- Home
- Entertainment
- Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ తాగుబోతు రమేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి చెప్పింది వింటే నిజంగా రమేష్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు.

Thagubothu Ramesh
దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని దర్శకుడు. తెలుగు దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన జక్కన్న ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. రాజమౌళి కెరీర్ బిగింగ్ లో కొంత కాలం ఫక్తు కమర్షియల్ సినిమాలు చేశారు. ఆ తర్వాత తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఎవ్వరూ టచ్ చేయని వైవిధ్యమైన కథాంశం ఉండేలా సినిమాలు చేస్తున్నారు.
రాజమౌళి ఈగ మూవీ
దీనితో రాజమౌళి సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతోంది. రాజమౌళి ఇలా సరికొత్త కథాంశంతో తెరకెక్కించిన చిత్రాలలో ఈగ ఒకటి. ఈగ రిలీజై సంచలన విజయం సాధించాక అనేక అంతర్జాతీయ స్టేజీలపై కూడా ప్రదర్శించబడింది. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ కమెడియన్ తాగుబోతు రమేష్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
తాగుబోతు రమేష్ జీవితంలో కష్టాలు
తాగుబోతు రమేష్ ఈగ మూవీలో కొన్ని సన్నివేశాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాగుబోతు రమేష్ గురించి రాజమౌళి ఎవ్వరికీ తెలియని నిజం చెప్పారు. అతడిని అందరూ నిజంగానే తాగుబోతు అని అనుకుంటారు. వాస్తవానికి రమేష్ అసలు తాగడు. రమేష్ వాళ్ళ తండ్రి తాగుబోతు. ఆయన తాగుబోతు కావడం వల్ల రమేష్ కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. చిన్నప్పటి నుంచి తండ్రిని అలా చూసి ఒక తాగుబోతు ఎలా ఉంటాడో అనేది రమేష్ కి బాగా అర్థం అయిపొయింది. అందుకే అంత నేచురల్ గా నటిస్తాడు.
రాజమౌళి ఎమోషనల్, ఎవరూ ఎవరికీ లైఫ్ ఇవ్వరు
కానీ రమేష్ జీవితం గురించి తెలుసుకుంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది అని రాజమౌళి అన్నారు. మీ సినిమాతో అలాంటి రమేష్ కి మంచి లైఫ్ ఇచ్చారు అని యాంకర్ రవి అనగా.. రాజమౌళి బదులిస్తూ దయచేసి ఆ మాట అనొద్దు. ఎవ్వరూ ఎవరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ. రమేష్ కి ట్యాలెంట్ ఉంది. నా సినిమాకి యూజ్ అవుతాడు కాబట్టే అతడికి అవకాశం ఇచ్చాను అని రాజమౌళి అన్నారు.
రాజమౌళిని ముఖం మీదే అడిగేసిన రమేష్
తాగుబోతు రమేష్ కూడా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈగ మూవీలో నావి ఇంకా కొన్ని సీన్లు ఉన్నాయి. కానీ ఫైనల్ ఎడిటింగ్ లో అవి కుదర్లేదు. రాజమౌళి సినిమాలో నటించడం నంది అవార్డు కంటే నాకు గొప్ప విషయం అని తాగుబోతు రమేష్ అన్నారు. రాజమౌళి గారిని బాహుబలి తర్వాత కలిశాను. బాహుబలిలో రాజమౌళి కళ్లు దుకాణం యజమానిగా కనిపిస్తారు. ఆ పాత్ర మీరెందుకు చేశారు సార్.. నాకు ఇచ్చి ఉండొచ్చు కదా అని ముఖం మీదే అడిగేశాను. ఆయన నవ్వేశారు అని తాగుబోతు రమేష్ పేర్కొన్నారు.

