MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika deepam: మోనితతో దర్శనం ఇచ్చిన కార్తీక్.. డ్రైవర్ కు చుక్కలు చూపించిన వంటలక్క!

Karthika deepam: మోనితతో దర్శనం ఇచ్చిన కార్తీక్.. డ్రైవర్ కు చుక్కలు చూపించిన వంటలక్క!

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 25వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం... 

3 Min read
Author : Navya G
Published : Aug 25 2022, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... దీప, మొనిత వెనకాతలే వెళుతూ మొనిత ఇంటి దగ్గరికి వస్తుంది. అప్పుడు దీప మనసులో ఈరోజు నీ నాటకాన్ని బయటపెడతాను డాక్టర్ బాబు నీ దగ్గర ఉన్నారని నాకు తెలుసు అయినా సరే ఏడుస్తున్నట్టు బలే నటిస్తున్నావు భలే నటిస్తున్నావు అని అనుకుంటుంది. అప్పుడు దీపా లోపలికి వెళ్లి చూసేసరికి గోడలన్నీ కార్తీక్ ఫోటోలే ఉంటాయి.అప్పుడు మోనిత కార్తీక్ ఫోటో దగ్గరికి వెళ్లి, ఎక్కడికి వెళ్లిపోయావు కార్తీక్, ఎందుకు విధి మనల్ని ఎప్పుడూ వేరు చేస్తూనే ఉన్నది. అసలు ఎక్కడున్నావు? ఈరోజు దీప నాకు కనిపించింది.
 

26

నిన్ను ఎవరో హాస్పటల్ నుంచి తీసుకువెళ్లిపోయారట అది నిజమో కాదో కూడా తెలీదు నీ భార్య అని చెప్పారట అయితే నేను చెప్పాలి లేకపోతే దీప చెప్పాలి ఇంకా ఎవరై ఉంటారు. అసలు నీకు దగ్గరవుదాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో విధి నన్ను నీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది అని కార్తీక్ ఫోటో చూసి ఏడుస్తుంది మోనిత. అప్పుడు దీప నిజంగానే డాక్టర్ బాబు దీని దగ్గర లేరా? ఒకసారి ఇల్లంతా చూద్దాము అని చెప్పి గదిలోని వెతుకుతూ ఉంటాది. ప్రతి గదిలోను కార్తీక్ ఫోటోలు ఉంటాయి అక్కడ ఒక గదిలో కార్తీక్, కార్తీక్! అని గోడమీద అంతా రాసి ఉంటుంది.
 

36

అప్పుడు దీపా నిజంగానే డాక్టర్ బాబు దీని దగ్గర లేదు అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సౌందర్య, శౌర్య కోపం ఎప్పుడు తగ్గుతుంది పోనీ తన కోపం చల్లారే దాకా అలాగే ఉంచుదాము అంటే హిమ ఒప్పుకోవడం లేదు, హిమతో ఉండడానికి శౌర్య ఒప్పుకోవడం లేదు. నేనేం చేయాలి అని బాధపడుతూ ఉండగా హిమ అక్కడికి వచ్చి శౌర్యకి  ఇష్టం అయిన స్వీట్స్ అని ఇస్తుంది. సౌందర్య మొకం మాడ్చేస్తుంది.  అప్పుడు ఆనందరావు హిమతో నువ్వెళ్ళు రెడీ అవ్వు మనం బయలుదేరుదాము అని అంటాడు. 
 

46

అప్పుడు హిమ వెళ్తూ ఉండగా ఆనందరావు సౌందర్యతో మనం వెళ్దాం అనుకున్నాం కదా ఇప్పుడు ఎందుకు మొఖం అలా పెట్టావు అని అనగా వెళ్లడంలో నాకేమీ సమస్య లేదండి కానీ హిమని చూసి శౌర్య కోపం ఇంకా పెంచుకుంటుంది. కోపం తగ్గేంత వరకు కనబడక పోవడమే మంచిది అనుకున్నాను ఏం జరుగుతుందో తెలియడం లేదు ఒక కన్ను కోసం చూస్తే ఇంకో కన్ను పోగొట్టుకుంటున్నాము అని బాధపడుతూ ఉంటుంది. హిమ ఈ మాటలు విని వదిలేయండి, శౌర్య క్షేమంగా ఉంటే చాలు నేను రానులెండి నన్ను చూసి మళ్ళీ కోప్పడతాది అని అంటుంది.
 

56

ఆ తర్వాత సీన్లో రోడ్డు మీద దీప అందరిని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటుంది. ఇంతటిలో కార్తీక్ శివ తో పాటు కారులో వస్తాడు. అప్పుడు కార్తీక్,దీప ని చూసి ఈ ఆవిడని మొన్న ఎక్కడో చూశాం కదా నాకు పేరు గుర్తుకు రావడం లేదు అని అనగా శివా దీపని చూసి ఈవిడకు కనబడితే నిజమంతా తెలిసిపోతుంది కనబడక పోవడమే మంచిది లేకపోతే మేడం నన్ను తిడతారు అని చెప్పి ఆవిడ ఈవిడ కాదు సర్ అని అంటాడు శివ. లేదయ్యా నాకు బాగా గుర్తుంది ఈవిడే అని అనగా మీకు గుర్తుండడం ఏంటి సార్ నా పేరే పదినిమిషాలకి మర్చిపోతారు అని అంటారు.
 

66

లేదు ఆవిడే ఈవిడ ఒకసారి చూద్దాము అని కార్తీక్ పరిగెత్తుకుంటూ దీపు దగ్గరికి వెళ్తాడు. ఇంతట్లో దీప ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది వచ్చేసారైనా ఈవిడని కలవాలి చెప్పు అని అనుకుంటాడు కార్తీక్. శివ హమ్మయ్య వెళ్లిపోయింది లేకపోతే నా పని అయిపోయినట్టే అని అనుకుంటాడు. ఆ తర్వాత దీప ఇంటికి వస్తుంది అప్పుడు, ఆ డాక్టర్ వాళ్ళ అమ్మ, ప్రయత్నాలు ఏమైనా ఫలించాయి అని అడుగుతుంది. డాక్టర్ బాబు కనిపించలేదు కానీ నాకు ఆ మోనిట కనిపించింది అని అంటుంది. మౌనిత ఎవరు అని ఆవిడ అడగగా జరిగినదంతా చెప్తుంది. అప్పుడు ఆవిడ, పరాయి మాగాన్ని, ఆడవాడిని కావాలనుకున్న వాళ్ళు సుఖ పడినట్టు ఎక్కడ లేదు అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 గ్రాండ్‌ ఫినాలే రికార్డ్ రేటింగ్‌.. నాగార్జున ఎమోషనల్‌ పోస్ట్.. ఐదు సీజన్లలో టాప్‌
Recommended image2
Emmanuel: బిగ్‌ బాస్‌ షోకి వెళ్తే కామెడీ చేయకండి.. ఇమ్మాన్యుయెల్‌ సంచలన కామెంట్‌.. అందరి ముందు అసహనం
Recommended image3
2025లో బెస్ట్ మూవీస్ లో ఒకటి, ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved