MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: మహేంద్ర మీద బెంగ పెట్టుకున్న రిషి.. మరో కుట్ర చేయబోతున్న దేవయాని!

Guppedantha Manasu: మహేంద్ర మీద బెంగ పెట్టుకున్న రిషి.. మరో కుట్ర చేయబోతున్న దేవయాని!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 22వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

5 Min read
Author : Navya G
| Updated : Oct 22 2022, 09:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..మహేంద్ర కారులో వెళ్తూ జగతితో, ఇదంతా కళైతే బాగున్ను కదా జగతి రేపు ఉదయం లేచేసరికి రిషి నా కళ్ళ ముందు ఉంటాడు అని అంటాడు. దానికి జగతి బాధపడదు, మహేంద్ర ఇది మనం రిషికి ఇస్తున్న కానుక అనుకుందాం అని అంటుంది. మరోవైపు రిషి వసుధారతో కారులో వెళ్తూ వసుధార, నా జీవితంలో దేవుడు ఇచ్చిన కానుక నువ్వు అని అంటాడు. దానికి వసుధార, లేదు సార్ మీరే నాకు కానుక అని అంటుంది. అప్పుడు రిషి, ఈ రాత్రి చాలా బాగుంది వసుధార ఆనందంగా ఉన్నది అని అంటాడు. ఇంతలో ఇల్లు వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత పడుకోని లెగిచేసరికి జగతి నుంచి మెసేజ్లు ఉంటాయి. మేడం మెసేజ్ చేశారేంటి అనుకోగా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులన్నీ వసుకి చెప్పి ఇవన్నీ నువ్వే చూసుకో వసు ఇంకనుంచి నేను ఇవేవీ చూసుకోను అని మెసేజ్ పెడుతుంది జగతి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మేడం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఒకసారి ఫోన్ చేద్దాము అని ఫోన్ చేసేసరికి అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. మరోవైపు రిషి మహేంద్ర కోసం తన గదిలోకి వెళ్ళగా అక్కడ మహేంద్ర ఉండడు. డాడ్ ఏంటి ఇంత ఉదయాన్నే లేచారు ఎక్కడికి వెళ్లి ఉంటారు అని కబోర్డు తీయగా అక్కడ బట్టలు ఏవి ఉండవు.  వెళ్తున్నాము అని ఫోటో ఫ్రేమ్ లో రాసి ఉంటుంది. అప్పుడు రిషి కంగారుగా కిందకు వచ్చి, పెద్దమ్మ డాడ్ ఎక్కడా అని అడగగా వాళ్ళు వెళ్లిపోయారు రిషి నేను ఎంత చెప్పినా వాళ్ళు నా మాట వినలేదు అని దేవయాని అమాయకంగా అంటుంది. అప్పుడు రిషి, వెళ్ళిపోవడం ఏంటి పెద్దమ్మ నాకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారు అయినా మీరైనా నాకు చెప్పాలి కదా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఫోన్ చేయాలి కదా అని అనగా, నేను ఎంతో అడ్డుకోడానికి ప్రయత్నించాను రిషి కానీ వాళ్ళు నా మాట వినలేదు తిరిగి నన్నే అన్నారు అనరాని మాటలు అన్నీ అన్నారు అని అనగా రిషి,  అంటే అన్నారు లెండి పెద్దమ్మ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అనేది ముఖ్యమైనది.

38

నాకు ఇంత జరిగినా చెప్పకపోవడం ఏంటి పెద్దమ్మ? డాడ్ ఎక్కడికి వెళ్లి ఉంటారు నన్ను వదిలి ఎందుకు వెళ్తారు మీరు ఏమైనా అన్నారా? మీకు డాడ్ కి గొడవలు అయి ఉంటాయి కదా మీరు అనరాన్ని మాటలు ఏమైనా డాడ్ ని అంటే బాధపడి వెళ్లి ఉంటారా? జరిగింది చెప్పండి పెద్దమ్మ అని కోపంతో అంటాడు రిషి. దానికి దేవయాని, రిషి ఏంటి వాళ్ళు వెళ్లి పోయారు అంటే ఏడుస్తూ ఒడిలో పడుకుంటాడు అనుకుంటే నా మీదే విరుచుకుపడుతున్నాడు అని అనుకోని, నేనెందుకు అలా చేస్తాను రిషి, నాకు వాల్లకి గొడవలేముంటాయి నేను నిజంగా ఆపడానికి ప్రయత్నించాను. కానీ నా మాట వినలేదు ఏదో వెకేషన్ కి వెళ్తున్నారు అనుకున్నారు కానీ ఇంత జరుగుతుందని అనుకోలేదు అని అంటుంది దేవయాని. ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడగగా ఇంకేమున్నది పెట్టా పేడ సర్దుకుని వెళ్ళిపోయారు జగతి, మహీంద్రలు అని గౌతమ్ తో ఎటకారిస్తూ అంటుంది దేవయాని. 

48

అప్పుడు గౌతమ్ ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్లుండరు నువ్వేం భయపడొద్దు రిషి నేను వెళ్లి వెతుకుతాను ధైర్యంగా ఇంట్లో ఉండు అని అంటాడు. దానికి దేవయాని, అయినా వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేదు కాబట్టే వెళ్ళిపోయారు నిజంగా మహేంద్ర కి నువ్వంటే ఇష్టమే అయితే జగతిని పంపించి తను ఉంటాడు కదా ఇద్దరూ వెళ్లిపోరు. ఎప్పుడు మీ బాధ తప్పుతుందని వెళ్లిపోయినట్టున్నారు అని అనగా గౌతమ్, మీరు కొంచెం సేపు ఆగండి పెద్దమ్మ అని అంటాడు. అప్పుడు దేవయాని, అయిన ఇవేం బుద్ధులు వదిలేసి వెళ్ళిపోడాలేంటి? ఎలా వస్తాయో ఇలాంటి ఆలోచనలు అని అంటుంది. దయచేసి ఆపండి పెద్దమ్మ అని గౌతమ్ అంటాడు. అప్పుడు ధరణి మనసులో, ఈవిడే ఏదో ఒకటి చేసి ఉంటుంది అని అనుకుంటుంది.అప్పుడు రిషి, డాడ్ ఇలా చేయరు కదరా గౌతమ్ అని అనగా,  నువ్వు బాధపడొద్దు నేను వెళ్లి వెతికి వస్తాను ఎక్కడికి వెళ్లి ఉండరు. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు గౌతమ్.

58

గౌతమ్ వెళ్లిపోయిన తర్వాత రిషి, అయినా నన్ను ఎందుకు వదిలి వెళ్తారు పెద్దమ్మ నేను అసలు ఏం తప్పు చేశానని.పోనీ  తెలియకుండా ఏమైనా అన్నానా అని అనగా ఇప్పుడు వచ్చావు నా దారిలోకి అని దేవయాని అనుకుంటుంది. అప్పుడు దేవయాని కావాలని రిషితో,  లేదు రిషి ఈ మధ్య మహేంద్ర కి నీ మీద ప్రేమ తగ్గిపోతుంది. జగతి వచ్చినప్పుడు నుంచి నిన్ను పట్టించుకోవడం లేదు అలాగే రోజురోజుకీ ప్రేమ తగ్గిపోయి శూన్యం అయిపోతుంది అని అనగా,  లేదు పెద్దమ్మ డాడ్ కి నేనంటే చాలా ఇష్టం డాడ్ ఎప్పుడూ నన్ను ప్రేమతో చూసుకుంటారు.
 

68

 మా ఇద్దరికీ ఎప్పుడూ మంచి అనుబంధమే ఉన్నది నన్ను ఎప్పుడు డాడ్ వదిలేయరు నిజం చెప్పండి పెద్దమ్మ మీరు ఏమైనా అనరాని మాటలు అన్నారా డాడ్ ని లేకపోతే డాడ్ అంత బాధతో వెళ్లిపోరు కదా అసలు ఏమైంది అని అడగగా, లేదు రిషి నిజంగా నాకు తెలీదు ఇంత జరుగుతుందని లేకపోతే నేను అప్పుడే వాళ్ళని ఆపే వాళ్లను నన్ను క్షమించు అని రిషి అని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ మనసులో, ఇంక రిషి నా చేతిలోనే ఉంటాడు వాళ్ళు వెళ్లిపోయారు అని ఆనందపడిపోతుంది దేవయాని. ఆ తర్వాత సీన్లో గౌతమ్ వసుధార దగ్గరకు వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి, నేను వాళ్ళని వెతుకుతాను వసు.
 

78

నువ్వు రిషి దగ్గర ఉండు. రిషికి ఇప్పుడు ధైర్యం అవసరం అని అనగా, కనిపించకపోవడం ఏంటి సార్ మీరు సరిఘా వెతుకుతున్నారా నేను ఫోన్ చేస్తాను అని అనగా ఫోన్ స్విచాఫ్ లో ఉన్నది వసు ఇప్పుడు నేను వాళ్ళ గురించి ఎలాగైనా వెతుకుతాను నువ్వు ముందు రిషి ని జాగ్రత్తగా చూసుకో అక్కడికి వెళ్ళు అని అంటాడు. మరోవైపు రిషి దేవయాని లు మాట్లాడుకుంటూ, డాడ్ కి  నా మీద కోపం వస్తే నన్ను తిట్టే హక్కు డాడ్ కి ఉంది కదా ఎప్పుడూ నా మీద కోపం వచ్చినా సరే నన్ను తిట్టరు ఎందుకంటే నేను బాధపడతాను అని నామీద మాట కూడా ఎప్పుడు విసరలేదు.అలాంటి డాడ్ నన్ను ఇలా వదిలేస్తున్నారంటే ఏదో తప్పు జరిగింది పెద్దమ్మ నేను డాడ్ ని అంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలుసు కదా అని రిషి అంటాడు. అప్పుడు దేవయాని మనసులో, పోనీలే పెద్దమ్మ వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు కదా నాకు మీరున్నారు అదే చాలు వాళ్ళతో నాకెందుకు అని అంటాడు 

88

అనుకున్నాను ఇప్పుడికి వచ్చి అలా అనలేదేంటి అని అనుకుంటుంది దేవయాని. ఇంతలో వసుధార కిందకి వచ్చి రిషి సార్ అని అరుస్తుంది. ఇంతలో రిషి దేవయాని లు అక్కడికి వెళ్తారు. సర్ మీరు బానే ఉన్నారా అని అడగగా, డాడ్ కనిపించడం లేదు వసు.నీకు ఏమైనా తెలిసిందా అని అనగా లేదు సర్ నా ఫోన్ కూడా ఎత్తడం లేదు మీరు ముందు ధైర్యంగా ఉండండి గౌతమ్ సర్ వెతకడానికి వెళ్లారు కదా అని రిషిని పైకి తీసుకెళ్తుంది వసుధార. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని దేవయాని అడగగా, ధైర్యం చెప్పడానికి తీసుకెళ్తున్నాను మేడం అలాగే కొంచెం స్ట్రాంగ్ కాఫీ తీసుకురండి అని వసు అంటుంది. దానికి దేవయాని ఆశ్చర్యపోయి,  నేను కాఫీ తేడం ఏంటి అని అనగా, కాఫీ కాదు స్ట్రాంగ్ కాఫీ తెచ్చేయండి మేడం అని రిషి ని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది వసు. అప్పుడు దేవయాని కోపంతో రగిలిపోయి ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved