- Home
- Entertainment
- బిగ్ సర్ప్రైజ్..యంగ్ పొలిటీషియన్ ని పెళ్లి చేసుకున్న బోల్డ్ బ్యూటీ.. ఆమె తెలుగు అమ్మాయే తెలుసా..
బిగ్ సర్ప్రైజ్..యంగ్ పొలిటీషియన్ ని పెళ్లి చేసుకున్న బోల్డ్ బ్యూటీ.. ఆమె తెలుగు అమ్మాయే తెలుసా..
స్వర భాస్కర్ సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ పై కూడా తరచుగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. స్వర భాస్కర్ తరచుగా మోడీ ప్రభుత్వంపై విమర్సలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఆమె తరచుగా హిందూ సంఘాలపై కూడా విరుచుకుపడుతుంటారు. అందుకు తగ్గట్లుగానే ఆమె మతాంతర వివాహం చేసుకుని షాక్ ఇచ్చారు.

బోల్డ్ బ్యూటీ స్వరభాస్కర్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ చిత్రాలతో స్వర భాస్కర్ పాపులర్ అయింది. బోల్డ్ రోల్స్ లో నటిస్తూ అందరిని ఆకర్షించింది. అలాగే స్వర భాస్కర్ సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ పై కూడా తరచుగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. స్వర భాస్కర్ తరచుగా మోడీ ప్రభుత్వంపై విమర్సలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం.
ఆమె తరచుగా హిందూ సంఘాలపై కూడా విరుచుకుపడుతుంటారు. అందుకు తగ్గట్లుగానే ఆమె మతాంతర వివాహం చేసుకుని షాక్ ఇచ్చారు. సమాజ్ వాది పార్టీ యువ నేత, యూత్ ప్రెసిడెంట్ ఫహద్ అహ్మద్ ని నేడు ఆమె వివాహం చేసుకున్నారు. కోర్టు పద్దతిలో వీరిద్దరి వివాహం అఫీషియల్ గా జరిగింది. ఆమె వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫహద్, స్వర భాస్కర్ చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారు. ఫహద్ కూడా మోడీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఆ విధంగా ఫహద్, స్వర భాస్కర్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
పెళ్లి చేసుకున్న విషయాన్ని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో స్వర భాస్కర్ పోస్ట్ పెట్టింది. పబ్లిక్ మీటింగ్స్ లో ఇద్దరూ పాల్గొన్న దృశ్యాలు, కోర్టులో పెళ్లి చేసుకుంటున్న దృశ్యాలని షేర్ చేసింది. మనం ప్రేమ కోసం వెతికితే మొదట స్నేహం దొరుకుతుంది. ఆ తర్వాత అది ప్రేమగా మారుతుంది. వెల్కమ్ ఫహద్ అహ్మద్ అంటూ స్వర భాస్కర్ పోస్ట్ చేసింది. స్వర భాస్కర్ తెలుగు అమ్మాయే అని చెప్పాలి. తెలుగు బ్యాగ్రౌండ్ ఉన్న నటి.
ఆమె తండ్రి చిత్రపు ఉదయ్ భాస్కర్ తెలుగు వ్యక్తి. ఆయన ఇండియన్ నేవి లో కమాండర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉదయ్ భాస్కర్ గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి. ఆయా రకంగా స్వర భాస్కర్ తెలుగు అమ్మాయి అనే చెప్పాలి. ఇక ఆమె పెళ్లి విషయానికి వస్తే స్వరభాస్కర్ రెడ్ శారీలో అందంగా కనిపిస్తోంది. ఆమె చీరకి మ్యాచింగ్ అన్నట్లుగా ఫహద్ రెడ్ షేర్వాణీలో స్టైలిష్ గా ఉన్నాడు. పెళ్లి అనంతరం ఇద్దరూ చేతిలో చేయి పట్టుకుని రొమాంటిక్ గా వస్తున్నారు.
మరికొన్ని ఫొటోస్ లో స్వర భాస్కర్ ఫహద్ ఇద్దరూ ప్రేమగా చిరునవ్వులు చిందిస్తూ కౌగలించుకుని కనిపిస్తున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడే స్వర భాస్కర్ పై ట్రోలింగ్ మొదలైంది. స్వర భాస్కర్ అధికారికంగా హిందూ మతాన్ని విడిచిపెట్టింది. అందరూ పండగ చేసుకోండి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వీర్ దే వెడ్డింగ్ చిత్రంలో స్వర భాస్కర్ అసభ్యకరమైన సన్నివేశంలో నటించినప్పటి నుంచి ఆమెపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.