- Home
- Entertainment
- Pawan Kalyan Remake: అక్కడ త్రిష, ఇక్కడ ఆసిన్.. సూపర్ హిట్ కావలసిన పవన్ మూవీ ఫ్లాప్ కి కారణం ఇదే
Pawan Kalyan Remake: అక్కడ త్రిష, ఇక్కడ ఆసిన్.. సూపర్ హిట్ కావలసిన పవన్ మూవీ ఫ్లాప్ కి కారణం ఇదే
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో అనేక రీమేక్ సినిమాలు చేశారు. వాటిలో అన్నవరం ఒకటి. సూపర్ హిట్ అయ్యే కంటెంట్ ఈ మూవీలో ఉన్నప్పటికీ ఫ్లాప్ అయింది. దానికి కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Annavaram
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చేసిన రీమేక్ సినిమాల్లో అన్నవరం ఒకటి. తనకి సుస్వాగతం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో పవన్ రెండోసారి నటించిన మూవీ ఇది. తమిళంలో సూపర్ హిట్ అయిన తిరుప్పాచ్చి చిత్రానికి ఇది రీమేక్.
సిస్టర్ సెంటిమెంట్ మూవీ
ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన ఆసిన్ హీరోయిన్ గా నటించింది. ఇది సిస్టర్ సెంటిమెంట్ మూవీ కాబట్టి పవన్ కళ్యాణ్ చెల్లి పాత్రలో నటి సంధ్య నటించారు. సిస్టర్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ ఇది మాస్ సినిమా. తమిళంలో దళపతి విజయ్ ఇమేజ్ కి బాగా సెట్ అయింది. ఆ మూవీలో త్రిష హీరోయిన్ గా నటించింది.
కథలో మార్పులు చేయలేదు
కానీ తెలుగులోకి దీనిని రీమేక్ చేద్దామని అనుకున్నప్పుడు ముందుగా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో మార్పులు చేయాలని భావించారట. కథలో మార్పులు చేసేందుకు కొందరు రచయితల టీమ్ కూడా వర్క్ చేశారు. కానీ తమిళ వెర్షన్ ని సేమ్ అలాగే ఫాలో కావాలా ? లేక మార్పులు చేయాలా అనే డైలమా పవన్ కళ్యాణ్ తో పాటు ఈ చిత్ర యూనిట్ కి ఉండేదట. చివరికి మార్పులు చేయకుండా తమిళ వెర్షన్ ని ఫాలో కావాలి అని డిసైడ్ అయ్యారట.
అందుకే ఫ్లాప్
ఆ నిర్ణయమే కొంప ముంచింది. పవన్ ఇమేజ్ కి తగ్గట్లుగా కథ మార్చకుండా తెరకెక్కించడంతో ఈ చిత్రం వర్కౌట్ కాలేదు. కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఈ మూవీలో యాక్షన్ సీన్స్, కొన్ని సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. కథని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చి ఉంటే సూపర్ హిట్ అయ్యేది అని చాలా మంది అభిప్రాయ పడ్డారు.
ఆసిన్ కి చివరి సినిమా
తెలుగులో ఆసిన్ కి ఇదే చివరి సినిమా. అంతకు ముందు ఆసిన్ తెలుగులో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, లక్ష్మీ నరసింహ లాంటి హిట్ సినిమాల్లో నటించింది.

