- Home
- Entertainment
- స్లీవ్‌లెస్ టాప్‌లో శివాత్మిక రాజశేఖర్ ఎంత క్యూట్‌గా ఉందో.. ఈ కవ్వింపులు చూస్తే నిద్ర లేని రాత్రులే
స్లీవ్‌లెస్ టాప్‌లో శివాత్మిక రాజశేఖర్ ఎంత క్యూట్‌గా ఉందో.. ఈ కవ్వింపులు చూస్తే నిద్ర లేని రాత్రులే
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ నేచురల్ అందంతో కట్టిపడేస్తుంది. దానికితోడు అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేసింది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న ఈ రాజశేఖర్ తనయ సోషల్ మీడియాలో మాత్రం టాలెంట్ చూపిస్తుంది.

హీరో రాజశేఖర్, జీవితల ముద్దుల చిన్న కూతురు శివాత్మిక.. చిన్న పిల్లలాగే అనిపిస్తుంది. కానీ తానేంటో `రంగమార్తాండ`లో చూపించింది. ఇందులో రంగమార్తాండ కూతురుగా వాహ్ అనిపించింది. సహజమైన నటనతో ఫిదా చేసింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. భవిష్యత్ `మహానటి` లా అభిమానులు, ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
నటిగా ఇంతటి ప్రశంసలందుకుంటున్న ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. గ్లామర్ ఫోటోలతో ఈ బ్యూటీ చేసే రచ్చ మామూలుగా ఉండదు. మేకప్ లేకుండానే చాలా సార్లు ఫోటోలు పంచుకుని వాహ్ అనిపించింది. మేకప్ లేకపోయినా సహజమైన అందంతో కట్టిపడేసింది. అందరి మనసులు దోచుకుంది.
అయితే చాలా వరకు తన లోని హాట్‌నెస్‌ని బయటపెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు తన క్యూట్‌నెస్‌ని పంచుకుంది. క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్ అనేంతగా ఆమె లేటెస్ట్ పోజులుండటం విశేషం. స్లీవ్‌లెస్ బ్లూ టాప్ ధరించి సిగ్గులొలికిస్తూ, అమాయకంగా, అందులోనే కాస్త స్మైల్‌తో ఇచ్చిన పోజు మతిపోయేలా ఉంది.
తాజాగా శివాత్మిక కవ్వింపు పోజులు చూస్తే మాత్రం కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులే అని చెప్పొచ్చు. మరోవైపు ఈ ఫోటోలకు సంబంధించే మరికొన్ని ఫోటోలను పంచుకుంది. తన అక్క శివానీతోనూ ఓ కొంటె పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
శివాత్మిక `దొరసాని` చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది. అందులో దొరసానిగా సెటిల్డ్ నటనతో మెప్పించింది. మంచి మార్కులు వేసుకుంది. ఆ తర్వాత రెండు తమిళ సినిమాలు చేసి అక్కడ ఆడియెన్స్ ని ఫిదా చేసింది. ఇటీవల `పంచతంత్రం`, `రంగమార్తాండ`లో మరోసారి తానేంటో నిరూపించుకుంది. `రంగమార్తాండ`లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఇప్పుడు మంచి ఆఫర్ల కోసం వెయిట్ చేస్తుంది. రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటుంది శివాత్మిక. సోషల్ మీడియాలో గ్లామరస్‌గా కనిపిస్తుంది. అందాలు చూపిస్తుంది. కానీ సినిమాల్లో మాత్రం కండీషన్స్ అప్లై అంటోంది. అందుకే బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు, నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయాలనుకుంటుందీ స్టార్ కిడ్.