- Home
- Entertainment
- Chiranjeevi: చిరంజీవి జడ్జిమెంట్ రాంగ్ అని నిరూపించిన అసిస్టెంట్.. జేబులో ఉన్న 10 వేలు ఇచ్చేసిన మెగాస్టార్
Chiranjeevi: చిరంజీవి జడ్జిమెంట్ రాంగ్ అని నిరూపించిన అసిస్టెంట్.. జేబులో ఉన్న 10 వేలు ఇచ్చేసిన మెగాస్టార్
ఓ పాట విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ తప్పయ్యింది. రియలైజ్ అయ్యాక చిరు తన జేబులో ఉన్న రూ 10 వేలు అసిస్టెంట్ కి ఇచ్చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Choodalani Vundi
మెగాస్టార్ చిరంజీవి నటించిన కెరీర్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఒకప్పుడు చిరంజీవి సినిమాకి కాస్త మంచి టాక్ వస్తే చాలు.. ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయ్యేది. అప్పట్లో చిరు జోరు అలా ఉండేది. చిరంజీవి, గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘చూడాలని ఉంది’. ఈ సినిమాలో పాటలు, ఫైట్స్, కథ కథనాలు ప్రతిదీ ఆకట్టుకునేలా ఉంటుంది.
చిరంజీవి ఇండస్ట్రీ హిట్ మూవీ
అందుకే చూడాలని ఉంది మూవీ ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ సాధించింది. అయితే ఈ సినిమా విషయంలో చాలా ఆసక్తికర సంఘటనలు జరిగాయి. ఈ సినిమాకి లెజెండ్రీ లిరిసిస్ట్ వేటూరి సుందర రామమూర్తి సాహిత్యం అందించారు. యమహా నగరి అనే పాటని ఆయన రాయగానే నిర్మాత అశ్విని దత్, చిత్ర యూనిట్ ఆయనని గజ మాలతో సన్మానించారట. అంతటి అద్భుతమైన పాట రాసిన రచయితకు ఇచ్చిన గౌరవం అది.
సాంగ్ విషయంలో వివాదం
ఈ విషయాన్ని సంగీత దర్శకుడు ఓరుగంటి ధర్మతేజ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ధర్మతేజ అప్పట్లో మణిశర్మకి అసిస్టెంట్ గా పనిచేశారు. వేటూరి రాసిన రామ్మా చిలకమ్మా సాంగ్ విషయంలో మాత్రం చిన్న వివాదం జరిగింది. చిరంజీవి సీరియస్ అయ్యారు, సాంగ్ బాగానే ఉంది. కానీ ఆ పాటని ఉదిత్ నారాయణ్ తో పాడించడంతో ఆ సాంగ్ చిరంజీవికి నచ్చలేదు. వాయిస్ బాగాలేదు. ఏంటి నాపై ప్రయోగాలు చేస్తున్నారా అంటూ చిరంజీవి సీరియస్ అయ్యారు. ఆ సాంగ్ ఓకె చేయయించడంలో ప్రధానంగా నా పాత్ర ఉందని చిరంజీవి గారికి తెలుసు.
ఆడియో క్యాసెట్లతో ప్రభంజనం
చిరంజీవి గారికి నచ్చకపోవడంతో మరో సాంగ్ చేయించాం. కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం అభ్యంతరం చెప్పారు. రామ్మా చిలకమ్మా సాంగ్ కి కుదిరినట్లుగా ఈ కొత్త సాంగ్ కి కొరియోగ్రఫీ కుదరదు అని చెప్పారు. దీనితో రామ్మా చిలకమ్మా పాటనే షూట్ చేసి ఆ తర్వాత ఆడియో రిలీజ్ చేశాం. ఆడియో రిలీజ్ కాగానే ఈ పాట ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఎక్కడ క్యాసెట్ ముక్క మిగల్లేదు. దీనితో క్యాసెట్స్ ని పైరసీ చేసి కూడా అమ్మారు. అంతలా ఆ పాట ప్రభంజనం సృష్టించింది.
అసిస్టెంట్ కి రూ.10 ఇచ్చిన చిరు
అప్పుడు చిరంజీవి తన జడ్జిమెంట్ తప్పు అని రియలైజ్ అయ్యారు. షూటింగ్ లో నన్ను ప్రత్యేకంగా పిలిచి నీ జడ్జిమెంట్ కి హ్యాట్సాఫ్ అని జేబులో ఉన్న 10 వేలు తీసి ఇచ్చారు. ఈ సాంగ్ ని ఓకె చేయడంలో నీ పాత్ర ఉందని అందరూ చెప్పారు. నాకు నచ్చలేదు కానీ అంతా నీకు సపోర్ట్ చేశారు. అందుకే అప్పుడు నేనేమీ నీతో మాట్లాడలేదు. ఇప్పుడు నీ జడ్జిమెంట్ కరెక్ట్ అయింది అని చిరంజీవి తనతో చెప్పినట్లు ధర్మతేజ గుర్తు చేసుకున్నారు.

