MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • SSMB28: సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మహేష్ బాబు, అప్పుడు పోకిరిలో రన్నింగ్ ట్రైన్.. ఇప్పుడు ఏ లెవలో తెలుసా..?

SSMB28: సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మహేష్ బాబు, అప్పుడు పోకిరిలో రన్నింగ్ ట్రైన్.. ఇప్పుడు ఏ లెవలో తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడా...? అందుకే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. పోకిరిని ఫాలో అవ్వబోతున్నాడా..? మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన పోకిరిలోని సీక్వెన్స్ ను వీరిద్దరు రిపిట్ చేయబోతున్నారా..? అంటే అవుననే అంటున్నారు సినీ జనాలు.  సూపర్ స్టార్ కు సూపర్ హిట్ ఇచ్చిన పోకిరీ సీక్వెన్స్ ను మాటల మాత్రికుడు ఎలా వాడబోతున్నాడో తెలుసా...?

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Sep 03 2022, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతోంది. ఖలేజా తరువాత దాదాపు 12 ఏళ్ల లాంగ్ గ్యాప్ తరువాత వీరి కాంబోలో ఓ భారీ మూవీ రూపొందుతోంది. SSMB28 వర్కింగ్ టైటిల్ తో ఈ  సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై  నిర్మించబోతున్నారు.  ఎప్పుడో రెండు నెలల క్రితమే ఓపెనింగ్ చేసుకున్న ఈసినిమా.. ఈనెలలోసెట్స్ మీదకు వెళ్లబోతోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను  పవర్ ఫుల్  హైవోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ తో  స్టార్ట్ చేయబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీని కోసం త్రివిక్రమ్ అన్ని సన్నాహాలు చేశాడనిసమాచారం. ఒక రకంగా మూవీ సెట్స్ మీదకు లేట్ గా వెళ్లడానికి కూడా ఇదే కారణమని సమాచారం. అయితే దీని కోసం త్రివిక్రమ పోకిరి ఫార్ములాను వాడబోతున్నారట. 

37

మహేష్ బాబుకోసం స్పెషల్ గా ప్లాన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ అంతా కంప్లీట్ గా రన్నింగ్  బస్సులో జరగబోతున్నట్టు తెలుస్తోంది.   ఇలాంటి సీక్వెన్స్ లు మహేష్ కు కలిసి వస్తాయి. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి లో కూడా ఇలానే ప్లాన్ చేసి ఇండస్ట్రీ హిట్  కొట్టాడు పూరీ జగన్నాథ్. టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాసిన పోకిరి సినిమాలో లవ్ ట్రాక్ తో పాటు.. కంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్ లు లోకల్ ట్రైన్ లోనే నడుస్తాయి. 

47

పోకిరి సినిమా మొత్తం మీద లోకల్ ట్రైన్ లో నడిచే సీన్స్ బాగా హైలెట్ అయ్యాయి. వాటి వల్లే పోకిరీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందన్న అబిప్రాయం వ్యాక్తం అయ్యింది. ఇక ఇప్పుడు ఇదే ఫార్ములాని అప్లై చేయబోతున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే పూరీ జగన్నాథ్ పోకిరీలో మహేష్ కోసం లోకల్ ట్రైన్ వాడితే.. త్రివిక్రమ్ మాత్రం SSMB28 కోసం బస్ వాడబోతున్నాడట. 
 

57

త్రివిక్రమ్ SSMB28 కోసం పోకిరిని మించిన  యాక్షన్ ఎపిసోడ్ ని బస్ లో ప్లాన్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ను.. ఫస్ట్ షెడ్యూల్ లోనే కంటీన్యూస్ గా..  దాదాపు  20 రోజులకు పైగా షూటింగ్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ఈ ఫైట్ హైలెట్ అవుతుందని. అందుకే ముందు ఫ్రెష్ గా ఈ ఫైట్ సీన్ స్టార్ట్ చేస్తే.. అవుట్ పుట్ కూడా ఫ్రెష్ గా వస్తుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

67

ఇక ఇప్పటికే సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ మొదలయ్యిందట. త్రివిక్రమ్ మహేష్ బాబును ఎలా చూపించబోతున్నాడా అని ఊహించుకుంటున్నారట. అరవింద సమేతలో ఎన్టీఆర్ తో.. యాక్షన్ సీన్స్ చింపేశాడు త్రివిక్రమ్.. ఇక ఇప్పుడు మహేష్ తో..స్పెషల్ గా ప్లాన్ చేశాడంటే.. అది ఇంకే రేంజ్ లో ఉంటుందో అని తెగ ఆరాటపడిపోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి మహేష్ కోసం త్రివిక్రం ఏం ప్లాన్ చేశాడో.  

77

ఇక పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో  మలయాళ నటుడు రోషన్ మాథ్యూ విలన్ గా నటించనున్నాని వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ నటించిన `కోబ్రా` మూవీలో రోషన్ మాథ్యూ మెయిన్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. నాని నటిస్తున్న దసరా లోనూ రోషన్  కీలక పాత్రలో నటిస్తున్నాడు. రాను రాను ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Sreeja Konidela: చిరంజీవి చిన్న కూతురు డిప్రెషన్ నుంచి ఎలా బయటపడిందో తెలుసా? శ్రీజ కొణిదెల సంచలన పోస్ట్..
Recommended image2
Bharathiraja Movies: తాత అంటే ఇలా ఉండాలి.. భారతీరాజా మ్యాజిక్ అదే.. తిరు మూవీలో ఆ పాత్రే హైలెట్!
Recommended image3
Sapna Choudhary: ఫోటోలు, వీడియోలతో భర్తపై కోర్టుకెక్కిన సింగర్..ఇద్దరి డేటింగ్, పెళ్లి గురించి తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved