- Home
- Entertainment
- ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా? ఒకప్పుడు చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ లతో నటించింది!
ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా? ఒకప్పుడు చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ లతో నటించింది!
పెళ్ళయాక మహిళల శరీరాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. వివాహం చేసుకుని రిటైర్ అయిన ఓ హీరోయిన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

Rakshitha
వస్తూ వస్తూనే సంచనాలు చేసిన హీరోయిన్స్ లో ఈమె ఒకరు. డెబ్యూ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి ఎన్టీఆర్, మహేష్, చిరంజీవి, నాగార్జున వంటి టాప్ స్టార్స్ తో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు చూస్తే ఆమె ఈమేనా అంటారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు రక్షిత.
Rakshitha
దర్శకుడు పూరి జగన్నాధ్ రక్షితను వెండితెరకు పరిచయం చేశాడు. కన్నడ మూవీ అప్పు తో రక్షిత హీరోయిన్ అయ్యారు. అప్పు చిత్రాన్ని తెలుగులో రవితేజ హీరోగా ఇడియట్ టైటిల్ తో తెరకెక్కించారు. అప్పు లో నటించిన రక్షితనే పూరి హీరోయిన్ గా తీసుకున్నాడు. తెలుగులో ఇడియట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
Rakshitha
ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన శివమణి మూవీలో సెకండ్ హీరోయిన్ గా రక్షితను తీసుకోవడం జరిగింది.ఈ మధ్యలో మహేష్-తేజ కాంబినేషన్ లో వచ్చిన నిజం మూవీలో రక్షిత హీరోయిన్ గా నటించారు.
Rakshitha
అలాగే పూరి జగన్నాధ్ ఎన్టీఆర్ తో చేసిన భారీ బడ్జెట్ మూవీ ఆంద్రావాలాలో మెయిన్ హీరోయిన్ గా రక్షితకు అవకాశం ఇచ్చారు. అప్పటికే రక్షిత కెరీర్ స్ట్రగుల్ అవుతుంది. ఆంధ్రావాలా డిజాస్టర్ కావడం రక్షిత కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.
మెల్లగా ఆమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. దాంతో రక్షిత, వచ్చిన అవకాశాలు వదలకుండా చిన్న పెద్ద సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అందరివాడు మూవీలో రక్షిత అంతగా ప్రాధాన్యం లేని ఓ హీరోయిన్ గా కనిపించారు.2005లో అందరివాడు మూవీ రాగా అప్పటికే రక్షిత తెలుగులో ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది.
Rakshitha
జగపతి బాబు హీరోగా 2005లో విడుదలైన జగపతి తెలుగులో రక్షితకు చివరి చిత్రం.ఆ తరువాత ఆమె వరుసగా కన్నడ చిత్రాలు చేశారు. కెరీర్ స్లో అవుతున్న తరుణంలో రక్షిత కన్నడ ఫిల్మ్ డైరెక్టర్ ప్రేమ్ ని వివాహం చేసుకున్నారు.2007లో వివాహం కాగా వీరికి ఒక అబ్బాయి పుట్టాడు.
Rakshitha prem Ek love ya
గ్లామరస్ హీరోయిన్ గా ఒకప్పుడు యూత్ ని ఊపేసిన రక్షిత ప్రజెంట్ ఫోటోలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. బాగా ఒళ్ళు చేసిన రక్షిత గుర్తు పట్టలేనంతగా తయారయ్యారు. హీరోయిన్ గా ఉన్నప్పుడే బబ్లీగా ఉండే రక్షిత, పెళ్లి తర్వాత పూర్తిగా షేపవుట్ అయ్యారని ఆమె ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది.
Rakshitha
ఇక నిర్మాతగా కూడా రక్షిత చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూడు కన్నడ చిత్రాలు రక్షిత నిర్మించడం జరిగింది. తాను ప్రొడ్యూసర్ చేసిన ఏక్ లవ్ య మూవీలో రక్షిత చిన్న క్యామియో రోల్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు.