Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `కల్కి 2` షూటింగ్‌, రిలీజ్‌పై అదిరిపోయే అప్‌ డేట్‌.. నాగ్‌ అశ్విన్‌ ని నమ్మొచ్చా? ప్రభాస్‌ ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్

`కల్కి 2` షూటింగ్‌, రిలీజ్‌పై అదిరిపోయే అప్‌ డేట్‌.. నాగ్‌ అశ్విన్‌ ని నమ్మొచ్చా? ప్రభాస్‌ ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్

ప్రభాస్ నటించిన `కల్కి 2898 ఏడీ` మూవీ గతేడాది విడుదలై ఏకంగా 1200కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు `కల్కి 2` రాబోతుంది. దీనికి సంబంధించిన అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చారు నాగ్‌ అశ్విన్‌. 
 

Aithagoni Raju | Published : Jan 26 2025, 07:15 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

ప్రభాస్‌ లైనప్‌లో ఇప్పుడు ఐదారు సినిమాలున్నాయి. ఏది ముందు పూర్తవుతుంది? ఏది ఎప్పుడు షూటింగ్‌ జరుపుకుంటుంది? ఏది ఎప్పుడు రిలీజ్‌ అవుతుందనేది పెద్ద ప్రశ్న. ఇది అటు ఆయనతో సినిమాలు చేసే మేకర్స్ కి, ఇటు అభిమానుల్లో నెలకొన్న కన్‌ఫ్యూజన్‌. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన కామెంట్ ఇప్పుడు మరింత కన్‌ప్యూజన్‌ క్రియేట్‌ చేస్తుంది. డార్లింగ్‌ ఫ్యాన్స్ ని మరింత దైలమాలో పడేస్తుంది. 

27
Asianet Image

ప్రభాస్‌ ప్రస్తుతం `ది రాజా సాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడుతుందని తెలుస్తుంది. మరోవైపు హను రాఘవపూడితో `ఫౌజీ` సినిమా చేస్తున్నారు ప్రభాస్‌. ఇది ఆర్మీ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే లవ్‌ స్టోరీ అని, ఇప్పటి వరకు ఇండియన్‌ సినిమాలో ఇలాంటి బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా రాలేదని దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

37
nag ashwin

nag ashwin

ఈ క్రమంలో తాజాగా `కల్కి 2`కి సంబంధించిన అప్‌ డేట్‌ ఇచ్చాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఈ మూవీ షూటింగ్‌ కి సంబంధించి, అలాగే రిలీజ్‌ డేట్‌పై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని తెలిపారు.

ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని, ప్రభాస్‌ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడే షూటింగ్‌ చేస్తామన్నారు. ఆయన చెప్పినదాని ప్రకారం ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందట. ఈ ఏడాది ఎండింగ్‌లో షూటింగ్‌ని స్టార్ట్ చేసి వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు నాగ్‌ అశ్విన్‌. 

47
Asianet Image

ఇదే ఇప్పుడు క్రేజీగా మారింది. ఓ వైపు ప్రభాస్‌ ఇంకా `ది రాజా సాబ్‌` షూటింగ్‌ పూర్తి చేయలేదు. మరోవైపు `ఫౌజీ` సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా టైమ్‌ పడుతుంది. అలాగే నెక్ట్స్ `స్పిరిట్‌` మూవీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇది కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే స్టార్ట్ అవుతుందని అంటున్నారు. సందీప్‌ రెడ్డి వంగా లొకేషన్‌ అన్వేషణ కోసం బయలు దేరబోతున్నారట. 
 

57
Asianet Image

ఈ మూడు సినిమాలు షూటింగ్‌ పూర్తి కావడానికి మరో ఏడాది, రెండేళ్లు పట్టేలా ఉంది. దీంతోపాటు `సలార్‌ 2` కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే `కల్కి2` కంటే ముందే `సలార్‌2` చేయాల్సి ఉంది. మరి ఇవన్నీ కాదని ప్రభాస్‌ `కల్కి2`లో ఎప్పుడు పాల్గొంటారు. ఎప్పుడు పూర్తవుతుంది.

వచ్చే ఏడాది డిసెంబర్‌లో రిలీజ్‌ సాధ్యం అవుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇదే పెద్ద అంటే దీనికి మరో పార్ట్ కూడా ఉందట. `కల్కి 3` కూడా ఉందనే వార్త బయటకు వచ్చింది.
 

67
Asianet Image

 `కల్కి` ఒక సిరీస్‌ లాగా రాబోతుందనే హింట్‌ ఇచ్చాడు నాగ్‌ అశ్విన్‌. ఈ క్రమంలో ఇప్పుడు `కల్కి 3`కి సంబంధించిన వార్త కూడా వినిపిస్తుంది. మరి ఇది ఎప్పుడు ఉంటుందనేది పెద్ద సస్పెన్స్. ఇవన్నీ ఇప్పుడు అటు డార్లింగ్‌ ఫ్యాన్స్ ని, ఇటు ఆయనతో సినిమాలు చేసే మేకర్స్ కి ఆశ్చర్యంగా మారింది.

మరి డార్లింగ్‌ ఏం చేస్తారనేది చూడాలి. ఆయన చేతుల్లోనే ఈ సినిమాల భవితవ్యం ఆధారపడి ఉంది. ఆయన యాక్టివ్‌గా, వేగంగా షూటింగ్‌లో పాల్గొంటే త్వరగానే పూర్తి అవుతాయి, ఆయన డిలే చేస్తే సినిమాలన్నీ డిలే అయిపోతాయి.

77
Kalki2898AD

Kalki2898AD

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన `కల్కి 2898 ఏడీ` సినిమాలో ప్రభాస్‌తోపాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, ఆర్జీవీ, రాజమౌళి, మృణాల్‌ ఠాకూర్‌, ఫరియా అబ్దుల్లా, రాజేంద్రప్రసాద్‌, శోభన నటించిన విషయం తెలిసిందే. 

read  more: బాలయ్య, నాగార్జున మధ్య విభేదాలు మరోసారి బట్టబయలు, పద్మభూషణ్‌ పురస్కారంపై స్పందించని నాగ్‌?

also read: `గేమ్‌ ఛేంజర్‌`లో రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌ కి ఫ్యాన్స్ ఫిదా అయిన సీన్లు ఏంటంటే? వైరల్‌

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
ప్రభాస్
నాగ్ అశ్విన్
 
Recommended Stories
Top Stories