MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nani: ఇలాంటి సినిమాలెందుకు చేస్తున్నావ్‌.. నానికి అమ్మ వార్నింగ్‌.. జడల వివాదంపై ఎట్టకేలకు వివరణ

Nani: ఇలాంటి సినిమాలెందుకు చేస్తున్నావ్‌.. నానికి అమ్మ వార్నింగ్‌.. జడల వివాదంపై ఎట్టకేలకు వివరణ

నాని వరుసగా యాక్షన్‌ సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్యారడైజ్‌ మూవీ లుక్స్ చూసి ఇలాంటి మూవీస్‌ ఎందుకు చేస్తున్నావంటూ, వద్దు అని చెప్పి వార్నింగ్‌ ఇచ్చిందట.

4 Min read
Author : Aithagoni Raju
Published : Sep 20 2026, 07:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్యారడైజ్‌తో అలరించబోతున్న నాని
Image Credit : Asianet News

ప్యారడైజ్‌తో అలరించబోతున్న నాని

నాని హీరోగా నటిస్తున్న మూవీ `ది ప్యారడైజ్‌`. శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో ఇది రూపొందింది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఇందులో మోహన్‌ బాబు విలన్‌ పాత్ర పోషిస్తుండగా, సంపూర్ణేష్‌ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నాని ఆదివారం మీడియాతో ముచ్చటించారు. ఇందులో జడలపై తాను చేసిన కామెంట్స్ వివాదం అయిన నేపథ్యంలో వివరణ ఇచ్చాడు. అదే సమయంలో వాళ్లమ్మ ఇచ్చిన వార్నింగ్‌ గురించి తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నానికి అమ్మ వార్నింగ్‌
Image Credit : Asianet News

నానికి అమ్మ వార్నింగ్‌

నాని అంటే ఫ్యామిలీ సినిమాలు, లవ్‌ స్టోరీస్. మంచి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు చేస్తారు. ఆయనకు మంచి ఫ్యామిలీ ఫాలోయింగ్‌ ఉంది. కానీ ఇటీవల మాస్‌, యాక్షన్‌ సినిమాలు చేస్తున్నారు. `సరిపోదా శనివారం`, `హిట్‌ 3` చిత్రాలతో యాక్షన్‌ సైడ్‌ వచ్చారు. ఇప్పుడు `ది ప్యారడైజ్‌` కూడా యాక్షన్‌ మూవీ. ఇప్పటి వరకు చేసిన చిత్రాలన్నింటిలో కెళ్ల ఇందులో ఎక్కువగా యాక్షన్‌ ఉంటుందని, ఇంత కష్టం తాను ఎప్పుడూ పడలేనని, పడబోనని తెలిపారు. ఆ విషయంలో ఇది టఫ్ఫెస్ట్ ఫిల్మ్ అని నాని తెలిపారు. ఈ క్రమంలో తాను జడలతో కనిపించడంపై నాని రియాక్ట్ అవుతూ, ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నావ్‌, మంచి కూల్‌గా, ఫ్యామిలీతో సరదాగా నవ్వుకునే సినిమాలు, హాయిగా సాగిపోయే సినిమాలు చేయమని వార్నింగ్‌ ఇచ్చిందట. ఇలాంటి సినిమాలొద్దు అని చెప్పిందట. అయితే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటుందని, తల్లి ఎమోషన్‌ మెయిన్‌గా ఉంటుందని, సినిమాలో యాక్షన్‌ మాత్రమే కాదు, అంతిమంగా ఎమోషనే లీడ్‌ తీసుకుంటుందని, సినిమా చూసి భయటకు వచ్చే ఆడియెన్స్ ఆ ఎమోషన్‌తోనే బయటకు వస్తారని తెలిపారు నాని.

36
జడల వివాదంపై నాని వివరణ
Image Credit : Asianet News

జడల వివాదంపై నాని వివరణ

ఇక ఇటీవల చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అమ్మాయిలు కూడా జడలు వేసుకోవాలని నాని కామెంట్‌ చేశారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన రియాక్ట్ అయ్యారు. తాను సరదాగా చేసిన కామెంట్ అని, జడల్‌ వేసుకుంటే ఆ పెయిన్‌ ఏంటో తనకు తెలిసిందని, అది చాలా కష్టమని చెప్పానని, నిజానికి అప్పుడప్పుడు అమ్మాయిలు కూడా జడలు వేసుకుంటే బాగుంటుందని జస్ట్ సరదాగా తాను చెప్పానని, కానీ దాన్ని ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఏం మాట్లాడినా తప్పుగానే వెళ్తుందని, అదే సమయంలో ఒక విషయంలో నెగటివ్‌గా తీసుకునేవారు ఉంటారు, పాజిటివ్‌గా తీసుకునే వాళ్లు ఉంటారు, అది కామన్‌. వాటిని పట్టించుకోవద్దు. కానీ జడల విషయంలో తాను మాట్లాడింది కేవలం జోక్‌ మాత్రమే, అది సీరియస్‌ కాదు అని చెప్పారు నాని.

46
యాక్షన్‌తోపాటు ఎమోషన్‌ హైలైట్‌గా ప్యారడైజ్‌
Image Credit : Asianet News

యాక్షన్‌తోపాటు ఎమోషన్‌ హైలైట్‌గా ప్యారడైజ్‌

సినిమా గురించి చెబుతూ, `జడల్‌ అనేది కథలో నుంచి వచ్చిన లుక్. నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు అన్నీ బాగా రిలేటబుల్‌గా, తెలిసిన ఒక పర్సన్ లాంటి ఫీలింగ్ వచ్చే రోల్స్. ఇందులో క్యారెక్టర్ మాత్రం జనరల్ సొసైటీలో పెరిగిన వ్యక్తి కాదు. అది ఏంటి అనేది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థం అవుతుంది. ఆ క్యారెక్టర్‌కి బిగినింగ్ నుంచే ఒక మ్యాడ్‌నెస్ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ని ఆడియన్స్ ఒక షాక్ వాల్యుతో చూస్తారు. నిజానికి తెలుగులోనే ఇలాంటి క్యారెక్టర్ చాలా కొత్త. నా మీద ఆ క్యారెక్టర్ ఇంకా ఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే సినిమా ఇది. మదర్-సన్ ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమా నుంచి ఏమైతే ఆశిస్తారో అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీస్ అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు. `ప్యారడైజ్` కథలోనే యాక్షన్ ఉంది. అందులో ప్రతి యాక్షన్ కూడా ఒక ఎమోషన్‌తో మొదలవుతుంది. ప్రతి దెబ్బ వెనక ఒక ఎమోషన్ ఉంటుంది. మా గ్లింప్స్‌ని రిలీజ్ చేసినప్పుడు ఒక తల్లి తన కొడుకు గురించి చెప్పే కథగా మొదలు పెట్టాము. టీజర్‌లో కూడా మెయిన్ ఎలిమెంట్ మదర్ మీదే కట్ చేశాము. సినిమా మొదలయ్యేదే మదర్ ఎమోషన్‌తో, మదర్‌తో ఎండ్ అవుతుంది. ఆ ఎమోషన్ మనసులో నిలిచిపోతుంది. అది మీకు హ్యాంగోవర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మూడు, నాలుగు రోజులు ‘ప్యారడైజ్’ మీ మైండ్ నుంచి వెళ్లదు` అని చెప్పారు నాని.

56
డూప్‌ లేకుండా నటించా
Image Credit : Asianet News

డూప్‌ లేకుండా నటించా

దర్శకుడు శ్రీకాంత్ ఒక ఆడియన్‌గా మాస్ కమర్షియల్ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తాడు. తను ఏం చేసినా సరే తెలియకుండానే థియేటర్‌లో ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందనే చూస్తాడు. మానిటర్లు చూస్తున్నప్పుడు థియేటర్‌లో దీనికి రియాక్షన్ వస్తుందనిపించినప్పుడే టేక్ ఓకే చేస్తాడు. ఏదైనా సీన్ బాగా వచ్చిన రోజు నా దగ్గరికి వచ్చి ‘థియేటర్ ఊగిపోద్దన్న’ అంటాడు. అది తన నమ్మకం. తను మాస్‌ని ఒక దైవంలాగా భావిస్తాడు. శ్రీకాంత్ నరనరాల్లో మాస్ ఉంది. ఆ మాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది. ఇందులో ఒక రెండు ఎపిసోడ్లు చాలా రాడికల్‌గా తీశాడు. నా ఫేవరెట్ ఎపిసోడ్స్. ఆడియన్స్ చూసి చాలా సర్‌ప్రైజ్, షాక్ అవుతారు. సినిమాలో యాక్షన్‌, రిస్కీ షాట్స్ సొంతంగానే చేశాను. ఇంకో 15 ఇయర్స్ తర్వాత డూప్‌కి అప్పచెప్తానేమో (నవ్వుతూ). డూప్ చేస్తే నేను ఎంజాయ్ చేయలేను. అది నా ప్రాబ్లం. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అందరికీ చెప్తాను సినిమాలో లెగ్ షాట్ అయినా, హ్యాండ్ కనిపించే షాట్ అయినా నేనే స్వయంగా చేస్తా. స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ‘అబ్బా.. ఇది డూప్ షాట్’ అని అనిపిస్తే ఆ కాంప్లిమెంట్‌ను నేను జెన్యూన్‌గా తీసుకోలేను.

66
యాక్షన్‌ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది
Image Credit : X

యాక్షన్‌ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది

అందరు నన్ను జడలుతో చూసి సర్‌ప్రైజ్ అయ్యారు. ఇందులో ప్రతి డీటెయిల్‌కి ఒక కారణం ఉంటుంది. ఇందులో మీరు చూస్తుంది సవారీల బొట్టు. ఎవరినైనా బలవంతంగా తీసుకెళ్లి టాటూ వేస్తే వాడు సవారీ అయిపోయినట్టే. అలాగే ముక్కుపుడక, చైను అన్నిటికీ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మేకప్ వేసుకోవడానికి గంట నలభై నిమిషాలు పడుతుంది. మళ్లీ మేకప్ తీయడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. కొన్నిసార్లు ఏకధాటిగా 36 గంటల పాటు షూట్ చేశాం. లోపల స్కాల్ప్ అంతా రెడ్‌గా మారిపోయేది. ‘ప్యారడైజ్’ నా కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ యాక్షన్ బ్లాక్స్ ఉన్న సినిమా. ఈ జడలతో యాక్షన్ చేయడం అనేది ఎంత సమస్యగా ఉంటుందో ఊహించలేం. ఈ సినిమా మొత్తం చాలా రోప్ వర్క్ ఉంటుంది. యాక్షన్ చేస్తున్నప్పుడు జడ రోప్‌కి చుట్టుకునేది. నా కష్టం చూసి ఫైట్ మాస్టర్లు ఈ కష్టం అసలు ఎలా భరిస్తున్నారని నా మీద చాలా జాలి పడ్డారు. సినిమాపై ఎలాంటి కామెంట్స్ వచ్చినా ఔట్‌పుట్‌ విషయంలో రాజీపడలేదు. అది అదిరిపోయింది. రేపు మీరు ఎంత ఎక్స్ పెక్టేషన్‌తో వెళ్ళినా మిమ్మల్ని సంతోషపరుస్తుంది` అని తెలిపారు నాని. పిల్లలు తప్ప ఫ్యామిలీ, పెద్దలు చూడగలిగే మూవీ ఇది అని వెల్లడించారు నాని. ఇక ఫైనల్‌గా ఇందులో కయాదు లోహర్ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని, కథలో భాగంగా ఆమె పాత్ర ఉంటుందన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాని (నటుడు)
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
Chiranjeevi-Roja: రోజా ప్రేమ వ్యవహారంపై చిరంజీవి బోల్డ్ కామెంట్‌.. మెగాస్టార్‌కి ఇచ్చిపడేసిన సురేఖ
Recommended image2
Shruti Haasan: సీరియస్ సమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్.. అందుకే పిల్లల్ని దత్తతకు రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved