MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sneha Photos: ఏంజెల్‌లా మెరిసిపోతున్న స్నేహ.. పోజులతో పనిలేదు, చిన్న స్మైల్‌ చాలు.. చూస్తే ఫిదా

Sneha Photos: ఏంజెల్‌లా మెరిసిపోతున్న స్నేహ.. పోజులతో పనిలేదు, చిన్న స్మైల్‌ చాలు.. చూస్తే ఫిదా

Sneha: హీరోయిన్‌ స్నేహ తాజాగా సోషల్‌ మీడియాలో అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. ఆమె గోల్డ్ కలర్‌ లెహంగాలో మెరిసిపోతుంది. నయా ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 18 2026, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
స్నేహ లేటెస్ట్ ఫోటోలు
Image Credit : instagram/@realactress_sneha

స్నేహ లేటెస్ట్ ఫోటోలు

స్నేహ సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విశేషాన్ని ఆమె పంచుకుంటూనే ఉంది. రెగ్యూలర్‌ అప్‌ డేట్లతో అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె నయా లుక్‌లో మెరిసింది స్నేహ. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
గోల్డ్ కలర్‌ డ్రెస్‌లో స్నేహ స్టన్నింగ్‌ లుక్‌
Image Credit : instagram/@realactress_sneha

గోల్డ్ కలర్‌ డ్రెస్‌లో స్నేహ స్టన్నింగ్‌ లుక్‌

ఇందులో స్నేహ గోల్డ్ కలర్‌ డ్రెస్‌లో మెరిసింది. ఎక్కువగా చీరలో కనిపించే స్నేహ ఇప్పుడు లెహంగా ఓణిలో కనిపించింది. సింపుల్‌గా కెమెరాకి పోజులిచ్చింది. ఆమె లుక్స్ కట్టిపడేస్తున్నాయి. అయితే పెద్దగా పోజులు లేవు, కానీ నవ్వుతోనే ఫిదా చేస్తుంది. తన ఫోటోలను పంచుకుంటూ ఇదే విషయం స్నేహ వెల్లడించింది. కొన్ని సార్లు పెద్దగా పోజులివ్వాల్సిన పనిలేదు, చిన్న నవ్వు చాలు అంటూ పేర్కొంది.

37
నవ్వుతోనే ఫిదా చేస్తోన్న స్నేహ
Image Credit : instagram/@realactress_sneha

నవ్వుతోనే ఫిదా చేస్తోన్న స్నేహ

స్నేహ లుక్స్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. హడావుడి చేసే పోజులతో పనిలేదు, ఆమె ఇలా నవ్వుతూ కనిపిస్తే చాలు అదిరిపోయేలా ఉంటుందని ఈ పిక్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం ఈ నయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లని, తన అభిమానులను కట్టిపడేస్తున్నాయి. దీనికి వాళ్లు కూడా క్రేజీ గా రియాక్ట్ అవుతున్నారు.

47
సినిమాలు తగ్గించిన స్నేహ
Image Credit : instagram/@realactress_sneha

సినిమాలు తగ్గించిన స్నేహ

ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన స్నేహ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. ఆమె తెలుగులో నటించి ఏడేళ్లు అవుతుంది. చివరగా `వినయ విధేయ రామ` చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత మరో తెలుగు మూవీకి ఓకే చెప్పలేదు. సినిమాల పరంగా చివరగా ఆమె విజయ్‌ `గోట్‌`లో కనిపించింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్‌ `డ్రాగన్‌` లో క్యామియో చేసింది. ఇప్పుడు `మూకుతి అమ్మన్‌ 2`లో నటిస్తోంది.

57
`ప్రియమైన నీకు`తో స్నేహ టాలీవుడ్‌ ఎంట్రీ
Image Credit : instagram/@realactress_sneha

`ప్రియమైన నీకు`తో స్నేహ టాలీవుడ్‌ ఎంట్రీ

ఇక స్నేహ తెలుగులో `ప్రియమైన నీకు` సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `తొలి వలపు` చిత్రంలో గోపీచంద్‌ సరసన మెరిసింది. `హనుమాన్‌ జంక్షన్‌` ఆమెకి మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఈ సినిమాతో అటు తమిళంలోనే కాదు, తెలుగులో కూడా బిజీ అయ్యింది. `వెంకీ`తో కమర్షియల్‌ బ్రేక్‌ అందుకుంది స్నేహ. ఇక్కడ మంచి అవకాశాలను అందుకుంది.

67
స్నేహ చేసిన తెలుగు సినిమాలు
Image Credit : instagram/@realactress_sneha

స్నేహ చేసిన తెలుగు సినిమాలు

`సంక్రాంతి`, `రాధాగోపాలం`, `శ్రీరామదాసు`, `ఏవండోయ్‌ శ్రీవారు`, `మనసు పలికే మౌనరాగం`, `మహారథి`, `మధుమాసం`, `నీ సుఖమే నే కోరుతున్నా`, `పాండురంగడు`, `ఆదివిష్ణు`, `అమరావతి`, `రాజన్న` వంటి సినిమాల వరకు హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకుంది. `సన్నాఫ్‌ సత్యమూర్తి`లో ఉపేంద్ర సరసన నటించింది.

77
నటుడు ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ
Image Credit : instagram/@realactress_sneha

నటుడు ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ

స్నేహ.. నటుడు ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెద్దల సమక్షంలోనే ఈ ఇద్దరు 2011లో వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katakatala Rudraiah Review: కృష్ణ మీద కోపంతో కృష్ణంరాజుకు నిర్మాత అవకాశం.. బ్లాక్‌బస్టర్‌ను సూపర్ స్టార్ ఎలా మిస్ అయ్యాడు? కటాకటాల రుద్రయ్య' రివ్యూ..
Recommended image2
Savitri: సెట్‌లో సావిత్రి కాళ్ల మీద పడి దండం పెట్టిన మురళీ మోహన్.. కారణం ఏంటి? మహానటి ఏం చేసింది?
Recommended image3
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Related Stories
Recommended image1
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image2
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved