MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?

Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?

Bigg Boss Telugu 10 : గత సీజన్లతో పోలిస్తే.. అంతకు మించి అన్నట్టు సాగిపోతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 10. హౌస్ లో ఆట రసవత్తరంగా ఉంది. తాజాగా జరిగిన నామినేషన్లలో.. కామనర్ ఝాన్సీ చేసిన సింపతీ డ్రామా అందరికి పల్లవీ ప్రశాంత్ ను గుర్తు చేసింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 15 2026, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డిఫరెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10..
Image Credit : youtube/@starmaa

డిఫరెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10..

తెలుగులో ఎన్ని పాపులర్ షొస్ ఉన్నా.. ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకున్నది మాత్రం బిగ్ బాస్ షోనే. సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు కంప్లీట్ చేసుకన్న బిగ్ బాస్ తెలుగు.. ప్రస్తుతం 10 సీజన్ ను అంతకు మించి నడుస్తోంది. అయితే అందులో పాల్గొనే పోటీదారుల ప్రవర్తన, వారి వ్యూహాలు ప్రతివారం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుంటాయి. ఇటీవల 'అగ్ని పరీక్ష 2' ద్వారా గుర్తింపు తెచ్చుకొని, బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ ఝాన్సీ వైఖరిపై ప్రేక్షకుల నుంచి భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె గేమ్ ఆడే తీరు సరిగ్గా లేదంటున్నారు కొంత మంది ఆడియన్స్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..
Image Credit : Asianet News

ఝాన్సీ ఆటతీరుపై విమర్శలు..

హౌస్ లో ఝాన్సీ ఆటతీరు, ప్రవర్తన డిపరెంట్ గా అనిపిస్తోంది. ఎవరైతే కాస్త గట్టిగా మాట్లాడతారు, ఆడుతారు అనుకుంటారో వారికి దగ్గరగా ఉంటోంది ఝాన్సీ. గేమ్ బిగినింగ్ లో టికెట్ టు బిగ్ బాస్ రౌండ్లలో అమన్, దీపక్ వంటి బలమైన కంటెస్టెంట్లపై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె, బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాక ఆ ప్రభావాన్ని కొనసాగించలేకపోతుంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె చాలా గట్టిగా ఆడుతుంది.. టాప్ 5 వరకు ఉంటుందని అంతా అనుకున్నారు.

కానీ కట్ చేస్తే , ఈమె ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం లో దారుణంగా విఫలం అయ్యింది. ఎంతసేపూ.. సెలబ్రిటీలను ఇంప్రెస్ చేసేపనిలో ఉంటున్నట్టు అర్ధం అవుతోంది. సొంత గేమ్ ఆడకుండా.. ఇతరుల మాటలకు ప్రభావితం అవుతోంది. మొదటి రోజు నుంచే సాధారణ పోటీదారులతో కాకుండా కేవలం సెలబ్రిటీలతోనే సమయం గడపడం, తోటి సభ్యుల పట్ల నమ్మకద్రోహంగా వ్యవహరించడం ఆమె గ్రాఫ్‌ను ఒక్కసారిగా పడేసింది.

34
సెలబ్రిటీలతో చేతులు కలిపిన కామనర్..
Image Credit : Jio Hotstar

సెలబ్రిటీలతో చేతులు కలిపిన కామనర్..

మరీ ముఖ్యంగా చరణ్ ఎలిమినేషన్ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. ఝాన్సీపై వ్యతిరేక భావనను కలిగించాయి. ఇక తాజాగా జరిగిన నామినేషన్ల ప్రక్రియలో ఆమె ప్రవర్తించిన తీరుపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. నామినేషన్ రౌండ్‌లో రైతు గెటప్‌లో కనిపించిన ఆమె, పల్లవి ప్రశాంత్ శైలిని గుర్తుచేస్తూ సింపతీ కార్డు ప్లే చేయడానికి ప్రయత్నించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు వర్కవుట్ అయిన 'రైతు బిడ్డ' ఎమోషన్స్.. ప్రతిసారీ వర్కౌట్ అవ్వవు అని.. ఫేక్ ఆట ఆడకుండా.. తన టాలెంట్ చూపిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి.

44
బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు ఉంటుందా?
Image Credit : Jio Hotstar Telugu

బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు ఉంటుందా?

అంతేకాకుండా, నియమ నిబంధనలను పాటించకపోవడం మరియు నామినేషన్ల ప్రక్రియను తీవ్రంగా తీసుకోకపోవడంతో బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి కూడా ఆమె హెచ్చరికలను ఎదుర్కొవాల్సి వచ్చింది. హౌస్‌లో ఆమె అనుసరిస్తున్న వ్యూహాలు కంటెస్టెంట్‌గా ఆమెకున్న క్రేజ్‌ను తగ్గించడమే కాకుండా, సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి. కామనర్ కోటాలో వచ్చి.. సెలబ్రిటీలతో చేతులు కలిపి.. రోహిత్ ను ఆమె టార్గెట్ చేయడం చాలామందికి నచ్చడంలేదు. అసలు బయటకు చెప్పకూడని మాటను కూడా అందరిముందు మాట్లాడి.. ఝాన్నీ అనవసరంగా నెగెటివిటీని మూటగట్టుకుంది. ఇలానే ఉంటే.. ఆమె ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండటం కష్టమనే చెప్పాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్
Recommended image2
Rukmini Vasanth: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణీ వసంత్
Recommended image3
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రివ్యూ, అది మీ డాడీ కాలం స్థాయి.. ముత్తువేల్ పాండియన్ గా రజనీ అరాచకం
Related Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved