MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Yashoda Review: యశోద మూవీ ట్విట్టర్ రివ్యూ.. సమంత కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన మార్కులెన్ని..?

Yashoda Review: యశోద మూవీ ట్విట్టర్ రివ్యూ.. సమంత కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన మార్కులెన్ని..?

స్టార్ హీరోయిన్ సమంత తన జీవితంలో చేసిన ప్రయోగాలలో.. అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా.. ఆడియన్స్ అంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా యశోద. ఈరోజు రిలీజ్ కాబోతున్న యశోదమూవీ ప్రీమియర్ షోస్ పడగా.. ప్రీమియర్స్ చూసిన ఫారెన్ ప్రేక్షకులు ట్విట్టర్ లో ఈ మూవీ గురించి కామెంట్స్ పెడుతున్నారు. మరి సమంత కష్టానికి ఆడియన్స్ ఎన్ని మార్కులేస్తున్నారు ఏంటీ అనేది యశోద మూవీ ట్విట్టర్ రివ్యూలో చూద్దాం. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 11 2022, 06:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హరి, హరీష్ ఇద్దరు దర్శకులు రూపొందించిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ యశోదలో..సమంత సరోగసీలేడీగా కనిపించింది. ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడింది. అనారోగ్యాన్నిసైతం లెక్కచేయకుండా సినిమా కోసం తాపత్రేయపడింది. సెలైన్ ఎక్కుతుండగానే.. డబ్బింగ్ చెప్పుకుంది.  ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈరోజు ఆడియన్స్ ను అలరించనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

యశోద మూవీపై పాజటీవ్ రివ్యూస్ ఇస్తున్నారు ట్విట్టర్ జనాలు. ఫస్ట్ హాఫ్ మూవీ చాలా డీసెంట్ గా ఉందుంటున్నారు. అంతే కాదు ఈ సినిమాతో సమంత ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయిందంటున్నారు. 
 

38

అంతే కాదు ఫస్ట్ హాఫ్ చూసిన ఆడియన్స్.. ఇది మంచి స్టోరీ లైన్.. అద్భుతంగా తెరకెక్కించారు.. అని కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాదు.. ఇంట్రవెల్ సీక్వెన్స్ అదిరిపోయిందంటున్నారు ప్రేక్షకులు. సెకండ్ హాఫ్ కూడా ఇదే రేంజ్ లో పడితే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు ట్విట్టర్ జనాలు. 

48

ఇక సమంత పెర్ఫామెన్స్ కు నిరాజనాలు పలుకుతున్నారు ఆడియన్స్.  సామ్ కష్టానికి బాగా కనెక్ట్ అయ్యారు ... కదిలిపోయారు. అందుకే నీ కష్టం వృధాపోలేదు సమంతా, 100 పర్సంట్ అద్భుతంగా చేశావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా.. ఆమె నటనలో ఏమాత్రం అదికనిపించకుండా అద్భుతం చేసిందంటున్నారు ట్విట్టర్ పీపుల్. 

58

ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన యశోద సినిమా అద్బుతమంటున్నారు ఆడియన్స్. ఆ లైన్ కే కనెక్ట్ అవుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈసినిమాకు, ఈ కథకు సమంత లైఫ్ లైన్ అంటున్నారు. సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి  ఇతర నటీనటులు ఆమెకు ఫుల్ సపోర్ట్ చేశారంటు కామెంట్ చేస్తున్నారు. 
 

68

యశోద సినిమాతో మరోసారి రెచ్చిపోయాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ముఖ్యంగా ఆయన ఈసినిమాకు ఇచ్చిన BGM పై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అయితే అందులో మ్యూజిక్ శేర్ మేజర్ అంటున్నారు ఆడియన్స్. 

78

ఇక ఈ మూవీకి కొన్ని నెగెటీవ్ టాక్స్ కూడా తప్పలేదు. సినిమా పర్వాలేదని కొందరు... ఇంకాస్త బాగా తీయ్యాల్సిందంటూ మరికొందరు.. ఇలా కొంతమంది మాత్రం కాస్త నెగెటీవ్ కామెంట్స్ చేసినా..? ఫైనల్ గా ఈసినిమాపై వారు గట్టిగా వాదించేలా చెత్త ఏమీ కనిపించడంలేదు. 

88

మొత్తానికి సమంత సాధించిందనే చెప్పాలి. అనారోగ్యంలో ఉండి కూడా.. సినిమా కోసం తాపత్రేయపడింది సామ్. అందుకే తన కష్టానికి తగ్గ ప్రతి ఫలం వచ్చింది. ఇక సినిమా అంతటారిలీజ్ అయ్యి .. జననీరాజనాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సోలోగా తన సత్తా చాటిన సమంతకు ట్విట్టర్ లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: వీరభద్రుడు మూవీ OTT రిలీజ్, కరుప్పు థియేటర్లలో ఎంత వసూలు చేసిందో తెలుసా?
Recommended image2
Raghava Lawrence: సస్పెన్స్‌ ను బ్రేక్ చేసిన లారెన్స్, సీఎం విజయ్ విషయంలో కీలక ప్రకటన
Recommended image3
Ram Charan: రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved