హాట్ సిట్టింగ్‌లో టెంప్ట్ చేస్తున్న వర్మ బ్యూటీ.. కిల్లింగ్ లుక్‌లో ఓరగా చూస్తూ సెగలు రేపుతున్న హాట్ భామ
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ హాట్ అందాలకు కేరాఫ్. ఇండస్ట్రీలో బోల్డ్ అటెంప్ట్ తో సంచలనంగా మారిన ఈ బ్యూటీ ఇటీవల సైలెంట్ అయ్యింది. కానీ అడపాదడపా హాట్ షోతో రచ్చ చేస్తూనే ఉంది.
ఇటీవల క్లోజప్ షాట్స్ లో కైపెక్కించిన ఈ భామ ఇప్పుడు హాట్ సిట్టింగ్‌లో అదరహో అనిపిస్తుంది. తాజాగా మత్తెక్కించే కళ్లతో వొరగా చూస్తూ టెంప్ట్ చేస్తుంది. అదిరిపోయే పోజులతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
ఇందులో తేజస్వి మదివాడ ఓ ఆశ్చర్యపరిచే పోస్ట్ పెట్టింది. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా మీరు మీ ఉత్తమమైన దాన్ని అందించాలి` అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. మరోవైపు హాట్ సిట్టింగ్‌లో ఆమె హాట్ నెస్ మరింత పెరగడం విశేషం.
బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయ్యింది తేజస్విని. అల్లరి పిల్లగా, చలాకీతనంతో కూడిన యాటిట్యూడ్‌తో క్రేజ్‌ని పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇందులో తనదైన గేమ్‌తో ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. అయితే బిగ్ బాస్ లో పాల్గొనడానికి ముందే ఈ అమ్మడు బోల్డ్ గా పాపులారిటీని సొంతం చేసుకుంది.
రామ్‌గోపాల్ వర్మతో `ఐస్ క్రీమ్` చిత్రాలు చేసింది తేజస్వి. ఈ హర్రర్ కామెడీ చిత్రాల్లో తేజస్విని ఆల్ యాంగిల్స్ లో ప్రజెంట్ చేశాడు వర్మ. తేజస్వి అందాలను ఎలా చూపించాలో అలా చూపించారు. అప్పట్లోనే సెక్సీ బ్యూటీగా పేరుతెచ్చిపెట్టాడు. బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా మార్చారు.
అయితే ఆ తర్వాత తేజస్వికి పెద్దగా అవకాశాలు లేవు. ఒకటి అర ఆఫర్లతో కెరీర్‌ని నెట్టుకుంటూ వస్తోంది. ఇటీవల ఆమె `కమిట్‌మెంట్` చిత్రంలో నటించింది. చిత్ర పరిశ్రమలోని కమిట్‌మెంట్లపై వ్యంగ్యాస్త్రంగా దీన్ని తెరకెక్కించారు. ఇందులోనూ బోల్డ్ రోల్‌లో మెప్పించింది తేజస్వి.
అంతేకాదు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అనేక సంచలన విషయాలను వెల్లడించింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయ్యింది. సినిమా అవకాశాలు కావాలంటే కమిట్‌మెంట్లకు ఒప్పుకోవాలని, వాటిని తాను ఫేస్ చేసినట్టు తెలిపింది. వాటిని వద్దనుకున్నాను కాబట్టే ఇలా ఉండిపోయానని, తనకు నచ్చిన సినిమాలే చేస్తున్నానని తెలిపింది. అదే సమయంలో తాను ప్రత్యక్షంగా ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను పంచుకుంది తేజస్వి. ఓ రోజు రాత్రి కొంత మంది మద్యం మత్తులో ఉన్న కుర్రాళ్లు తన వెంటపడ్డారని, వారి నుంచి తప్పించుకుని వచ్చినట్టు తెలిపింది. అది తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని పేర్కొంది.
అయితే ఇండస్ట్రీలోకి మనల్ని ఎవరూ ఒత్తిడి చేయరని, వాటికి లొంగలా వద్దా అనేది మన ఇష్టమని పేర్కొంది. ఈ విషయంలో ఇండస్ట్రీపై ఆరోపణలు చేయడం సరికాదని పరోక్షంగా శ్రీరెడ్డికి కౌంటర్లిచ్చి హాట్ టాపిక్‌గా మారింది తేజస్వి మదివాడ. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ బీబీ జోడీ షోలో అఖిల్‌తో కలిసి డాన్సులు చేస్తూ ఉర్రూతలూగిస్తుంది.