నాగ్ బర్త్ డే నాడు అషురెడ్డి అతి... ఏం చేసిందో చూడండి, ఈ రేంజ్ లో అవసరమా!
విషయం ఏదైనా అతి చేయడంలో ముందుంటుంది అషురెడ్డి. పబ్లిసిటీ పిచ్చి ఆమెకు పీక్స్ లో ఉంటుంది. దాని కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడదు. యూట్యూబ్ వ్యూస్ కోసం గర్భవతిని అని చెప్పి తల్లితో చెంప దెబ్బలు తిన్న హిస్టరీ ఆమె సొంతం.

HBD Nagarjuna
బుల్లితెర షోస్ లో కూడా అమ్మడిది అదే తీరు. మేనేజర్స్ చెప్తారో లేక ఈమె చేస్తుందో తెలియదు కానీ చాలా వరస్ట్ గా బిహేవ్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలే ఉన్నాయి. కాగా నేడు నాగార్జున పుట్టినరోజు నేపథ్యంలో బెస్ట్ విషెస్ తెలియజేసింది. 63 ఏళ్ల ఓ సీనియర్ హీరోకి ఆమె బర్త్ డే విషెస్ చెప్పిన తీరు దారుణంగా ఉంది.
HBD Nagarjuna
నాగార్జునను గట్టిగా ముద్దాడుతున్న ఫోటోలు పోస్ట్ చేసిన అషురెడ్డి, హలో మన్మధుడు మీకు చాలా ముద్దులు. మీరు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను సర్... అంటూ కామెంట్ పెట్టింది. ఆమె షేర్ చేసిన ఫోటోలు కానీ, కామెంట్ కానీ హద్దులు దాటినట్లు ఉన్నాయి.
HBD Nagarjuna
బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న అషురెడ్డి ఓ సందర్భంలో పర్మిషన్ తీసుకొని ముద్దాడింది. అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న ఆమె మరోసారి అదే పని చేసింది. నిజానికి ఎవరైనా అభిమానం ఉంటే ఫార్మల్ గా హగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈమె మాత్రం భిన్నం ఏకంగా బుగ్గలపై లిప్స్టిక్ ముద్రలు వేసేస్తుంది.
HBD Nagarjuna
ఆ రెండు సందర్భాల్లో దిగిన ఫోటోలు షేర్ చేసి తాను ఎంత అతి చేయగలదో చాటుకుంది. ఇలాగే గతంలో పవన్ కళ్యాణ్ నాలుగో భార్యగా ఉంటానని చెప్పి సంచలనం రేపింది. ఎవరైనా ఫోన్ చేసి చివాట్లు పెట్టాడేమో తెలియదు కానీ... ఏడుస్తూ వీడియో చేసింది. తన మాటలు వక్రీకరించారని గగ్గోలు పెట్టింది.
గ్లామర్ ఫీల్డ్ లో పబ్లిసిటీ అవసరమే కాని దానికి ఇలాంటి మార్గాలు ఎంచుకోవడం తప్పు. ఇంత అతి చేస్తున్నా కనీసం యాంకర్ గా కూడా ఎదగలేకపోతుంది. ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ గడిపేస్తుంది. జూనియర్ సమంతను అంటూ ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి వ్యవహారం పలుమార్లు విమర్శల పాలైంది.