MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 50 ఏళ్ళు దాటినా శోభన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

50 ఏళ్ళు దాటినా శోభన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా పద్మ భూషణ్ ప్రకటించింది మాజీ హీరోయిన్ శోభనకు. 50 ఏళ్ళు దాటినా ఈ నటి బ్యాచిలర్ గానే ఉన్నారు. ఆమె పెళ్లి చేసుకోకపోడానికి కారణం ఏంటో ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇతకీ ఎంటా కారణం.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 28 2025, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పూరస్కారాల్లో మాజీ హీరోయిన్.. క్లాసికల్ డాన్సర్  శోభన కూడా ఉన్నారు.  హీరోయిన్ గా దాదాపు 200 సినిమాల్లో నటించిన ఆమె.. క్లాసికల్ డాన్సర్ గా దేవ విదేశాల్లో  కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. కళామతల్లికి ఆమె చేసిన సేవకు గానే 2025 కు పద్మభూషన్ అవార్డ్ ఆమెను వరించింది. అయితే 2006 లోనే శోభనకు పద్మశ్రీ వచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇది ఇలా ఉంటే శోభన హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపు ఊపేసింది. సౌత్ లో 90స్ బ్యాచ్ లో ఆమె నటించని స్టార్ హీరో అంటూలేడు. తెలుగు తమిళ, కన్నడ మలయాళ భాషల్లో ఆమె ఆల్మొస్ట్ అందరు హీరోలతో నటించి మెప్పించింది.

తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, తమిళంలో సత్యారాజ్, రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్,  మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది శోభన. 
 

35
Shobana

Shobana

 బేసిక్ గా మలయాళ ఫ్యామిలీకి చెందిన శోభన.. ఏ భాషలో నటించినా.. తమ సొంతం అనే భావన కలిగిస్తుంది. ఇక 54 ఏళ్ళు వచ్చినా.. ఈ హీరోయిన్ ఇంకా బ్యాచిలర్ గానే ఉంది. పెళ్ళి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.

ఈక్రమంలో ఆమె పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అన్న ప్రశ్నఎదురైనప్పుడు ఆమె చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు అందరు. ఓంటర్వ్యూలో పెళ్ళి ప్రస్తావన రాగా.. తనకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని అన్నారు ఆమె. 
 

45

అసలు  తనకు పెళ్లిపై నమ్మకం లేకనే వివాహం చేసుకోలేదని.. పెళ్లి చేసుకుంటే వ్యక్తిగత స్వేచ్ఛ పోతుందని  అన్నారు. బ్యాచిలర్ లైఫ్ తనకు చాలా హ్యాపీగా ఉంది అంటోంది శోభన.  ఆమె సినిమాలకు దూరం అయ్యి చాలా కాలం అయ్యింది. రీసెంట్ గానే ప్రభాస్ కల్కి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు శోభన. అంతే కాదు సినిమాలు వదిలేసినా.. తన డాన్స్ ఫిల్డ్ ను మాత్రం వదల్లేదు శోభన.

55

 ఓ డాన్స్ స్కూల్ ను రన్ చేస్తూ.. తన లాంటి కళాకారుళను తయారు చేస్తోంది. టాలీవుడ్ లో ఆమె వరుసగా మళ్ళీ సినిమాలు ఒప్పుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. బాలయ్య అఖండ 2 తో పాటు.. బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కూడా నటిస్తున్నారని టాక్ వచ్చింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 4 Days Collections: పెద్ది 4 రోజుల్లో రాబట్టింది ఇంతే, ఆదివారం ర్యాంపేజ్‌.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Anchor Suma: కత్తిలాంటి ఫిగర్ సుమ.. అంటూ కామెంట్ చేసిన హీరో ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ రియాక్షన్ ఇదే
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved