- Home
- Entertainment
- ప్రియా ప్రకాశ్ చేతినిండా సినిమాలే.. అయినా ఏం లాభం.. చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న మలయాళీ భామ!
ప్రియా ప్రకాశ్ చేతినిండా సినిమాలే.. అయినా ఏం లాభం.. చీరకట్టులో మెస్మరైజ్ చేస్తున్న మలయాళీ భామ!
చిన్న వీడియో క్లిప్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకుంది మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ (Priaya Prakash Varrier). ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కేరీర్ సాగుతున్నా.. స్టార్ స్టేటస్ కు దూరంగానే ఉంది.

హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవడం ఒక ఎత్తైతే... ఆ అవకాశాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా హీరోయిన్లు వెండితెరపై నిత్యం వెలుగొందాలంటే చాలా కష్టం. అందులోనూ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లం మహా కష్టమనే చెప్పాలి. అందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్లాలి.
కేరళకు చెందిన యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ కేరీర్ కూడా ప్రస్తుతం ఆందోళనగానే సాగుతోంది. చేతి నిండా సినిమాలున్నా.. కుర్ర భామ సందడి పెద్దగా కనిపించడం లేదు. ఇందుకు కారణం ఈ బ్యూటీకి సరైన హిట్టు పడకపోవడమే అంటున్నారు.
వచ్చిన ఆఫర్లను ఓకే చేస్తూ పోతున్న ఈ బ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. కానీ ఫలితాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాలుగేండ్లు దాటినా ఇప్పటికీ ఒక సాలిడ్ హిట్ ను కూడా ప్రియా ప్రకాశ్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది. అయినా ఆఫర్లను అందుకుంటోంది.
చేతినిండా సినిమాలు ఉన్నా హిట్ లేకపోవడంతో.. ఈ బ్యూటీ ఇంకా స్టార్ హోదాకు దూరంగానే ఉంది. తనతో పాటు కేరీర్ ను స్టార్ట్ చేసిన Krithi Shetty, Sree leela హిట్లతో దూసుకుపోతున్నారని, కానీ ప్రియకు మాత్రం ఇంకా మంచి సినిమా పడలేదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మలయాళ చిత్రం ‘ఓరు అదార్ లవ్’తో హీరోయిన్ గా అలరించింది. ఈ మూవీలోని కన్నుగీటే సీన్ తో దేశ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. కానీ సినిమా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి నితిన్ సరసన ‘చెక్’, తేజా సజ్జా సరసన ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’లో నటించింది. ఈ చిత్రాలూ పెద్దగా ఆడలేదు.
ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ బాలీవుడ్, మలయాళం చిత్రాలపై ఆశలు పెట్టుకుంది. హిందీ, కన్నడ, మలయాళ భాషలో ఏకంగా 8 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలోంచి ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. అభిమానులు కూడా ఈ ఏడాది ప్రియకు కలిసి వస్తుందని ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రియా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. టూర్లు, వేకేషన్స్ కు వెళ్తున్న ప్రియా అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏకంగా బికినీల్లో ప్రత్యక్షమవుతూ నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.
ప్రస్తుతం తమిళనాడులోని కొడైకెనల్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరకట్టులో మెరిసింది. ఎల్లో శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో పరువాలను ప్రదర్శించింది. కొంటె పోజులతో కట్టిపడేసింది. మత్తు చూపులతో కుర్ర గుండెల్ని పేల్చేసింది. దీంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఈ బ్యూటీ పోస్టు చేసిన పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.