MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లవ్ లైఫ్ పై రష్మిక మందన్న కామెంట్స్.. అదే సమస్య అవుతుందట.!

లవ్ లైఫ్ పై రష్మిక మందన్న కామెంట్స్.. అదే సమస్య అవుతుందట.!

నేషనల్ క్రష్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) తన లవ్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన జీవితంలో దానికి సమయం లేదంటూ ఆసక్తికరమైన వ్యాాఖ్యలు చేయడం వైరల్ గా మారుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 09 2022, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ తెలుగులో రూపొందిన ‘పుష్ప’తో దేశ వ్యాప్తంగా అభిమానులకు పంచుకుంది. దీంతో ఏకంగా బాలీవుడ్ లో భారీ ఆఫర్లను అందుకుంటూ తన పాపులారిటీని మరింత పెంచేస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

అయితే, రష్మిక మందన్న సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో.. తన పర్సనల్ లైఫ్ విషయాల పట్ల ఆసక్తికరంగా ఉంటారు. ఈ క్రమంలో రష్మికకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. తన పర్సనల్ లైఫ్ గురించి రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
 

37

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రష్మిక మందన్న తన పర్సనల్ లైఫ్ గురించి నోరువిప్పింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ, తన లవ్ లైఫ్ ను కూడా లీడ్ చేస్తుందని ఇటీవల వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. వీటిని రష్మిక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

47

రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఎవరికీ అందుబాటులో ఉండటం లేదని చెబుతోంది. భారీ చిత్రాల నుంచి ఆఫర్లను రావడంతో బిజీ షెడ్యూల్ ను కొనసాగించాల్సి వస్తోందట. ఈ క్రమంలో తన ఫ్యామిలీ మెంబర్స్ మరియు స్నేహితులు, సన్నిహితులతోనూ సమయం గడపలేకపోతోందంట.
 

57

ఇక రిలేషన్ షిప్ విషయానికొస్తే.. మనం ఇష్టపడ్డవారికి కావాల్సినంత టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బంధం నిలబెట్టుకోవడానికి చాలా ఓర్పుతో ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన దగ్గర అంత టైం లేదని చెబుతూనే.. తానేవరితోనూ రిలేషన్ లో లేననే విషయాన్ని ఇండైరెక్ట్ గా వివరించింది.
 

67

ఇదిలా ఉంటే.. తొలుత రష్మిక కన్నడ యంగ్ హీరో రష్మిత్ శెట్టి (Rakshit Shetty)తో లవ్ ట్రాక్ నడిపించింది. ఎంగేజ్ మెంట్ కూడా జరిగి.. క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత ఎవ్వరి లైఫ్ లో వారో బిజీగా అయ్యారు. ప్రస్తుతం కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో రష్మిక విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో రిలేషన్ లో ఉంటోందని రూమర్లు పుట్టుకొచ్చాయి.

77

రష్మిక,  విజయ్ ఇప్పటికీ డేటింగ్ లోనే ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీటిని ఎప్పుడూ రష్మిక గానీ, విజయ్ గానీ ఖండించకపోవడం విశేషం. తాజాగా వీరిద్దరూ విదేశాలకు టూర్ కు వెళ్లారని  కూడా  ప్రచారం జరుగుతుండటం విశేషం. ఇక ఇందులో వాస్తవం ఎంతనేది తెలియాల్సి ఉంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved