కృతి శెట్టికి స్టార్ హీరో కొడుకు వేధింపులు..? సంచలన వ్యాఖ్యలు చేసిన బేబమ్మ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతీ శెట్టి సంచలన ఆరోపణలు చేసింది. ఓ స్టార్ హీరో కొడుకు వల్ల తాను ఇబ్బందిపడుతున్నట్టు వెల్లడించించి. ఇంతకీ కృతీ శెట్టి నింజగానే వేధింపులు ఫేస్ చేస్తుందా..?

టాలీవుడ్ లోకి ఉప్పెనలా వచ్చి.. మూడు సినిమాలోతోనే చప్పున చల్లారిపోయింది కృతీ శెట్టి.. మొదటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బేబమ్మ.. ఆరువాత కూడా వరుసగా సూపర్ హిట్లు కొట్టింది. హ్యాట్రిక్ హిట్స్ ను తన సొంతం చేసుకున్న కన్నడ భామ.. ఆతరువాత వరుస ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేసింది.
ఉప్పెన, బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలతో వరుస హిట్లు సాధించిన కృతీ శెట్టి.. ఆ వెంటనే .. రామ్ తో చేసిన ది వారియర్, నితిన్ తో మాచర్చ నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి సినిమాలతో వరుసగా ప్లాప్ లు చూసింది. ఇక రీసెంట్ గా నాగచైతన్యతో కష్టడీ సినిమా చేసినా.. టాలీవుడ్ లో మళ్ళీ లక్కు కలిసి రాలేదు కృతీ శెట్టికి.
krithi shetty
ఇక ప్రస్తుతం శర్వానంద్ తో ఓ సినిమా చేస్తోంది కన్నడ భామ.. మలయాళంలో కూడా ఓ మూవీ చేస్తోంది. ఇక ఈక్రమంలో రీసెంట్ గా కోలీవుడ్ మీడియాతో మాట్లాడిన కృతీ శెట్టి.. తనను ఓ స్టార్ హీరో కొడుకు వేదిస్తున్నాడంటూ.. కామెంట్ చేసి సంచలనం సృష్టించింది. సోషల్ మీడియా కథనాల ప్రకారం ఆమెను ఓ సీనియర్ హీరో కొడుకు టార్చర్ చేస్తున్నాడట.
ఓ స్థార్ హీరో కొడుకు బేబమ్మను వేదిస్తున్నాడట. అతను ఎక్కడికి వెళ్తే తనను అక్కడికి రమ్మని ఫోన్ చేసి విసిగిస్తున్నాడట. ఇటీవల అతడి పుట్టిన రోజు న షూటింగ్ వదిలేసి రావాలని ఫోన్ చేసి విసిగించాడట. అతను తనను ఇబ్బందిపెడుతున్నడని.. పదే పదే ఫోన్ చేసి వేధిస్తున్నాడని తెలిపింది కృతి శెట్టి.
అంతే కాదు తన బర్త్ డేకి వస్తే ఎన్నికోట్లయినా ఇస్తానంటున్నాడట. అంతేకాదు, ఆమె అటెండ్ అయ్యే ప్రతీ ఈవెంట్‌లోనూ వెంటపడుతూ ఇబ్బంది పెడుతున్నాడంట. ఈ విషయాలన్నీ కోలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చింది కృతీ శెట్టి.. ప్రస్తుతం ఆమె చేసిన ఆరోపణలు నెట్టింట్లో వైరల్అవుతున్నాయి.
అంతే కాదు కృతీ శెట్టి చెప్పిన ఆ హీరో ఎవరు..? టాలీవుడ్ హీరోనా..కోలీవుడ్ హీరోనాఅని అంతా ఆలోచనలో పడ్డారు. అటు కృతీ శెట్టి మాత్రం ఎలాగైన ఇండస్ట్రీలో మళ్ళీ లక్కీ లెగ్ అనిపించుకోవాలి అని చూస్తుంది. సాలిడ్ హిట్ కొట్టి.. తనను విమర్షించినవారికి సమాధానం చెప్పాలని చూస్తోంది.