MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: పంచభూతాలు సాక్షిగా ఒకటైన రిషి, వసుధారలు.. షికారుకెళ్లిన ప్రేమజంట!

Guppedantha Manasu: పంచభూతాలు సాక్షిగా ఒకటైన రిషి, వసుధారలు.. షికారుకెళ్లిన ప్రేమజంట!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగష్టు 26వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం... 

3 Min read
Author : Navya G
Published : Aug 26 2022, 08:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్. ఈ విషయాన్ని ఇంత తక్కువ మాటల్లో చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేనేమో అని భయమేస్తుంది అని ఆ గిఫ్ట్ ని రిషి కి ఇస్తుంది వసుధార. ఇప్పటినుంచి ఈ బొమ్మని నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది వసుధార అని రిషి అంటాడు. వసుధార ఎంతో ఆనందపడుతుంది. రిషి ఆ బొమ్మని తీసుకొని హద్దుకుంటాడు. వర్షం ఎక్కువగా ఉన్నది పక్కకు వెళ్దామని రిషి వసుని పక్కకు తీసుకువెళ్తాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆ తర్వాత సీన్లో మహీంద్రా కంగారుపడుతూ ఇందాక అమ్మవారితో వసు మాట్లాడే మాటలు చూస్తే ఈరోజు తన మనసులో మాట రిషికి చెప్పేస్తాది అని అనుకుంటున్నాను. అలా జరిగితే మంచిదే ఒకవేళ అలా జరగకపోతే పరీక్షల తర్వాత వీళ్ళకి ఇంక కలవడానికి అవకాశం ఉండదు. ఇంక వాళ్ళు ఒకటి అవ్వడానికి అవకాశం ఉండదు.వీళ్ళు కలిసి ఉంటే బాగుండు అని అనగా జగతి, రిషి తన మనసులో మాట చెప్పలేనంతవరకు మనం ఇబ్బంది పడ్డాము. రిషి తీరా తన మనసులో మాట చెప్పేసరికి వసు ఎందుకు వద్దన్నాదో కూడా తెలియడం లేదు.
 

37

చాలాసార్లు అడిగినా సరే చెప్పలేదు.ఇంక తన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం నాకు నచ్చదు అని చెప్పి వదిలేసా.అయినా వాళ్ళిద్దరి పర్సనల్స్ లోని మనం దూరడం మంచిది కాదు అని అంటుంది.దానికి మహేంద్ర వాళ్ళిద్దరి వ్యక్తిగతంలోనికి మనం దూరడం మంచిది కాదు కానీ మనం చేసేది వాళ్ళ మంచి కోసమే కదా వాళ్ళు కలిసి ఉండడం కోసమే అని అంటాడు మహీంద్రా. ఆ తర్వాత సీన్లో రిషి ,వసు ఒక షెడ్ కిందకి వచ్చి ఉంటారు. అప్పుడు వసు, మనసులో రిషి సార్, నేను జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాను.
 

47

కానీ మీతో సాగే ఈ ప్రయాణం నాకు ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుంటుంది. అప్పుడు రిషి, వసుధర ఈరోజు నుంచి మనిద్దరి మధ్య ఎలాంటి దాంపత్యలు ఉండకూడదు.ఉంగరం లో VR కలిసినంత తేలిక కాదు చివరి వరకు కలిసి ఉండడం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాంతం కలిసి ఉండాలి అని అంటాడు. సరే  అని వసు అంటుంది. అప్పుడు రిషి ఆరోజు నువ్వు నన్ను కాదనడానికి ఎవరి నిన్ను బెదిరించారు? అని రిషి అడగగా,వసు మౌనంగా ఉంటుంది.
 

57

ఇప్పుడే చెప్పాను వసుధార, దాంపరీత్యాలు వద్దు అని రిషి అనగా సాక్షి బెదిరించింది సార్ అని వసుధార అంటుంది. నేను అనుకున్నదే అయింది అని రిషి అనుకుంటాడు.ఆ తర్వాత రిషి, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి వసుధారా. మన ప్రేమ కొనసాగాలంటే నువ్వు నీ ప్రేమని త్యాగం చేయాలి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో చదువుకోవడానికి వచ్చావు నీకు తెలుసు. పెళ్లి పీటల మీద నుంచి కుటుంబం అందరినీ వదిలేసి వచ్చావు.అలాంటిది ఇప్పుడు ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటే నీ పరీక్షలకు ఆటంకం వస్తుంది.
 

67

కనుక పరీక్షలు అయ్యేంతవరకు మనం కలవకూడదు, మాట్లాడకూడదు నువ్వు నాకు ఒక మాట ఇవ్వు వసుధార, నువ్వు ఈ కాలేజ్ పరీక్షల్లో మొదటి స్థానంలో రావాలి దాని తర్వాత మన ప్రేమకి ఇంకా ఏ ఆటంకాలు ఉండవు అని అంటాడు. అప్పుడు వసు, నేను కచ్చితంగా మొదటి స్థానం తెచ్చుకుంటాను సార్ అని మాట ఇస్తుంది. అప్పుడు వసు, మన ప్రేమ కోసం,మీకోసం పరీక్షలు అయ్యేంతవరకు నేను ఆగుతాను సార్ కానీ ఈ స్థానం ఎప్పటికీ నాకే ఉండాలి అని అంటుంది.
 

77

అప్పుడు రిషి,నేను మాటిస్తున్నాను వసుధార, ఈ స్థానం ఎప్పటికి నీదే ఈ పంచభూతాలు సాక్షిగా ఈరోజు నేను చెప్తున్నాను అని రిషి అంటాడు. ఆ తర్వాత ఉరుములు వచ్చేసరికి వసూ,రిషి ని హద్దుకుంటుంది .అప్పుడు రి, వసూ ని దగ్గరకు తీసుకొని,ఈరోజు ఈ పంచభూతాలు సాక్షిగా ఈ నిమిషం నుంచి మనిద్దరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరూ చేయి పట్టుకొని కారులో వెళ్తూ ఉండగా, ఇలా నీ చేయి పట్టుకొని కార్లో వెళ్తూ ఉండడం చాలా హాయిగా ఉంది వసుధారా అని అంటాడు రిషి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved