- Home
- Entertainment
- విరహంతో కూడిన పోజులతో టెంప్ట్ చేస్తున్న రవితేజ హీరోయిన్.. ఈ అమ్మడి ఘాటు అందాలకు చిత్తైపోవాల్సిందే!
విరహంతో కూడిన పోజులతో టెంప్ట్ చేస్తున్న రవితేజ హీరోయిన్.. ఈ అమ్మడి ఘాటు అందాలకు చిత్తైపోవాల్సిందే!
మాస్ మహారాజా రవితేజ హీరోయిన్ డింపుల్ హయతి చాలా రోజుల తర్వాత మరోసారి అభిమానులను పలకరించేందుకు వచ్చింది. ఘాటు రేపే అందాల విందు వడ్డిస్తూ ఒక్కసారిగా ఇంటర్నెట్‌ని షేక్ చేసింది.

డింపుల్ హయతి(Dimple Hayathi) `ఖిలాడీ` చిత్రంలో చేసిన రచ్చ అందరికి తెలిసిందే. ఇందులో ఆటం బాంబ్‌లా పేలింది డింపుల్. తన పిచ్చెక్కించే అందాల షోతో ఒక్కసారిగా ఆడియెన్స్ అటెన్షన్‌ని తనవైపు తిప్పుకుంది. ఐటెం భామగా పేరుతెచ్చుకుంది. హీరోయిన్‌గా నటించి అలరించింది.
ఆ తర్వాత ఆ క్రేజ్‌ని వాడుకుంటూ వరుసగా సెక్సీ ఫోటో షూట్లు చేసింది డింపుల్. ఏమైందో ఏమో సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి రెచ్చిపోయింది. తనఘాటైన అందాలను అంతే హాట్‌గా ఆవిష్కరించింది. లేటెస్ట్ దిగిన ఫోటో షూట్‌కి సంబంధించిన పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది డింపుల్.
ఇందులో బ్రౌన్ కలర్ డ్రెస్‌లో హోయలు పోయింది. అంతేకాదు విరహంతో కూడిన పోజులిస్తూ పిచ్చెక్కిస్తుంది. ఘాటు రేపే అందాలతో కుర్రాళ్లని చిత్తు చేస్తుంది. దీంతో ఈ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి.
మరోవైపు ట్రెడిషనల్ డ్రెస్‌లోనూ దిగిన మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఘాటు అందాలకు చిత్తైపోతున్న కుర్రాళ్లకి రిలీఫ్ నిచ్చేందుకు మరో పంజాబీ డ్రెస్‌లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది డింపుల్. మొత్తంగా హాటు, నాటు ఫోటోలతో అభిమానులను, నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేసింది డింపుల్ హయతి.
ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. చాలా గ్యాప్‌తో వచ్చిన తన క్రేజ్ తగ్గలేదని, అదే సమయంలో చాలా గ్యాప్ తో రావడంతో ఈ అమ్మడి అందాలకోసం నెటిజన్లు ఎగబడుతుండటం విశేషం. అందుకే డింపుల్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
2017లో `గల్ఫ్` చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది డింపుల్ హయతి. ఇది పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత `అభినేత్రి 2`తో మెరిసింది. అయినా పేరు రాలేదు. కానీ `గద్దలకొండ గణేష్`లో ఆమె చేసిన ఐటెమ్ సాంగ్ ఓ ఊపు ఊపేసింది. తన డస్కీ అందాలకు ఐటెమ్ సాంగ్ తోడవ్వడంతో అది థియేటర్లలో రచ్చ చేసింది.
దీంతో అది రవితేజతో `ఖిలాడీ`లో నటించే అవకాశం తెచ్చిపెట్టింది. ఈచిత్రంలో మరింత గ్లామరస్‌గా, హాట్ గా కనిపించి కనువిందు చేసింది. ముఖ్యంగా సాంగ్స్ ల్లో ఈ అమ్మడి అందాలు చూస్తే తట్టుకోవడం ఎవరి తరం కాదు అనేలా ఉండటం విశేషం. ఈ సినిమా పరాజయం చెందింది. దీంతో డింపుల్ కి కలిసిరాలేదు. కానీ రావాల్సిన క్రేజ్ మాత్రం వచ్చింది.
ప్రస్తుతం డింపుల్ హయతి.. గోపీచంద్, శ్రీవాస్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. సినిమా సక్సెస్ అయితే నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందని చెప్పొచ్చు. ఇది తప్ప ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు లేవు. అందుకు అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ తాను ఉన్నానని గుర్తు చేస్తుంది. అందాల విందుతో ఇన్‌స్టాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.