యంగ్ హీరోయిన్ తో నాగ చైతన్య డేటింగ్? ఇంట్లో వాళ్లకూ పరిచయం చేసిన చైతూ.!
అక్కినేని వారి ఇంటా కొత్త కోడలు అడుపెట్టబోతోంది. సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత చైతూ మరో యంగ్ హీరోయిన్ తో డేటింగ్ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

నాగచైతన్య - సమంత యంగ్ స్టార్ కపుల్ గా గతంలో అందరినీ ఆకట్టుకున్నారు. కొన్ని కారణాల వల్ల గతేడాది అక్టోబర్ 2న వీరిద్దరూ విడిపోతున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, ఎవరి జీవితాల్లో వారు కొనసాగాలనుకుంటున్నట్టు ప్రకటించడం అందరినీ షాక్ కు గురి చేసింది.
ఇప్పటికైనా సమంత నాగచైతన్య కలుస్తారనే ఆశ అభిమానుల్లో ఉండేది. ముఖ్యంగా నాగచైతన్య ఫ్యాన్స్ మాత్రం సమంత ప్రవర్తనపై చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. చైని వీడిపోయినందుకు అప్సెట్ అయ్యారు. వీరిద్దరూ వీడిపోయినప్పటి నుంచి ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు.
చైతూను మరిచిపోయేందుకు సమంత సినీ కేరీర్ లో బిజీ అయ్యింది. వరుస సినిమాలను ప్రకటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. చైతూతో వీడిపోయాక తొలిసారిగా ‘పుష్ఫ’ చిత్రంలో ఐటెం సాంగ్ లో మెరిసింది. ప్రస్తుతం ‘యశోద’, ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాల్లో నటిస్తూ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.
ఇక నాగచైతన్య కూడా చివరిగా ‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ‘థాంక్యూ యూ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు బాలీవుడ్, కోలీవుడ్ ఎంట్రీలకు గ్రాండ్ గా ప్లాన్ చేశాడు. ఇలా ఎవరి లైఫ్ లో వారు బీజీగా ఉన్నారు. ఒకరినొకరు కలిసే ప్రసక్తే లేదంటూ ముందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో నాగ చైతన్య మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘మేజర్’ హీరోయిన్ శోభితా ధూళిపాళతో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సమంతతో సెపరేట్ అయిన ఎనిమిది నెలలకే క్లోజ్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ చాలా సార్లు హోటళ్లలో కలిశారని కూడా నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి.
‘మేజర్’ మూవీలో కీలక పాత్ర పోషించిన శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య కొత్త ఇంటిలో చాలా గంటలు శోభిత దూళిపాళ్ల గడుపుతున్నట్లు టాక్. ఇటీవల మేజర్ ప్రమోషన్ కార్యక్రమాల సమయంలోనూ ఎక్కువగా నాగచైతన్య ఇంట్లోనే గడిపిందంట.
అలాగే ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి. పొగలేనిదే మంట రాదన్నట్టుగా నాగ చైతన్య - శోభితా ధూళిపాళ లవ్ ట్రాక్ హాట్ టాపిక్ గా నడుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. గతనెలలో శోభిత బర్త్ డేను కూడా నాగచైతన్యతో కలిసి హైదరాబాద్ లోనే జరుపుకొందటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబైకి చెందిన శోభితా హైదరాబాద్ కు పని నిమిత్తం వచ్చిన ప్రతి సారి నాగచైతన్య ఇంట్లోనే సమయం గడుపుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే నాగచైతన్య ఇంట్లో వాళ్లకూ శోభితను పరిచయం చేసినట్టుగా సమాచారం. ఇదే నిజమైతే త్వరలో అక్కినేని వారి ఇంట కొత్త కోడలు అడుగుపెట్టే అవకాశం ఉంది.