- Home
- Entertainment
- రెడ్ శారీలో ఘాటెక్కిన శ్రియా అందాలు.. అన్ని యాంగిల్స్ చూపిస్తూ ఫోటోలకు పోజులిచ్చిన హాట్ హీరోయిన్..
రెడ్ శారీలో ఘాటెక్కిన శ్రియా అందాలు.. అన్ని యాంగిల్స్ చూపిస్తూ ఫోటోలకు పోజులిచ్చిన హాట్ హీరోయిన్..
శ్రియా హాట్ అందాలకు కేరాఫ్. ఆమె స్క్రీన్ పై ఎలా కనిపించినా అందంగానే ఉంటుంది. అదే చీర కడితే ఆ చీరకే అందం వస్తుంది. మరోవైపు చీరలో ఆమె అందాలు రెట్టింపు అవుతాయి.

శ్రియా(Shriya Saran) తాజాగా చీరతో తన అందాల ఘాటెంతో చూపిస్తుంది. రెడ్ శారీలో శ్రియా హాట్ నెస్ పోటెత్తిపోవడం విశేషం. పిచ్చెక్కించే అందాలతో ఆమె వొంపు సొంపులు చూపిస్తే ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోవాల్సిందే. తాజాగా చీరలో శ్రియా అదే చేసింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో టెంపరేచర్ అమాంతం పెంచేసింది.
సిల్వర్ ప్రింటెంట్ రెడ్ శారీలో హోయలు పోయిందీ సెక్సీ హీరోయిన్(Shriya Saree Photos). `దృశ్యం 2` చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆమె ఇలా అందాల విందుకి తెరలేపింది. ఇన్నాళ్లు దాచిన ఘాటు, హాట్‌నెస్‌ని బయటకు తీసింది. ఆమె అభిమానులకు అందాల విందు చేసింది. దీంతో నెట్టింట చక్కర్లు కొడుతుంది. శ్రియా లేటెస్ట్ శారీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ముంబయిలో ఓ స్టూడియోలో ఆమె ఇలా గ్లామర్ షో చేసింది. ఫోటోలకు రెచ్చిపోయి పోజులివ్వడం విశేషం. అటూ ఇటూ తిరుగుతూ తన అన్ని యాంగిల్స్ ని కవర్ చేసింది. కెమెరాకి అసూయ పుట్టించింది. అంతేకాదు కెమెరా ముందు రెచ్చిపోవడంతో కెమెరామెన్లు ఆమె అందాలను బంధించేందుకు పోటీ పడటం విశేషం.
శ్రియా శరణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. చిన్న, పెద్ద సినిమాలతో దుమ్మురేపుతుంది. కమర్షియల్ హీరోయిన్‌గా అలా వచ్చి ఇలా పోయే పాత్రలకు దూరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఏజ్‌లో ఆమెకి కూడా రావడం లేదనే చెప్పాలి. దీంతో కీలక పాత్రలతో ఆకట్టుకుంటుంది. బలమైన పాత్రలతో అలరిస్తుంది.
ప్రస్తుతం ఆమె హిందీలో `దృశ్యం 2`లో నటిస్తుంది. అజయ్ దేవగన్‌తో కలిసి ఆమె ఈ చిత్రంలో నటిస్తుంది. నవంబర్ 18న ఈ సినిమా విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో యూనిట్ బిజీగా ఉంది. దీంతో అజయ్ దేవగన్, కూతుళ్లుగా నటించిన వారితోకలిసి శ్రియా ప్రమోషన్‌లో పాల్గొంటుంది. యంగ్ హీరోయిన్లకి తన అందాలతో గట్టి పోటీనిస్తుంది.
నార్త్ ఇండియాకి చెందిన శ్రియా మోడల్‌గా రాణించింది. ఈ క్రమంలో ఆమె సినిమాల్లో నటించే ఆఫర్ వచ్చింది. అది తెలుగులోనే కావడం విశేషం. `ఇష్టం` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా పరిచయమై ఆకట్టుకుంది. నాగార్జునతో కలిసి నటించిన `సంతోషం` చిత్రం ఆమెకి సూపర్ హిట్ ని అందించింది.
ఆ వెంటవెంటనే స్టార్ హీరోల సినిమాలు ఆమెని వరించాయి. బాలయ్యతో `చెన్నకేశవ రెడ్డి` చిత్రం చేసి హిట్ అందుకుంది. తరుణ్‌తో `నువ్వే నువ్వే` చేసింది. ఈ చిత్రం ఇటీవలే ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఉదయ్ కిరణ్‌తో `నీకు నేను నాకు నువ్వు` చేసింది. చిరంజీవి ఆమెకి బిగ్ బ్రేక్‌నిచ్చాడు. `ఠాగూర్`తో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌తోపాటు అత్యంత క్రేజీ బ్యూటీగా మారిపోయింది శ్రియా.
`ఎలా చెప్పను`, `నేనున్నాను`, `అర్జున్`, `బాలు`, `నా అల్లుడు`, `సదా మీ సేవలో`, `సుభాష్ చంద్రబోస్`, `చత్రపతి`, `భగీరథ` చిత్రాలు చేసింది. వీటిలో చాలా వరకు పరాజయం చెందాయి. ఆ తర్వాత గెస్ట్ రోల్స్ కి కేరాఫ్‌గా నిలిచింది. `సోగ్గాడు`, `బొమ్మలాట`, `దేవదాసు`, `గేమ్`, `బాస్` లో గెస్ట్ గా, `మున్నా`, `తులసి`లో ఐటెమ్‌సాంగ్ లు చేసింది శ్రియా.
ఆ తర్వాత ఆమె క్రేజ్ పడిపోయింది. తెలుగులో ఆఫర్లు తగ్గాయి. తమిళంలో బిజీ అయ్యింది. అడపాదడపా తెలుగు చిత్రాలు చేసుకుంటూ వస్తోంది. ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్`లో గెస్ట్ గా మెరిసిన ఈ హాట్ హీరోయిన్ ఇప్పుడు ఐదు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.