MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Nandu Bigg Boss: యూట్యూబర్ నందు బిగ్ బాస్ కోసం ఇండియాకు వచ్చిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిజమెంత?

Nandu Bigg Boss: యూట్యూబర్ నందు బిగ్ బాస్ కోసం ఇండియాకు వచ్చిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిజమెంత?

Nandu Bigg Boss: ఇండియాకు వచ్చి అడ్డంగా ఇరుక్కుపోయింది స్టార్ యూట్యూవర్ రమా నందన. వీసా స్కానమ్ లో చిక్కుకున్న రమా నందన సడెన్ గా ఇండియాకు వచ్చింది. ఆమె బిగ్ బాస్ లోకి వెళ్లాలని అనుకుందా? నిజమెంత?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 09 2026, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రమా నందన ఎందుకు ఇండియాకు వచ్చింది?
Image Credit : facebook.com/NandusWorld

రమా నందన ఎందుకు ఇండియాకు వచ్చింది?

సోషల్ మీడియా సంచలనం, డిజిటల్ క్రియేటర్ రమా నందన (నందు) అరెస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూకేలో నివసిస్తూ యూట్యూబ్ వీడియోలు, వ్లాగ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈమె ఎంతో దగ్గరైంది. సహజమైన శైలి, చమత్కారమైన సంభాషణలతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న నందు, వీసా స్కామ్‌లో ఇరుక్కుని ఇబ్బందుల్లో పడింది. ఆమెతో పాటు ఆమె భర్త మధుకర్‌పై కూడా 'లుక్ అవుట్' నోటీసు ఉంది. కాగా, ఇటీవల నందు ఇండియాలో ల్యాండ్ అవ్వడం, పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె ఇండియా పర్యటన వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై అనేక రకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బిగ్ బాస్ ఎంట్రీపై జోరుగా ప్రచారం
Image Credit : Asianet News

బిగ్ బాస్ ఎంట్రీపై జోరుగా ప్రచారం

నందు అలియాస్ రమా నందన ఇండియాకు రావడమే ఆలస్యం, ఆమె ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' కొత్త సీజన్‌లో పాల్గొనడానికే వచ్చిందనే ప్రచారం ఊపందుకుంది. ప్రతి ఏటా బిగ్ బాస్ నిర్వాహకులు ఎంతోమంది సోషల్ మీడియా సెలబ్రిటీలను, యూట్యూబర్లను హౌస్‌లోకి పంపించే ఆనవాయితీ ఉంది. ఈ క్రమంలోనే యూకేలో ఉంటున్న రమా నందనను ప్రత్యేకంగా సంప్రదించి, భారీ ఆఫర్‌తో ఇండియాకు రప్పించారంటూ నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. యూట్యూబ్‌లో ఆమెకున్న ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు ఆమె పేరును ఖరారు చేశారని అభిమానులు సైతం భావించారు. ఇప్పటికే బిగ్ బాస్ ప్రారంభమైంది. దాంతో యూట్యూబర్ నందుని 'వైల్డ్ కార్డ్ ఎంట్రీ' ద్వారా హౌస్‌లోకి పంపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Related Articles

Related image1
Breakup: లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారా? బ్రేకప్ బాధ నుండి బయటపడటానికి 3 కఠినమైన సూత్రాలు
Related image2
Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ
34
ఇండియా పర్యటన వెనుక అసలు నిజం?
Image Credit : facebook.com/NandusWorld

ఇండియా పర్యటన వెనుక అసలు నిజం?

అయితే తన ఇండియా పర్యటనపై, బిగ్ బాస్ ఎంట్రీపై వస్తున్న ప్రచారాలపై ఎలాంటి క్లారిటీ లేదు. బిగ్ బాస్ విషయంలో రమా నందన కూడా స్పందించలేదు. గత సీజన్‌లో కూడా ఈమె పేరు గట్టిగా వినిపించింది. ఈ మధ్య కాలంలో ఆమె పాపులారిటీ బాగా పెరిగింది. చిరంజీవి హీరోగా నటించిన 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమాలో కూడా ఆమె నటించింది. అయితే రమా నందన బిగ్ బాస్ కోసమే ఇండియాకు వచ్చిందా? లేక వ్యక్తిగత పనుల నిమిత్తం కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి హైదరాబాద్ వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది.

44
డిజిటల్ మీడియాలో చెరగని ముద్ర
Image Credit : facebook.com/NandusWorld

డిజిటల్ మీడియాలో చెరగని ముద్ర

యూట్యూబ్‌లో తనదైన కంటెంట్‌తో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్న నందు, కేవలం వీడియోలకే పరిమితం కాకుండా నెటిజన్లతో నిరంతరం టచ్‌లో ఉంటుంది. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఆమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు ఆడియన్స్ ఆమె బుల్లితెరపై లేదా వెబ్ సిరీస్‌లలో కనిపించే అవకాశం ఉందని భావించారు. అనుకున్నట్టుగానే సినిమాల్లో అవకాశాలు సాధించిన నందు, బిగ్ బాస్‌లోకి కూడా వెళ్తోందని ప్రచారం జరిగింది. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుంది? ఈ కేసు ఎక్కడివరకు వెళ్తుందో వేచి చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Recommended image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Recommended image3
Irumudi Collections: రవితేజ ఇప్పట్లో తగ్గేట్టు లేడుగా.. 18 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
Breakup: లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారా? బ్రేకప్ బాధ నుండి బయటపడటానికి 3 కఠినమైన సూత్రాలు
Recommended image2
Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved