MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దిమ్మతిరిగే సర్ప్రైజ్ ఇచ్చిన నాని.. హిట్ 2లో ఎవరూ ఊహించని ట్విస్ట్, పూనకాలు గ్యారెంటీ

దిమ్మతిరిగే సర్ప్రైజ్ ఇచ్చిన నాని.. హిట్ 2లో ఎవరూ ఊహించని ట్విస్ట్, పూనకాలు గ్యారెంటీ

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా విశ్వక్ సేన్ నటించిన హిట్ చిత్రం గుర్తుందిగా.. ఆ మూవీ మంచి విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది . సీక్వెల్ హిట్ 2గా తెరెకెక్కింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 02 2022, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా విశ్వక్ సేన్ నటించిన హిట్ చిత్రం గుర్తుందిగా.. ఆ మూవీ మంచి విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది . సీక్వెల్ హిట్ 2గా తెరెకెక్కింది. హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటించారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రచార కార్యక్రమాలు కూడా హోరెత్తించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

దీనితో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అడివి శేష్ కి జోడిగా అందాల మెరుపుతీగ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ తెల్లవారు జాము నుంచే హిట్ 2 ప్రీమియర్ షోల సందడి మొదలైంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆకట్టుకునే విధంగానే ఉందంటూ ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. దీనితో హిట్ ప్రాంచైజీ సక్సెస్ ఫుల్ రన్ కొనసాగినట్లు అయింది. 

36

క్రైమ్ మూవీ అంటే థ్రిల్లర్ జోనర్ చిత్రాలని ఇష్టపడే ప్రేక్షకులకు పండగే. వారిని ఏమాత్రం నిరాశపరచకుండా ఎంగేజింగ్ గా దర్శకుడు శైలేష్ కొలను రూపిందించినట్లు టాక్ వస్తోంది. సినిమాలో విశేషాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. అసలైన ట్విస్ట్ లు రివీల్ చేయడం లేదు కానీ.. ఒక అదిరిపోయే అప్డేట్ అందరిలో ఆసక్తి పెంచేస్తోంది. 

46

హిట్ 2 క్లైమాక్స్ లో హిట్ 3 చిత్రానికి సంబంధించిన అదిరిపోయే ట్విస్ట్ అందించారు. హిట్ 2తో అడివి శేష్ పాత్ర ముగుస్తుంది. దీనితో తదుపరి పోలీస్ ఆఫీసర్ గా నాని ఛార్జ్ తీసుకుంటాడు. దీనితో హిట్ 3లో హీరో నాని అని రివీల్ అవుతుంది. హిట్ ప్రాంచైజీకి క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ కి పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం దొరికింది. 

56

ఇక హిట్ 3 కోసం ఏకంగా నాని రంగంలోకి దిగుతుండడంతో ఆ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉండబోతోందో ఊహించుకోవచ్చు. నాని బాలీవుడ్ ఎంట్రీ మూవీ హిట్ 3 ఖరారైంది. హిట్ 3 చిత్రాన్ని భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

66

రానున్న రోజుల్లో నాని స్వయంగా దీనికి సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారు. హిట్ 2 చిత్రం మొత్తం అడివి శేష్ షోగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి కాప్ రోల్స్ కి అడివి శేష్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడు. ఆ సంగతి మరోసారి ప్రూవ్ అయింది. మరి నాని పోలీస్ అధికారిగా ఎలా ఉండబోతున్నాడు ? హిట్ 3 కి సంబంధించిన మరిన్ని విశేషాలు ఏంటి అనే వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Indrajaa: ఆడవారే ఇప్పుడు ఎక్కువగా మోసం చేస్తున్నారు.. నటి ఇంద్రజ షాకింగ్‌ కామెంట్‌
Recommended image2
Rukmini Vasanth: స్విమ్మింగ్ పూల్‌లో రుక్మిణి వసంత్‌.. బికినీ ఫోటోలు వైరల్‌.. అసలు నిజం ఇదే
Recommended image3
Renu Desai: అకీరా నందన్‌కి గాయాలు, చెత్త ప్రభుత్వం వల్లే.. రేణు దేశాయ్‌ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved