MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ

Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ

Vijay Sethupathi:l బిగ్ బాస్ షోలో నటుడు విజయ్ సేతుపతి నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో, విజయ్ టీవీ దీనిపై అధికారికంగా ఒక వివరణ ఇచ్చింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 15 2026, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విజయ్ టీవీ వివరణ
Image Credit : Asianet News

విజయ్ టీవీ వివరణ

తమిళ బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్స్ వివాదాస్పదం కావడంతో, షోను ప్రసారం చేస్తున్న విజయ్ టీవీ ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఇది కేవలం ఒక వినోద కార్యక్రమం మాత్రమే. ఇందులో మాట్లాడే విషయాలు, పోటీల్లో ఒక భాగం. ఏ ఒక్క వ్యక్తిని, సంస్థను, లేదా సిద్ధాంతాన్ని విమర్శించడం మా ఉద్దేశం కాదు' అని విజయ్ టీవీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో 'తమిళగ వెట్రి కళగం' మద్దతుదారులు తీవ్రంగా విమర్శించడంతో ఈ వివరణ వచ్చింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అసలేం జరిగింది?
Image Credit : X/vijaytelevision

అసలేం జరిగింది?

బిగ్ బాస్ షోలో నాయకత్వం గురించి విజయ్ సేతుపతి మాట్లాడిన మాటలు, నటుడు, సీఎం విజయ్‌ను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. 'నాయకత్వం అంటే ఏంటో తెలియకుండా హామీలు ఇవ్వడం, సమస్య వచ్చినప్పుడు ఎదుటివారిని నిందించి పారిపోవడం నాయకత్వం కాదు' అని విజయ్ సేతుపతి అన్నారు. ఇది విజయ్‌పై పరోక్ష దాడి అని చాలామంది నెటిజన్లు కామెంట్ చేశారు. డీఎంకేను సంతోషపెట్టడానికే విజయ్ సేతుపతి ఇలా విజయ్‌ను టార్గెట్ చేశారని 'తమిళగ వెట్రి కళగం' పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

34
అభిమానుల మధ్య వార్
Image Credit : ANI + Social Media

అభిమానుల మధ్య వార్

విజయ్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా విజయ్ సేతుపతి శుభాకాంక్షలు చెప్పలేదని ఆయన ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. కానీ, విజయ్ సేతుపతి అభిమానులు మాత్రం, 'ఆయన బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన సంఘటనల ఆధారంగానే మాట్లాడారు. దీనికి అనవసరంగా రాజకీయ రంగు పులమొద్దు' అని వాదిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో మొదటి వారం కెప్టెన్‌గా ఉన్న షాధికా, తనపై వస్తున్న ఆరోపణలు తట్టుకోలేక ఆ పదవే వద్దని తప్పుకుంది. ఆ విషయాన్ని ఉద్దేశించే సేతుపతి మాట్లాడారని, అదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసిందని అంటున్నారు.
44
విజయ్  విలన్ గా సేతుపతి..
Image Credit : vijay television - x page

విజయ్ విలన్ గా సేతుపతి..

విజయ్ సేతుపతి, విజయ్‌తో కలిసి 'మాస్టర్' సినిమాలో నటించారు. ఆ సినిమాలో విజయ్‌కు విలన్‌గా 'భవాని' అనే పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారు. సినిమా రిలీజ్ టైంలో పోస్టర్‌పై విజయ్ సేతుపతి పేరు లేకపోవడంతో, ఆయన పేరు కూడా చేర్చమని స్వయంగా విజయ్ పట్టుబట్టారని అంటారు. అంతేకాదు, 'మాస్టర్' షూటింగ్ స్పాట్‌లో విజయ్‌కు విజయ్ సేతుపతి తన సిగ్నేచర్ ముద్దు కూడా ఇచ్చారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టీవీకే విజయ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image2
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image3
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Related Stories
Recommended image1
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved