MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ

Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ

Gharana Mogudu Review: మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్ తో పాటు రెమ్యునరేషన్ కూడా డబుల్ చేసిన మూవీ ఘరానా మొగుడు. ఈ సినిమాతో బిగ్ బీ అమితాబ్ ను కూడా సెకండ్ ప్లేస్ కు పడేశాడు చిరంజీవి. ఇంతకీ విషయం ఏంటి? ఘరానా మొగుడు రివ్యూలో తెలుసుకుందాం?

4 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 09 2026, 08:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఘరానా మొగుడు రివ్యూ
Image Credit : Asianet News

ఘరానా మొగుడు రివ్యూ

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసి, ట్రెండ్ సెట్టర్లుగా నిలుస్తాయి. అలాంటి సంచలనాల్లో టాప్ ప్లేస్ లో నిలిచే సినిమా ఏదైనా ఉందంటే అది ఘరానా మొగుడు. మెగాస్టార్ చిరంజీవి, నగ్మ జంటగా.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్, తెలుగు సినిమా స్థాయిని పాన్-ఇండియా రేంజ్‌కు పెంచడమే కాకుండా రూ. 10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన మొదటి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఘరానా మొగుడు కథ విషయానికి వస్తే.. (Storyline)
Image Credit : Asianet News

ఘరానా మొగుడు కథ విషయానికి వస్తే.. (Storyline)

విశాఖపట్టణం పోర్టులో పని చేస్తున్న రాజు (చిరంజీవి) తోటి ఉద్యోగులకి సహాయపడుతూ అందరి మెప్పు పొందుతుంటాడు. తన తల్లి (శుభ) కి పక్షవాతం రావటంతో హైదరాబాదుకి తిరిగివచ్చి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన పారిశ్రామికవేత్త అయిన బాపినీడు (రావు గోపాలరావు) ని రాజు రక్షిస్తాడు. అతని మంచితనాన్ని మెచ్చిన బాపినీడు తన సంస్థలోని ఒక ఉద్యోగానికి సిఫారసు పత్రాన్ని రాజుకి ఇస్తాడు. పొగరుబోతు అయిన బాపినీడు కుమార్తె ఉమాదేవి (నగ్మా) వ్యక్తిత్వం రాజుకి మొదటి నుండి నచ్చదు. సంస్థలో ఉద్యోగుల వద్ద మంచి పేరును సంపాదించిన రాజు వారికి నాయకత్వం వహిస్తూ ఉండటం ఉమాదేవికి నచ్చదు. అతనిని పెళ్ళి చేస్కొని అతని నోరు మూయించాలి అని ఎత్తు వేస్తుంది. కాని పెళ్ళి తర్వాత రాజు ఉమాదేవికి మరింత పెద్ద సమస్యగా మారతాడు. తన సెక్రటరీ అయిన భవాని (వాణీ విశ్వనాథ్) తో రాజు చనువుని ఉమాదేవి అపార్థం చేస్కొంటుంది. తన కొడుకుతో సంబంధాన్ని నిరాకరించిన ఉమాదేవిని అంతం చేయాలన్న రంగనాయకులు (కైకాల సత్యనారాయణ) ఎత్తుని చిత్తు చేస్తూ రాజు తన భార్యని రక్షించుకోవటంతో ఉమాదేవి రాజులోని మంచితనాన్ని గుర్తిస్తుంది. చివరికి ఉమాదేవి రాజుకు ఎలా దగ్గరవుతుంది.. క్లైమాక్స్ లో జరిగే ట్విస్ట్ ఏంటి? అనేది అసలు కథ.

Related Articles

Related image1
Samantha: తల్లి కాబోతున్న వేళ ఈశా యోగా సెంటర్‌లో సమంత.. 'ఈ ప్రయాణం ముగియదు' అంటూ పోస్ట్
Related image2
Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?
37
నటీనటుల పనితీరు (Performances)
Image Credit : Asianet News

నటీనటుల పనితీరు (Performances)

రాజు పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటన అద్భుతం. ఆయన మాస్ మ్యానరిజమ్స్, ''కాస్త ఫేస్ లెప్ట్ టర్న్ ఇచ్చుకోండి..'' "బంగాళాఖాతంలో..." డైలాగ్ డెలివరీ, డ్యాన్సులు థియేటర్లలో ఈలలు వేయించాయి. కమెడీ, యాక్షన్, ఎమోషన్స్ అన్నింటినీ సరిగ్గా సమతుల్యం చేస్తూ సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించారు.

ఇక నగ్మ విషయానికి వస్తే.. పొగరుబోతు ధనవంతురాలిగా ఉమాదేవి పాత్రలో నగ్మ ఒదిగిపోయారు. ఆమె గ్లామర్, చిరంజీవితో ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మెగాస్టార్ కుపోటీ పడి ఈసినిమాలో నగ్మ నటించారు. సెకండ్ హీరోయిన్ గా నటించిన వాణి విశ్వనాథ్ విషయానికి వస్తే.. చిరంజీవితో ఆమె సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఇద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్ ఈసినిమాకు హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి.

ఎప్పుడు విలన్ గా నటించే రావు గోపాలరావు పాజిటీవ్ పాత్రలో అద్బుతం చేశారు. ఈసినిమాలో ఆయన్ను చూసి ఆడియన్స్ తెగ సంతోషపడ్డారని చెప్పుకోవచ్చు. ఇక విలన్ గా కైకాల సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అనుభవంతో విలన్ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశారు. ఇక కామెడీ విషయానికి వస్తే.. బ్రహ్మానందం కామెడీ కడుపునొప్పి రావడంఖాయం.. రిక్షాకార్మికుడిగా బ్రహ్మీ పెర్ఫామెన్స్ అదరిపోయింది. ఇక సాక్షి రంగారావు, రమాప్రభ లాంటి ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు అద్భుతంగా నటించారు అని చెప్పాలి.

47
సాంకేతిక విశ్లేషణ (Technical Aspects)
Image Credit : Asianet News

సాంకేతిక విశ్లేషణ (Technical Aspects)

దర్శకుడు కె. రాఘవేంద్రరావు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను హ్యాండిల్ చేయడంలో దిట్ట. కన్నడ చిత్రం 'అనురాగ అరళితూ' కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలచడంలో ఆయన 100% విజయం సాధించారు. ఈ సినిమాకు దర్శకేంద్రుడు రూపం తెస్తే.. తన సంగీతంతో ఎం. ఎం. కీరవాణి ప్రాణం పోశారు. ఆయన అందించిన ట్యూన్స్ చిరంజీవి మాస్ ఇమేజ్ ను డబుల్ చేశాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆడియన్స్ ను సీన్ల నుంచి కదలనీయకుండా చేస్తుంది. ఇక పాటల విషయానికి వస్తే.. "బంగారు కోడి పెట్ట" పాట ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. "కిలాడి బుల్లోడ" , "హే పిల్లా హలో పిల్లా" ''ఏందిబే ఎట్టాగ ఉంది'' వంటి పాటలు ఇప్పటికీ పాపులర్.

57
ఘరానా మొగుడు రికార్డులు ‌- విశేషాలు..
Image Credit : Asianet News

ఘరానా మొగుడు రికార్డులు ‌- విశేషాలు..

అమితాబ్ కు షాక్ ఇచ్చిన చిరంజీవి..

ఘరానా మొగుడు సినిమా రాజ్ కుమార్ నటించిన కన్నడ హిట్ 'అనురాగ అరళితూ'కి అధికారిక రీమేక్. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా రాఘవేంద్రరావు మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ జోడించి దీనిని పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా మార్చారు.

రూ. 10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన మొదటి తెలుగు సినిమాగా ఘరానా మొగుడు రికార్డు సృష్టించింది. ఈ చిత్రం 39 కేంద్రాల్లో 100 రోజులు, 184 రోజులు (అంటే అర్ధ శతాధిక దినోత్సవం) పైగా ప్రదర్శించబడింది.

