MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే

Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే

Bigg Booss 10 Contestants Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ 16 మంది కంటెస్టెంట్లతో ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. మరి వీరిలో ఎక్కువ పారితోషికం ఎవరికి, అతి తక్కువ ఎవరు తీసుకుంటున్నారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 07 2026, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బిగ్‌ బాస్‌ తెలుగు 10 కంటెస్టెంట్ల పారితోషికాలు
Image Credit : Asianet News

బిగ్‌ బాస్‌ తెలుగు 10 కంటెస్టెంట్ల పారితోషికాలు

బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి క్రేజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. బుల్లితెర స్టార్స్, కమెడీయన్స్, కామనర్స్ తో అదిరిపోయేలా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ కి కొదవ లేదని చెప్పొచ్చు. ఆదివారం(సెప్టెంబర్‌ 6)న సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. 16 మంది కంటెస్టెంట్లు ఇందులో పాల్గొన్నారు. కామనర్స్ నుంచి ఆరుగురు, సెలబ్రిటీ విభాగం నుంచి 10 మంది కంటెస్టెంట్లు వచ్చారు. మరి బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ల పారితోషికాలు ఎంత? ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు? ఎవరికి తక్కువ అనే వివరాలు చూస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అత్యధిక పారితోషికం ముఖేష్‌ గౌడకే
Image Credit : X/@Starmaa

అత్యధిక పారితోషికం ముఖేష్‌ గౌడకే

ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్లలో ముఖేష్ గౌడ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. `గుప్పెడంత మనసు` సీరియల్‌తో రిషి సార్‌గా పాపులర్‌ అయిన ముఖేష్‌ కి బుల్లితెరపై మంచి ఫాలోయింగ్‌. బుల్లితెర స్టార్‌గా రాణిస్తున్నారు. దీంతో ఆయన భారీగా డిమాండ్‌ చేశారట. ఈ లెక్కన ఆయనకు వారానికి నాలుగు లక్షలు చెల్లించేందుకు బిగ్‌ బాస్‌ నిర్వాహకులు రెడీ అయినట్టు సమాచారం.

Related Articles

Related image1
Bigg Boss Telugu 10: మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ?
Related image2
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
37
రామ్‌ ప్రసాద్‌ పారితోషికం ఎంతంటే?
Image Credit : Asianet News

రామ్‌ ప్రసాద్‌ పారితోషికం ఎంతంటే?

ముఖేష్‌ గౌడ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఆటో రామ్‌ ప్రసాద్‌ అని సమాచారం. ఆయనకు వారానికి రూ.3.5 లక్షల నుంచి నాలుగు లక్షల వరకు చెల్లిస్తున్నారని సమాచారం. జబర్దస్త్ కామెడీ షోతో రామ్‌ ప్రసాద్‌ పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. స్టార్‌ కమెడియన్‌గా రాణిస్తున్నారు. సినిమాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ కేటగిరిలో ఆయన్ని బిగ్‌ బాస్‌ కి తీసుకోవడం విశేషం.

47
వర్షిణికి గట్టిగానే రెమ్యూనరేషన్‌
Image Credit : instagram/@varshini_sounderajan

వర్షిణికి గట్టిగానే రెమ్యూనరేషన్‌

వీరితోపాటు యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ కి గట్టిగానే చెల్లిస్తున్నారట. ఆమెకి వారానికి రూ.3.5 నుంచి 3.75 వరకు ఇస్తున్నట్టు సమాచారం. గ్లామర్‌ యాంగిల్‌లో ఆమెని తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలోనూ రెండు మూడుసార్లు ఆమె పేరు వినిపించింది. కానీ రాలేదు. ఇన్నాళ్లకి పదో సీజన్‌లో ఆమె షోకి రావడం విశేషం.

57
అందాల భామ దేబ్జానీ రెమ్యూనరేషన్‌ డిటెయిల్స్
Image Credit : Hostar telugu

అందాల భామ దేబ్జానీ రెమ్యూనరేషన్‌ డిటెయిల్స్

బెంగాలీ అమ్మడు.. సీరియల్‌ నటి `దేబ్జానీ మోదక్‌ బిగ్‌ బాస్‌ లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. టీవీ సీరియల్స్ తో ఆకట్టుకున్న ఆమె బుల్లితెరపై మంచి ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. తాను బిగ్‌ బాస్‌ షోకి రావడం విశేషంగా చెప్పొచ్చు. ఆమెకి వారానికి మూడు లక్షల పారితోషికం ఇస్తున్నారట.

67
కామనర్స్ పారితోషికం వివరాలు
Image Credit : X/@Starmaa

కామనర్స్ పారితోషికం వివరాలు

ఇక కామనర్స్ గా వచ్చిన సింగర్‌ ఝాన్సీ, షాలినీ దామెర, ఆర్జే చరణ్‌, అమన్‌, సృష్టి, రోహిత్‌ నాయుడు వంటి కంటెస్టెంట్లకి సమానంగా వారానికి మూడు లక్షల పారితోషికం ఇస్తున్నారట. వీరితోపాటు నటుడు కృష్ణుడు, త్రిగుణ్‌లకు కూడా మూడు లక్షలు ఇస్తున్నట్టు సమాచారం.

77
అతి తక్కువ పారితోషికం ఎవరికంటే?
Image Credit : Asianet News

అతి తక్కువ పారితోషికం ఎవరికంటే?

వీరితోపాటు జబర్దస్త్ నరేష్‌ కి, చైత్ర రాయ్‌లకు రూ.2.25లక్షలు, టెంపర్‌ వంశీ, యాంకర్‌ సుధీర్‌రెడ్డిలకు రెండు లక్షలు ఇస్తున్నారట. అతి తక్కువ అంటే టెంపర్‌ వంశీ, సుధీర్‌ రెడ్డిలకే అని చెప్పొచ్చు. ఇక ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునకి దాదాపు రూ.40కోట్లు ఇస్తున్నారని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Recommended image2
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Recommended image3
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ?
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved