- Home
- Entertainment
- Intinti gruhalakshmi: నిజం తెలుసుకున్న సామ్రాట్.. నా ఎదుగుదలను ఆపలేరంటూ తులసి ఛాలెంజ్!
Intinti gruhalakshmi: నిజం తెలుసుకున్న సామ్రాట్.. నా ఎదుగుదలను ఆపలేరంటూ తులసి ఛాలెంజ్!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 31వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... అభి అక్కడికి వచ్చి పూజారి అన్న మాటలకు తిడతాడు అయినా ఏ సంబంధం లేని మీరు పక్క పక్కన కూర్చొని పూజ చేయడం నాకు నచ్చడం లేదు అని గట్టిగా అరిచి సామ్రాట్ అంకుల్ అమ్మకి దగ్గర రావడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటాడు. దానికి అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు ప్రేమ్ అభిని ఆపడానికి ప్రయత్నించి, నిన్ను ఎవరు వెనకాతల నుంచి నడిపిస్తున్నారు అందరికీ తెలుసు ఇప్పుడు అందరి ముందు ఇది మాట్లాడడం అవసరమా అని అంటాడు. అప్పుడు అభి బంగారు లాంటి ప్రాజెక్ట్ పట్టుకుని నందగోపాల్ గారు వస్తే మీరు దేనికి పనికిరాని ఈ ప్రాజెక్టుని ఒప్పుకున్నారు అని అంటారు.
అప్పుడు దీపక్ వచ్చి దేవుడు నందగోపాల్ కాదు సామ్రాట్ గారూ ఇప్పటివరకు అక్క జీవితాన్ని నాశనం చేసింది చాలు మా అక్క బాధపడింది చాలు ఇంకా ఆపు అని అనగా నందు వచ్చి, నేనేమీ మీ అక్క జీవితం నాశనం చేయలేదు. తనే ఈ విడాకులకు కారణమని అంటాడు. అప్పుడు సామ్రాట్ విడాకులు ఏంటి? అంటే తులసి మాజీ నువ్వా అని అంటాడు. అప్పుడు నందు తెలియకుండా నోట్లో నుంచి వచ్చేసింది అని అనుకుంటాడు.ఇంతటిలో పరంధామయ్య ఒకసారి అందరూ ఆపండి నా కొడుకు, నా మనవడు ఇద్దరు నా చేయి దాటిపోయారు నన్ను క్షమించండి సామ్రాట్ గారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మిగిలిన వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత సీన్లో ఇంట్లో కూర్చొని అందరూ అభిని తిడుతూ ఉంటారు. అసలు అమ్మ ఎదుగుతున్నప్పుడు అందరి మధ్య అమ్మ పరువు తీసావు, మన చేతులారా మనమే చేసుకున్నాము. నిన్ను లాస్య ఆంటీ వాళ్లు కీలుబొమ్మ లా వాడుకుంటున్నారు అని ప్రేమ్ చెప్తాడు. అప్పుడు అభి,ఏదో ఒక రోజు నీకు నిజం తెలుస్తుంది అప్పుడు మీరే నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు అని అంటాడు. అప్పుడు శృతి,నేను దీని గురించి సామ్రాట్ గారితో ముందే మాట్లాడాను. సామ్రాన్ గారికి ఆంటీని ఎదగడానికి సహాయం చేయడం తప్ప ఇంకేం ఉద్దేశం లేదు అని అంటుంది దానికి అభి, దొంగతనం చేసినట్టు దొంగతనం అంటే వాడు ఒప్పుకోడు కదా ఏదో ఒకరోజు బయటపడతాడు అప్పుడు చెప్తాను అని అంటాడు. అప్పుడు, ప్రేమ్ తిట్టి ఆ నంద గోపాల్ కోసం అమ్మని తలదించుకునేలా చేస్తున్నావా అని అనగా నాన్నని పేరు పెట్టి పిలుస్తున్నావ్ ఏంటి అని అభి అంటాడు.
మా అమ్మ పేరు తీయడానికి నీకు తప్పులేదు కానీ మీ నాన్న నీ పేరు పెట్టి పిలుస్తే నీకు తప్పొచ్చిందా నీకు అసురుతాడు. ఇంతలో తులసి అక్కడికి వచ్చి అభి ఇంటి పెద్ద మనవడు అభ ని ఎవరు ఏమి అనడానికి వీల్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో నందు ఆ షర్ట్ ని విప్పేస్తాడు. అప్పుడు లాస్య వచ్చి షట్ విప్పి ఏం లాభం నందు నీ అంతట నువ్వే తులసి మాజీ భర్త అని చెప్పావు అని అంటుంది.అప్పుడు నందు, ఆ దీపక్ గడు అన్న మాటలు పౌర్షం తో నోరు జారాను అని అనగా పౌరుషానికి పంపానికి పోతే మన ఉద్యోగాలు పోతాయి ఇంక నువ్వు తులసి మాజీ భర్త అని తెలిస్తే ఉద్యోగం ఇస్తాడా అని లాస్య అనగా ఉద్యోగం పోతే పోయింది అలాగని వాళ్ళ ముందు దోషి గా నిలబడమంటావా అని అడుగుతాడు.
అందుకు లాస్య నందు చాలా గట్టిగా తిడుతుంది. ఆ తర్వాత సీన్లో తులసి టమాటాలు కోస్తూ ఉంటుంది అప్పుడు దీపక్ అక్కడికి వచ్చి నీకు కోపం రాలేదా అక్క అని అడుగుతాడు. అప్పుడు తులసి, అభి కి ఇక్కడ జరిగింది తప్పనిపించింది, అది వాడి అభిప్రాయం. కానీ వాడు ఆ సమయంలో అలా మాట్లాడుతాడు అని నేను ఊహించలేదు అని బాధపడుతుంది. ఇంతలో లాస్య నoదులు అక్కడికి వస్తారు. లాస్య చప్పట్లు కొడుతూ చూసావా నందు నీ మాజీ భార్య ఎంతలా నటిస్తుంటే చప్పట్లు కొట్టవేమి అని ఎటకారిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!