MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Salman Khan: రియాలిటీ షోలో షర్ట్ విప్పి ఫిజిక్‌ చూపిస్తూ ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన సల్మాన్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Salman Khan: రియాలిటీ షోలో షర్ట్ విప్పి ఫిజిక్‌ చూపిస్తూ ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన సల్మాన్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Salman Khan: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన ఫిజిక్‌పై ఇటీవల ట్రోల్స్ కి గురయ్యారు. తాను లావుగా మారడంతో అనేక బాడీ షేమింగ్‌ కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా వారికి గట్టిగా ఇచ్చిపడేశాడు సల్మాన్‌ ఖాన్‌.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 20 2026, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన సల్మాన్‌ ఖాన్‌
Image Credit : Asianet News

ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన సల్మాన్‌ ఖాన్‌

బాలీవుడ్ స్టార్, బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ మరోసారి తన ఫిట్‌నెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. బిగ్ బాస్ 20 రెండో వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో పలువురు కంటెస్టెంట్ల ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కేవలం కంటెస్టెంట్లకే పరిమితం కాకుండా, నటీమణుల పట్ల కొంతమంది పాపారాజీల వ్యవహారశైలిపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. అలాగే నటీనటుల శారీరక మార్పులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వారిపైనా మండిపడ్డారు. వారికి అదిరిపోయేలా ఇచ్చారు సల్మాన్‌.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బిగ్‌ బాస్‌ 20లో షర్ట్ విప్పి బాడీ చూపించిన సల్మాన్‌
Image Credit : Asianet News

బిగ్‌ బాస్‌ 20లో షర్ట్ విప్పి బాడీ చూపించిన సల్మాన్‌

ఈ క్రమంలో ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ తన టోపీ, జాకెట్‌ను తొలగించారు. ఆ తర్వాత బ్లాక్ టీషర్ట్‌ను కూడా విప్పి తన టోన్డ్ ఫిజిక్‌ను చూపించారు. 60 ఏళ్ల వయసులోనూ సల్మాన్ ఖాన్ మెయింటైన్ చేస్తున్న ఫిట్‌నెస్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ వీడియోను చూసిన బిగ్ బాస్ 7 కంటెస్టెంట్, టెలివిజన్ నటుడు కుషాల్ టాండన్.. సల్మాన్‌కు సపోర్ట్ గా నిలిచారు.

కుషాల్ టాండన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సల్మాన్ ఖాన్ టీషర్ట్ తొలగిస్తున్న వీడియోను రీపోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ డెడికేషన్, డిసిప్లిన్, కంటిన్యూయిటీని ప్రశంసిస్తూ కామెంట్ చేశారు. 60 ఏళ్ల వయసులో ఇలాంటి ఫిజిక్ సాధించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. ఎలాంటి వీఎఫ్‌ఎక్స్ లేకుండా కేవలం డెడికేషన్, డిసిప్లిన్, క్రమశిక్షణతో సల్మాన్ ఈ ఫిట్‌నెస్‌ను సాధించారని కుషాల్ ప్రశంసించారు.

34
ట్రోలర్స్ కి దిమ్మతిరిగే కౌంటర్‌
Image Credit : Asianet News

ట్రోలర్స్ కి దిమ్మతిరిగే కౌంటర్‌

ఇదే ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ పాపారాజీల తీరుపైనా మాట్లాడారు. కారులో నుంచి నటీమణులు బయటకు వచ్చేటప్పుడు, తిరిగి కారులోకి ఎక్కేటప్పుడు కొంతమంది ఫొటోగ్రాఫర్లు వారి థై, హిప్స్‌పై కెమెరాలు ఫోకస్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నటీమణులకు ఇష్టం లేని విధంగా వెనుక నుంచి ఫొటోలు తీసే విధానాన్ని ఆయన ప్రశ్నించారు. కొంతమంది నటీమణులకు అలాంటి ఫొటోల విషయంలో అభ్యంతరం లేకపోవచ్చని, కానీ ఇలాంటి ఫొటోలు నచ్చని నటీమణుల పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలని సల్మాన్ సూచించారు. ఈ సందర్భంగా మహిళల పట్ల పాపారాజీల వ్యవహారశైలిపై ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఇటీవల తన బాడీపై అనేక కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో వారికి కౌంటర్‌ ఇచ్చారు సల్మాన్‌. తన ఫిజిక్‌తో దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు.

44
సల్మాన్ ఖాన్ సినిమాలు
Image Credit : Asianet News

సల్మాన్ ఖాన్ సినిమాలు

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 20కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే.. త్వరలో అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాతృభూమిలో నటించనున్నారు. గతంలో ఈ సినిమాకు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే టైటిల్ ఉండేది. ఇందులో చిత్రాంగద సింగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. కొత్త విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.

ఆ తర్వాత సల్మాన్ ఖాన్.. నయనతారతో కలిసి SVC63లో నటించనున్నారు. ఈ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి `మాంస్టర్‌` అనే టైటిల్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ 2027 ఈద్ సందర్భంగా విడుదల కానున్నట్లు సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
Tamannaah Aadhaar Photo: ఆధార్ కార్డులో ఇంత క్యూట్‌గానా? తమన్నా ఫోటోపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్
Recommended image2
Chiranjeevi-Roja: రోజా ప్రేమ వ్యవహారంపై చిరంజీవి బోల్డ్ కామెంట్‌.. మెగాస్టార్‌కి ఇచ్చిపడేసిన సురేఖ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved