఫంక్షన్ల సమాచారం కోసం హిజ్రాలు ఓ నెట్ వర్క్ ఏర్పాటుచేసుకున్నారట... అందువల్లే అందరికంటే ముందే వీరికి సమాచారం చేరుతోందట.

కొందరు వ్యక్తులు ట్రాన్స్‌జెండర్ సమూహాలకు ఫంక్షన్ల సమాచారాన్ని చేరవేస్తున్నారట. ముఖ్యంగా గృహప్రవేశం సమయంలో చాలామంది గోపూజ చేస్తారు... మొట్టమొదట గోపాదమే ఇంట్లో పడేలా చూస్తారు. ఇలా గోమాతను తీసుకువచ్చేవాళ్లు గృహప్రవేశం గురించి ట్రాన్స్ జెండర్స్ కి చెబుతారట. ఇక టెంట్ హౌస్ నిర్వాహకులు, వాచ్‌మెన్లు, సన్నాయిమేళం వాళ్లు కూడా శుభకార్యాల సమాచారం హిజ్రాలకు చేరవేస్తారట.

ఇంతటితో ఈ సమాచార వ్యవస్థ ఆగిపోదు... చివరకు గృహప్రవేశం కోసం పూజలు నిర్వహించే పంతుళ్లు, కొత్త ఇంటిని నిర్మించిన బిల్డర్లు లేదా నిర్మాణ పనులతో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా కూడా హిజ్రాలకు సమాచారం అందుతుందట. గతంలో ఇలాంటి సమాచారం కేవలం ‘ఫలానా చోట ఫంక్షన్ ఉంది’ అనే స్థాయిలో ఉండేదని, ఇప్పుడు ఏకంగా ఇంటి లొకేషన్‌తో సహా వివరాలు పంపుతున్నారని కొందరు పేర్కొంటున్నారు.

44
హిజ్రాలకు సమాచారం ఇస్తే లాభమేంటి?
Image Credit : Getty

హిజ్రాలకు సమాచారం ఇస్తే లాభమేంటి?

ఫంక్షన్స్ గురించి సమాచారం ఇచ్చినందుకు గతంలో కొంతమంది రూ.200 నుంచి రూ.300 వరకు తీసుకునేవారట... ఇప్పుడు అదే సమాచారం కోసం రూ.1,000 నుంచి రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారని కొందరు ట్రాన్స్ జెండర్స్ చెబుతున్నారు. సమాచారం అందించేవారికి ఇంత మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది… అందుకే తాము కూడా కార్యక్రమాలకు వెళ్లినప్పుడు గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తాన్ని అడుగుతున్నామని హిజ్రాలు చెబుతున్నారు.

శుభకార్యాలకు వెళ్లి ఆశీర్వదించడం ఒక సంప్రదాయంగా కొనసాగవచ్చు. అయితే ఆశీర్వాదం పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, బెదిరించడం లేదా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం వంటి చర్యలు జరిగితే అవి సమర్థించదగినవి కావు. అదే సమయంలో కొందరి ప్రవర్తన ఆధారంగా మొత్తం ట్రాన్స్‌జెండర్ సమాజాన్ని తప్పుబట్టడం కూడా సరికాదు. వ్యక్తుల ప్రవర్తనను, సమాజం మొత్తాన్ని వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉంది.

అయితే ట్రాన్స్ జెండర్స్ ఇబ్బందులు కలిగిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలంగాణ డిజిపి సివి ఆనంద్ సూచిస్తున్నారు. పోలీసులు కూడా హిజ్రాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని.. అవసరం అయితే గతంలో మాదిరిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని డిజిపి ఆదేశించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
పర్ఫ్యూమ్ ఎలా త‌యారు చేస్తారు.? ఎక్కువ సేపు వాస‌న ఉండ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా.?
Recommended image2
80s Look Prompt: ఇన్‌స్టాగ్రామ్‌ను ఊపేస్తున్న కొత్త AI ట్రెండ్.. ఒక్క క్లిక్‌తో 1980ల్లో బాలీవుడ్ హీరో, హీరోయిన్‌లా మీరు మారిపోవచ్చు!
Recommended image3
Motivational Story: నిజమైన బలవంతుడు ఎవరు..? మీ ఆలోచనను మార్చే కథ ఇది..!
Related Stories
Recommended image1
Transgender Dream: పదేపదే మీ కలలో ఒక ట్రాన్స్ జెండర్ కనిపిస్తున్నారా.. అయితే జరిగేది ఇదే
Recommended image2
Transgender Clinic: ఉస్మానియా ఆస్ప‌త్రిలో ట్రాన్స్ జెండర్ క్లినిక్ ప్రారంభం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved