- Home
- Entertainment
- యోగా పోజులతో పిచ్చెక్కిస్తున్న రకుల్, జాన్వీ, దీపికా, మలైకా.. హాట్ భంగిమలతో రచ్చ చేసిన్న ముద్దుగుమ్మలు..
యోగా పోజులతో పిచ్చెక్కిస్తున్న రకుల్, జాన్వీ, దీపికా, మలైకా.. హాట్ భంగిమలతో రచ్చ చేసిన్న ముద్దుగుమ్మలు..
నేడు(జూన్ 21) అంతర్జాతీయ యోగా(2022) దినోత్సవం సందర్బంగా స్టార్ హీరోయిన్ల యోగా పోజులు వైరల్ అవుతున్నాయి. రకుల్, జాన్వీ, దీపికా, అనన్య, సారా, మలైకా వంటి వారి యోగా పోజులు కట్టిపడేస్తున్నాయి.

హీరోయిన్లు ఫిట్ నెస్ కోసం ప్రధానంగా ఆశ్రయించేది యోగానే. క్రమం తప్పకుండా యోగా చేస్తూ బాడీని ఫిట్‌గా, యాక్టీవ్‌గా ఉంచుకుంటారు. తాజాగా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా స్టార్ హీరోయిన్ల యోగా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. హాట్ పోజులు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్.. యోగాకి కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. ఆమె యోగా సెంటర్‌నే స్థాపించింది. యువత యోగాతో మనోదైర్యాన్ని, మానసికంగా బలంగా ఉండేందుకు యోగా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఆమె యోగా, ఫిట్‌నెస్ సెంటర్‌ని ఏర్పాటు చేసింది. తను కూడా నిత్యం యోగా చేస్తూ ఫిట్‌గా ఉంటుంది. టైట్ ఫిట్‌లో డ్రెస్ ధరించి కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంటుంది రకుల్.
బాలీవుడ్‌లో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న దీపికా పదుకొనె ప్రతి రోజు యోగా చేస్తుంటుంది. ఆ మధ్య యోగా పోజులతో దిగిన ఫోటోను పంచుకోగా అవి సోషల్ మీడియాని షేక్ చేశాయి. బాడీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పని సరి అని చెబుతుందీ దీపికా. ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్ సరసన `ప్రాజెక్ట్ కే`లో నటిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు బాలీవుడ్ క్రేజీ భామ, జాన్వీ కపూర్ యోగాలో గడుపుతుంది. ఓ వైపు యోగా, మరోవైపు జిమ్ చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంటుంది. ఆమె ప్రతి రోజు ముంబయిలో కెమెరాలకు చిక్కుతున్న విషయం తెలిసిందే. ఆమె వర్కౌట్ పిక్స్ సైతం తరచూ వైరల్ అవుతుంటాయి.
ఆమెతోపాటు సారా అలీ ఖాన్ కూడా యోగా చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంటుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అందాల భామ యోగాని మాత్రం వదలదు. తరచూ హాట్ పోజుల్లో యోగా చేస్తూ వైరల్ అవుతుంటుంది.
ఇక యోగాకి కేరాఫ్‌గా నిలిచే వారిలో సెక్సీ బ్యూటీ మలైకా అరోరా ముందే ఉంటారు. ఆమె ఉదయం నిద్రలేచినప్పట్నుంచి,రాత్రి పడుకునేంత వరకు యోగానే జీవితంగా,శ్వాసగా బతికేస్తుంది. ఓ యోగా సెంటర్‌ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు హాట్ పోజులతో నెటిజన్లకి చుక్కలు చూపిస్తుంది.
మహేష్ హీరోయిన్ కృతి సనన్ సైతం యోగా చేస్తుంది. ఆమె జిమ్‌లో శ్రమిస్తూనే మానసికమైన దృఢత్వం కోసం యోగా చేస్తుంది. ఫిట్‌నెస్‌ని పొందుతుంది. తనహాట్ లుక్ తో కట్టిపడేస్తుంది. ఆమె ఇప్పుడు ప్రభాస్‌తో `ఆదిపురుష్`లో చేస్తున్న విషయం తెలిసిందే.
ఇంకోవైపు సీనియర్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి సైతం యోగానే చేస్తుంటుంది. యోగా దినోత్సవమనే కాదు, ఆమె నిత్యం యోగా చేస్తూ ఫిట్‌గా ఉంటుంది. నాలుగు పదుల వయసులోనూ ఎంతో అందంగా, ఫిట్ గా ఉంటూ నెటితరానికి ఆదర్శంగా నిలుస్తుంది శిల్పా.
కరీనా కపూర్ తన బాడీని కంట్రోల్ చేసుకునేందుకు యోగానే ఆశ్రయిస్తుంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆమె యోగా చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తన బొద్దు అందాలతో యోగా చేస్తూ విజువల్ ట్రీట్‌నిస్తుంది కరీనా.
అలాగే `లైగర్` బ్యూటీ అనన్య పాండే యోగాలో మునిగి తేలుతుంది. ఆమె చాలా వరకు యోగాతోనే ఫిట్‌నెస్ పొందుతుంది. ఆమె ఫోటోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అలాగే షాహిద్ కపూర్ భార్య మీరా కపూర్ కూడా యోగా చేస్తుంటుంది. హీరోయిన్లకి ఏమాత్రం తగ్గని అందం కలిగిన మీరా.. ఇంతటి అందానికి యోగా కూడా ఓ కారణమని చెప్పుకుంటారు బాలీవుడ్ జనాలు.
మరో హాట్ బ్యూటీ దియామీర్జా యోగా చేస్తూ పలు మార్లు కనిపించింది. ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, అవి ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఇప్పుడు యోగా దినోత్సవం సందర్భంగా మరోసారి వైరల్ అవుతున్నాయి.