MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Nissan Car: రూ. 5 లక్షలకే అదరగొట్టే 7 సీటర్ కారు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల మైలేజ్ గ్రావిట్‌ సొంతం

Nissan Car: రూ. 5 లక్షలకే అదరగొట్టే 7 సీటర్ కారు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల మైలేజ్ గ్రావిట్‌ సొంతం

Nissan Gravite: ఆటోమొబైల్ మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సీటింగ్ కెపాసిటీ, మైలేజ్ కోరుకునే వారి కోసం నిస్సాన్ ఒక సంచలన మోడల్‌తో ముందుకొచ్చింది. నిస్సాన్ సరికొత్తగా విడుదల చేసిన 'నిస్సాన్ గ్రావిట్'7 సీటర్ ఎమ్‌పీవీ కారు మార్కెట్లో దుమ్మురేపుతోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 17 2026, 07:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మధ్యతరగతికి పండగ లాంటి వార్త.. రూ. 5 లక్షలకే నిస్సాన్ 7 సీటర్ కారు
Image Credit : Chatgpt

మధ్యతరగతికి పండగ లాంటి వార్త.. రూ. 5 లక్షలకే నిస్సాన్ 7 సీటర్ కారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న కార్లకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కుటుంబంతో కలిసి ప్రయాణించేందుకు 7 సీటర్ కార్లను చాలామంది ఇష్టపడతారు. అయితే బడ్జెట్ పరిమితుల వల్ల చాలామంది వెనకడుగు వేస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ తన సరికొత్త ఎంపీవీ మోడల్ 'నిస్సాన్ గ్రావిట్' (Nissan Gravite) ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం రూ. 5 లక్షల స్థాయి ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ కారు, మైలేజ్, ఫీచర్లలో పోటీదారులకు గట్టి పోటీ ఇస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కిల్లింగ్ లుక్స్.. మోడర్న్ డిజైన్
Image Credit : X/NissanMotor

కిల్లింగ్ లుక్స్.. మోడర్న్ డిజైన్

నిస్సాన్ గ్రావిట్ బయటి డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. ముందు భాగంలో గ్లోస్ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, దానిపై హెక్సాగాన్ ఇన్సర్ట్‌లు కారుకు మోడర్న్ లుక్‌ను ఇస్తున్నాయి. స్టైలిష్ ఎల్ఈడీ డిఆర్ఎల్‌లు, స్మోక్డ్ హెడ్‌లాంప్స్, టెయిల్ లాంప్స్ కారు రోడ్ ప్రెజెన్స్‌ను మరింత పెంచుతాయి. అంతేకాకుండా 15-అంగుళాల ఫ్లెక్స్ వీల్స్, రూఫ్ రైల్స్, సిల్వర్ యాక్సెంట్స్ ఈ 7 సీటర్ కారుకు ఎస్ యూవీ తరహా అప్పీల్‌ను ఇస్తున్నాయి.

36
కింగ్ సైజ్ క్యాబిన్.. సూపర్ ఫీచర్లు
Image Credit : X/NissanMotor

కింగ్ సైజ్ క్యాబిన్.. సూపర్ ఫీచర్లు

కారు ఇంటీరియర్ విషయంలో నిస్సాన్ ఏమాత్రం రాజీ పడలేదు. 7 మంది సౌకర్యవంతంగా కూర్చునేలా వైడ్ సీటింగ్ ఆప్షన్లను ఇచ్చింది. క్యాబిన్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనితో పాటు 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఆధునిక ఫీచర్లను అందించారు. ప్రయాణికుల సౌకర్యార్థం వెనుక సీట్లకు కూడా ఏసీ వెంట్లు అందుబాటులో ఉన్నాయి.

46
శక్తివంతమైన ఇంజిన్.. లీటరుకు 24 కిమీ మైలేజ్
Image Credit : X/NissanMotor

శక్తివంతమైన ఇంజిన్.. లీటరుకు 24 కిమీ మైలేజ్

నిస్సాన్ గ్రావిట్ 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 71 bhp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇంధన పొదుపు విషయంలో ఇది వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పెట్రోల్ తో పాటు డ్యూయల్ సిలిండర్ తో సిఎన్‌జి వేరియంట్‌లో కూడా ఇది లభిస్తుంది. ఇది అత్యధికంగా లీటరుకు దాదాపు 24 కిలోమీటర్ల వరకు బెస్ట్ మైలేజ్ ఇస్తుండటం దీని ప్లస్ పాయింట్.

56
భద్రతలో కాంప్రమైజ్ లేనే లేదు
Image Credit : X/NissanMotor

భద్రతలో కాంప్రమైజ్ లేనే లేదు

ప్రయాణికుల రక్షణ కోసం ఈ కారులో భద్రతా ఫీచర్లను భారీగా చేర్చారు. స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించడం విశేషం. దీంతో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఫ్రంట్,రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి మోడర్న్ సేఫ్టీ ఫీచర్లు ప్రయాణాన్ని సేఫ్‌గా మారుస్తాయి.

66
ధరలు ఇవే
Image Credit : X/Nissan_India

ధరలు ఇవే

నిస్సాన్ గ్రావిట్ విసియా, ఎసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది. కంపెనీ దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను దాదాపు రూ. 5.65 లక్షల నుంచి నిర్ణయించింది. వివిధ వేరియంట్లను బట్టి 5.65 లక్షల నుంచి రూ. 11.30 లక్షల వరకు ఉన్నాయి. భారత మార్కెట్‌లో మార్కెట్లో ఇప్పటికే ఉన్న రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి ఎర్టిగా, టాటా పంచ్, కియా క్యారెన్స్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు, మైలేజ్ కోరుకునే కుటుంబాలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bikes Offer : రూ.2,80,000 సూపర్ బైక్ కేవలం రూ.4,999 కే మీసొంతం.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔట్
Recommended image2
Top Selling Cars: మారుతి, టాటా, నిస్సాన్ కార్ల సేల్స్ దెబ్బకి రికార్డులు బద్దలు.. నెంబర్ 1 ఎవరంటే?
Recommended image3
New Car Vs Used Car : కొత్త కారా లేక సెకండ్ హ్యాండ్ కారా? 2026లో ఏది కొంటే బెస్ట్!
Related Stories
Recommended image1
UPI Payments: యూపీఐ ఛార్జీల భారం నుంచి తప్పించుకోవడానికి 5 సింపుల్ ట్రిక్స్ ఇవే
Recommended image2
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved