- Home
- Entertainment
- సమంత బ్లాక్ టైట్ ఫిట్‌లో సూపర్ హాట్.. పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోయిన్ అందాలు.. బ్రేక్‌కి ముందు ఇలా
సమంత బ్లాక్ టైట్ ఫిట్‌లో సూపర్ హాట్.. పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోయిన్ అందాలు.. బ్రేక్‌కి ముందు ఇలా
సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆ తర్వాత మొదటి సారి మీడియా కంట పడింది. కెమెరా కన్నులకు చిక్కింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సమంత తాజాగా బ్లాక్ డ్రెస్‌లో కనిపించింది. అందమైన హీరోయిన్లకి బ్లాక్ డ్రెస్ అనేది డెడ్లీ కాంబినేషన్. అందులో ఈ అందాల భామల్ని చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. తాజాగా సమంత కూడా బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. బాడీ షేపులు కనిపించేలా టైట్ ఫిట్‌లో కత్తిలాగా ఉంది సమంత.
ముంబయిలో మెరిసింది సమంత. ఆమె వరుణ్ దావన్‌తో కలిసి `సిటాడెల్` వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె ముంబయికి వెళ్లింది. అక్కడి మిగిలిన షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా షూటింగ్ ప్రదేశంలో సమంత కెమెరాకి చిక్కింది. ఆమె సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి ముందు ఇలా సూపర్ హాట్‌గా మెరిసింది.
సమంత ఇటీవల ఏడాది బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆమె బ్రేక్ తీసుకుంటున్నట్టు తెలిపింది. గతంలో సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడిన విషయం తెలిసింది. దాన్నుంచి కోలుకుని తెలుగులో `ఖుషి` షూటింగ్‌లో పాల్గొంది. అదే సమయంలో `సిటాడెల్` షూటింగ్‌లోనూ పాల్గొంది. `ఖుషి` షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు సిటాడెల్ చిత్రీకరణ కూడా పూర్తి చేసే పనిలో పడింది.
దీని తర్వాత ఆమె ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతుంది. కొత్తగా ఆమె దేనికి కమిట్ కాలేదని పీఆర్ టీమ్ తెలిపింది. ఈ లెక్కన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఉండబోదని తెలుస్తుంది. ఇక సమంత కెరీర్ పరంగా అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. హీరోయిన్ గా ఆమె తొలి సినిమాతోనే పాపులర్ అయ్యింది. `ఏం మాయ చేసావె` చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. అందరి మనసులు దోచుకుంది. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అత్యంత సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది.
ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. `ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ ఆమెకి పాన్ ఇండియా ఇమేజ్‌ని తీసుకొచ్చింది. దీంతో నార్త్ నుంచి ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయి. అందులో భాగంగానే `సిటాడెల్` వెబ్ సిరీస్‌లో చేసింది. దీంతోపాటు మరికొన్ని హిందీ ఆఫర్లు ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ వాటిని కొంత బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
అయితే వ్యక్తిగత జీవితంలో ఆమె అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత విడిపోయారు. కారణాలు తెలియవు కానీ, ఈ ఇద్దరు విడిపోవడం పట్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సమంత సైతం ఈ సంఘటనతో చాలా మానసికంగా వేదనకు గురయ్యింది. దాన్నుంచి బయటపడే క్రమంలోనే మయోసైటిస్ వ్యాధి ఆమెని వెంటాడింది.
ఏడాది పాటు ఆ వ్యాధితోపోరాడింది సమంత. కోలుకున్నప్పటికీ ఆమెని సైడ్ ఎఫెక్ట్స్ వేధిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే పూర్తిగా దాన్నుంచి సమంత కోలుకోలేదని తెలుస్తుంది. అందుకోసమే ఇప్పుడు బ్రేక్ తీసుకుంటుందని సమాచారం.
ప్రస్తుతం తెలుగులో సమంత విజయ్ దేవరకొండతో `ఖుషి` చిత్రంలో నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న లవ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఇది. సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది. అంతకు ముందు సమంత చేసిన `యశోద` యావరేజ్‌గా నిలవగా, `శాకుంతలం` బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.