ఈ సినిమా సాధించిన సంచలన విజయంతో ' అప్పట్లో ప్రముఖ పత్రిక తన మేగజైన్ లో చిరంజీవి ఫోటోతో "బిగ్గర్ దాన్ అమితాబ్" (అమితాబ్ బచ్చన్ కంటే పెద్ద స్టార్) అనే శీర్షికతో కవర్ స్టోరీ ప్రచురించింది. ఈ సినిమా విజయం తర్వాత చిరంజీవికి రూ. 1.25 కోట్ల రెమ్యూనరేషన్ లభించింది. దాంతో ఆ సమయంలో భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా ఆయన వార్తల్లో నిలిచారు.

67
మాస్ ను ఊపేసిన బంగారు కోడి పెట్ట సాంగ్
Image Credit : Asianet News

మాస్ ను ఊపేసిన బంగారు కోడి పెట్ట సాంగ్

ఎం. ఎం. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలం. ముఖ్యంగా "బంగారు కోడి పెట్ట" పాట తెలుగు రాష్ట్రాలను ఊపేసింది. ఈ పాట కొరియోగ్రఫీ, చిరంజీవి డాన్స్ మూవ్స్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించాయి. చిరంజీవి చెప్పిన "బంగాళాఖాతంలో..." అనే డైలాగ్, ఆయన మాస్ మ్యానరిజమ్స్ అప్పట్లో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరి నోళ్లలో నానాయి.

సినిమా విడుదలైన సమయంలో వైజాగ్ , హైదరాబాద్‌లలో అభిమానులు థియేటర్ల దగ్గర భారీ ఎత్తున కటౌట్లు పెట్టి, క్షీరాభిషేకాలు చేశారు. చిరంజీవి కటౌట్‌కు పూలదండలు వేయడానికి క్రేన్లు ఉపయోగించడం అప్పట్లో పెద్ద వింతగా మాట్లాడుకున్నారు. ఈ సినిమా టికెట్ల కోసం థియేటర్ల వద్ద తొక్కిసలాటలు జరిగాయి. రూపాయి టికెట్ బ్లాక్‌లో రూ. 50 నుండి రూ. 100 వరకు అమ్ముడవ్వడం ఆ రోజుల్లో ఒక సంచలనం.

77
ప్లస్ & మైనస్ పాయింట్స్
Image Credit : Asianet News

ప్లస్ & మైనస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్:

చిరంజీవి ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, డాన్సులు ,మ్యానరిజమ్స్.

చిరంజీవి-నగ్మ మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ.

ఎం. ఎం. కీరవాణి చార్ట్ బస్టర్ మ్యూజిక్.

కె. రాఘవేంద్రరావు మార్క్ కమర్షియల్ టేకింగ్.

మైనస్ పాయింట్స్:

రొటీన్ మాస్ స్టోరీ.

సెకండాఫ్‌లో కొన్ని సీన్లు కాస్త ఊహించదగినవిగా ఉండటం.

ఫైనల్ గా..

ఘరానా మొగుడు అనేది తెలుగు సినిమా చరిత్రలో ఒక ల్యాండ్‌మార్క్ మూవీ. మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్‌ను శిఖరాగ్రానికి తీసుకెళ్లిన చిత్రం ఇది. డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ, రొమాన్స్ అన్ని సమపాళ్లలో కుదిరిన పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఇప్పటి ఆడియన్స్ ను కూడా ఈసినిమా అలరించగలదు. ఈమూవీ చూడాలంటే యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సినిమా సమీక్షలు
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pandanti Kapuram Review: ఏఎన్నార్ దసరాబుల్లోడికి షాక్ ఇచ్చిన కృష్ణ, సూపర్ స్టార్ ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ మూవీ, పండంటి కాపురం రివ్యూ..
Recommended image2
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Recommended image3
Sahaa Movie Review: సహ మూవీ రివ్యూ.. హీరోయిన్‌ గుండు కొట్టించుకోవాలా? వద్దా?
Related Stories
Recommended image1
Samantha: తల్లి కాబోతున్న వేళ ఈశా యోగా సెంటర్‌లో సమంత.. 'ఈ ప్రయాణం ముగియదు' అంటూ పోస్ట్
Recommended image2
Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved