MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బికినీ వేసి డాన్స్ చేస్తున్న పూజహెగ్డే...ఇంత హాట్నెస్ చూసుండరు

బికినీ వేసి డాన్స్ చేస్తున్న పూజహెగ్డే...ఇంత హాట్నెస్ చూసుండరు

 మాల్దీవుల బీచ్ లో అమ్మడి అందాలను హద్దులు లేకుండా చూపించేయటం ఫ్యాన్స్ కు పండగలా ఉంది.  వన్ పీస్ బికినీలో పూజా మంటలు రేపుతోంది. బీచ్ లో వయ్యారి నడుమును   తిప్పి మత్తెక్కించే చూపులతో మాల్దీవులకే మంటలు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

5 Min read
Surya Prakash | Asianet News
Published : Nov 22 2021, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
118
Pooja Hegde

Pooja Hegde


వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయినా పూజాహెగ్డే  కొద్దిగా సమయం దొరకగానే మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ఆమె చిల్ అవ్వడమే కాకుండా హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును హీట్
ఎక్కించే పోగ్రామ్ లు పెట్టుకుంది. వాటి నుంచి తేరుకునేలోగా డోస్ పెంచేసింది.  బికినీల్లో ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు షేర్ చేసింది. తాజాగా బికినీపైన షర్ట్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్న ఫోటోలను
పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తోంది. ఈ ఫోటోలను చూస్తుంటేనే తెలుస్తోంది ఆమె ఆ ట్రిప్ ని ఏ రేంజిలో ఎంజాయ్ చేసిందో అంటున్నారు ఫ్యాన్స్. 

218
Pooja Hegde

Pooja Hegde


అయితే ట్రిప్ వెనక ఓ సీక్రెట్ ఉంది. మాల్దీవుల ట్రిప్ కూడా ఒక కమర్షియల్ యాక్టివిటీ. వాస్తవానికి  ఒక రిసార్ట్ కి అడ్వర్టైజ్ మెంట్ కోసం ఆమె ఈ ట్రిప్ కి వెళ్ళింది. మొత్తం ట్రిప్ ఖర్చులు ఆ రిసార్ట్
భరించింది. దాంతో ఈ వెకేషన్ లో ఆమెకు ఎంజాయ్ కు ఎంజాయ్, డబ్బుకి డబ్బు. అందుకే, పూజ హెగ్డే ఇంకా ఆ ట్రిప్ ని ఈ రేంజిలో  ప్రోమోట్ చేస్తోంది.

318
Pooja Hegde

Pooja Hegde


ఇక మాల్దీవుల బీచ్ లో అమ్మడి అందాలను హద్దులు లేకుండా చూపించేయటం ఫ్యాన్స్ కు పండగలా ఉంది. చాక్లెట్ కలర్ వన్ పీస్ బికినీలో పూజా మంటలు రేపుతోంది. బీచ్ లో వయ్యారి
నడుమును ఓంపుగా తిప్పి మత్తెక్కించే చూపులతో మాల్దీవులకే మంటలు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

418

  సామాన్యులకు సైతం తీరాన్ని చూస్తే, పొట్టి దుస్తులలోకి మారిపోవాలని అనిపిస్తుంది.అవకాశం వస్తే గ్లామర్ షో చేయడానికి సిద్ధంగా ఉండే హీరోయిన్స్ అసలు ఊరుకుంటారా? బికినీలో దిగిపోతారు. 
 

518


 అలాగే పూజ నటించిన లేటెస్ట్ మూవీ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  ఆహా ఓటీటీలోకి వచ్చింది. అల్లు అరవింద్ సమర్సణలో ‘ గీతాఆర్ట్స్-2 ‘ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా డిజిటల్ రీలిజ్ చేస్తే అక్కడా మంచి రెస్పాన్స్ వస్తోంది

618


  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  మూవీ సాంగ్స్‌ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకున్నాయి.. లెహ‌రాయి.. లెహ‌రాయి.. అనే పాట ప్ర‌తి నోట హ‌మ్మింగ్ చేసుకునేలా మారింది. ఈ సినిమాని ఈ నెల 19న ఆహాలో రిలీజ్‌ చేసారు. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో పరిచిన అందాలపై ఓ సారి ఫోకస్ పెడదాం.  

718


ఈ రోజు పూజ క్రేజ్ ఏ రేంజికి వెళ్లిందంటే...సినిమా ఎలా ఉన్నా పూజ ఉంది కదా అని యూత్ థియోటర్లకు వెళ్తున్నారంటే అతిశయోక్తికాదు. బాగా చదువుకొని... మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. అమ్మానాన్నలకు పేరు తీసుకురావాలి. ఇలానే కలలు కన్నదామె. ఆ దిశగా అడుగులేస్తున్న సమయంలో అనుకోకుండా పాల్గొన్న అందాల పోటీలు జీవితాన్నే మార్చేశాయి. ఆమె ప్రతిభను ప్రదర్శించే వేదికలయ్యాయి. విజేతలుగా నిలబెట్టకపోయినా వెండితెరపై అవకాశాలను తెచ్చిపెట్టాయి.  

818

 అంతెందుకు హరీష్ శంకర్ పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ.. పూజా హెగ్డే ఇప్పుడు చాలా బిజీ అయింది అని, ఆమె డేట్ల కోసం కాదు ఆమెతో ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది అని అన్నారు. మన అందరికి లాక్డౌన్ వచ్చి ఖాళీగా ఉన్నాం. కానీ పూజా హెగ్డే మాత్రం ఒక్క రోజు కూడా ఖాళీగా లేదు. ఎవరైనా దర్శకులు హీరోయిన్ల డేట్ల కోసం ఎదరుచూస్తుంటారు. కానీ ఇప్పుడు పూజా హెగ్డే ఫోన్ కాల్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెతో మాట్లాడాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందేమో అని వ్యాఖ్యానించారు.  Pooja Hegde Bikini Photos.

918
pooja hegde

pooja hegde


అంతే కాక పూజా ఇప్పుడు స్టార్ హీరోలందరితో నటిస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో కూడా నటింస్తుంది అని మాటల్లో చెప్పేసాడు. ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డేను ఫిక్స్ చేసినట్టు సమాచారం ఇచ్చేసారు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హరీష్ శంకర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ” భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఇలా ఈవెంట్ స్పీచ్ లో పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ తో నటిస్తుందని ఇండైరెక్ట్ గా చెప్పేసాడు హరీష్.

1018


పూజా హెగ్డే అమ్మా,నాన్నా కర్ణాటకలోని ఉడుపికి చెందినవారు. ముంబైలోని ఎమ్.ఎమ్.కె. కాలేజ్ లో చదువుతున్న రోజుల్లోనే పలు భాషల్లో పట్టు సాధించడమే కాదు, ఫ్యాషన్ షోస్ లో పాల్గొని అలరించింది. అలా అలా పూజా హెగ్డే పేరు గ్లామర్ మార్కెట్ లో మారు మోగింది. తమిళ దర్శకుడు మిస్కిన్ తన ‘ముగమూడి’ చిత్రంలో హీరోయిన్ గా ఎంచుకున్నారు. జీవా హీరోగా రూపొందిన ఈ చిత్రంలో తొలిసారి తెరపై తళుక్కుమంది పూజా హెగ్డే.

1118


 తరువాత నాగచైతన్య హీరోగా రూపొందిన ‘ఒక లైలా కోసం’తో తెలుగునాట అడుగుపెట్టింది. ఆపై ‘ముకుంద’ చిత్రంలోనూ నటించింది. ఈ మూడు చిత్రాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. హిందీలో ఆమె తొలి చిత్రం హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘మొహెంజో దారో’. అదికూడా అలరించలేదు. దాంతో పూజా హెగ్డే పాదంపై చిత్రసీమలో పలు అనుమానాలు రేకెత్తాయి.

1218
Pooja Hegde

Pooja Hegde


 అల్లు అర్జున్ సరసన నటించిన ‘దువ్వాడ జగన్నాథం’లో పూజా హెగ్డే అందం చిందులు వేసింది. ఆమెను చూడటానికే అన్నట్టు సినిమాకు జనం పరుగులు తీశారు. ఆ చిత్రం మంచి ఓపెనింగ్స్ చూసింది. రామ్ చరణ్ ‘రంగస్థలం’లో “జిల్ జిల్ జిగేలు రాణి…”గా కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. 

1318
Pooja Hegde

Pooja Hegde


బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన ‘సాక్ష్యం’లో మెరిసింది. మళ్ళీ మామూలే అన్నట్టుగా సాగింది పూజా చిత్ర ప్రయాణం. జూనియర్ యన్టీఆర్ తో ‘అరవింద సమేత’లో అరవిందగా ఆకట్టుకుంది. ‘మహర్షి’లో మహేశ్ బాబు సరసన మురిపించింది. ‘గద్దలకొండ గణేశ్’లో మరో శ్రీదేవి అనిపించింది. 

1418
pooja hegde

pooja hegde


ఇక అల్లు అర్జున్ తో రెండో సారి నటించిన ‘అల వైకుంఠపురములో…’తో బంపర్ హిట్ ను తన బ్యాగ్ లో వేసుకుంది. అప్పటి దాకా పూజా హెగ్డే చిత్ర ప్రయాణం ఓ తీరున సాగితే, ‘అల…వైకుంఠపురములో’ తరువాత మరో తీరున సాగింది అని చెప్పాలి. ఆచిత్రం తరువాత పూజా నటించిన ఏ సినిమా కూడా జనం ముందుకు రాలేదు. దసరా పండగకు అక్టోబర్ 15న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో జనం ముందుకు వచ్చింది.

1518
Pooja Hegde

Pooja Hegde


 ఇక ‘ఆచార్య’లో రామ్ చరణ్ జోడీగా నటించింది. వచ్చే యేడాది ఈ సినిమా వెలుగు చూడనుంది. ప్రభాస్‌ ‘రాధే శ్యామ్’లోనూ పూజా అందం కనువిందు చేయనుంది. ఇది కూడా రాబోయే సంక్రాంతి కానుకగా రానుంది. 

1618
Pooja Hegde

Pooja Hegde

తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ‘బీస్ట్’లో నటిస్తోంది. రణవీర్ సింగ్ తో జోడీ కట్టి ‘సర్కస్’ చూపించనుంది. వీటిలో ఏది బంపర్ హిట్ అయినా, మళ్ళీ పూజా హెగ్డే కాల్ షీట్స్ కాస్ట్లీగా మారిపోతాయి. ఇప్పటి దాకా అందంతోనే శ్రీగంధాలు పూసిన పూజా హెగ్డే భవిష్యత్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ మురిపిస్తోందేమో చూడాలి.

1718

Pooja Hegde  అమ్మానాన్నలు చిన్నతనంలోనే భరత నాట్యం నేర్పించారు. కానీ కుటుంబ సభ్యుల ముందు తప్ప ఎక్కడా నృత్యం చేసేదాన్ని కాదు. కారణం బిడియం. వేదిక మీదకు వెళ్లినా భంగిమలు మర్చిపోయి సిగ్గుతో వెనుదిరిగేదాన్ని. పాటలు కూడా బాగా పాడేదాన్ని. అందరి ముందూ ప్రతిభను ప్రదర్శించాలనున్నా సభాపిరికి కారణంగా ఆత్మన్యూనత బాధించేది.

1818

 ఆ లోపాలన్నింటినీ అధిగమించేందుకు కళాశాలలో ఏ కార్యక్రమం జరిగినా పేరు ఇవ్వడం... అందులో పాల్గొనడం మొదలుపెట్టా. బీకామ్‌ చదువుతున్నప్పుడు మా కళాశాలలో మిస్‌ యూనివర్స్‌ ఇండియా ఆడిషన్లు జరిగాయి. పోటీ అనగానే ఆలోచించకుండా గుడ్డిగా పేరిచ్చేశా అని చెప్తుంది.

 

Also read బెడ్ పై బోర్లా పడుకొని కళ్ళతో కవ్విస్తున్న ఉప్పెన బేబమ్మ... పద్ధతిగా ఉండే కృతి శెట్టిలో ఇంత హాట్నెస్ దాగుందా!

Also read Samantha: ఆలోచించడానికి హద్దులేవ్, పద్దతిగా ఉండాల్సిన పనీలేదు... సమంతను బోల్డ్ గా మార్చేసిన వివాదాస్పద డిజైనర్

 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? ఒంటరైపోయానంటూ తనూజ ఆవేదన
Recommended image2
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
Recommended image3
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved