రష్మిక బాటలో బోల్డ్ బ్యూటీ.. ఫస్ట్ టైమ్ మ్యూజిక్ వీడియో.. ఇక ఊపేయడం ఖాయమేనా?
బోల్ట్ బ్యూటీ మాళవిక మోహనన్ సైతం రష్మిక మందన్నానే ఫాలోఅవుతుంది. అచ్చం ఆమె చేసిందే చేస్తుంది. మరి ఆమెకి కలిసొచ్చింది. మాళవికకి కలిసొస్తుందా? అనేది చూడాలి.

బోల్డ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan).. హాట్ అందాలతో ఇంటర్నెట్‌లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఆమె అందాల షో చేస్తే కుర్రాళ్ల లోకం చిత్తైపోవాల్సిందే. ఆమె అందాల ఘాటు తట్టుకోవడం కష్టమే అంటుంటారు నెటిజన్లు. తాజాగా ఈ అమ్మడు ఫస్ట్ టైమ్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఒరిజినల్ వీడియో సాంగ్ లకు బాలీవుడ్‌లో కేరాఫ్‌గా నిలిచే బాద్‌షా(Badshah)తో కలిసి ఆమె మ్యూజిక్ వీడియో చేయడం విశేషం.
`తౌబా` (Tauba) అంటూ సాగే ఈ మ్యూజిక్ వీడియోకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు. ఇందులో సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ గౌన్ ధరించి యమ హాట్‌గా కనిపిస్తుంది మాళవిక మోహనన్. హాట్ థైస్‌తో పిచ్చెక్కిస్తూ, చూపులతోనే చంపేస్తుంది. `తౌబా` సాంగ్ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సాంగ్ చేస్తున్నప్పుడు దిగిన ఓ ఫోటోని ఇటీవల షేర్ చేసింది మాళవిక. త్వరలోనే సర్‌ప్రైజ్ రాబోతుందని తెలిపింది.
తాజాగా ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మాళవిక చెబుతూ, ఇది తన మొదటి మ్యూజిక్ వీడియో అని తెలిపింది. తోబా ఎఫెక్ట్ ని పట్టుకోండి అంటూ ఓ కిస్ పెట్టింది మాళవిక. త్వరలోనే ఇది రాబోతుందని చెప్పింది. పాయల్ దేవ్, బాద్షాలతో కలిసి మాళవిక ఈ మ్యూజిక్ వీడియో చేయడం విశేషం. జస్ట్ పోస్టర్సే కట్టిపడేస్తున్నాయి. గ్లామర్‌కి గ్లామర్, పాటకి పాట, విజువల్స్ ఇలా అన్నీ కలిసి ఈ సాంగ్ ఓ వండర్‌లా ఉండబోతుందని అర్థమవుతుంది.
ఆ మధ్య రష్మిక మందన్న(Rashmika Mandanna) బాద్షాతో కలిసి `టాప్ టక్కర్` అంటూ సాగే ఓ మ్యూజిక్ వీడియో చేసి బాలీవుడ్‌లో బిజీ అయ్యింది. మరి మాళవిక కూడా బిజీ కాబోతుందా అనేది చూడాలి. రష్మిక.. బాద్‌షాతో కలిసి మ్యూజిక్ వీడియో చేశాక బాలీవుడ్‌లో వరుస ఆఫర్లని దక్కించుకుంది. ఇప్పుడు `మిషన్ మజ్ను`, `గుడ్‌బై`, `యానిమల్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ కూడా స్టార్ స్టేటస్‌ని అనుభవిస్తుంది. మరి మాళవికకి ఈ మ్యూజిక్ వీడియో కలిసొస్తుందా? అనేది చూడాలి.
ఇక `మాస్టర్`, `మారన్` చిత్రాలతో అలరించిన మాళవిక మోహనన్ ప్రస్తుతం హిందీలో `యుద్ర` అనే చిత్రంలో నటిస్తుంది. మరోవైపు టాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ జరుగుతుందట. ప్రభాస్‌తో జోడికట్టబోతుందని తెలుస్తుంది. మారుతి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో మాళవిక పేరు వినిపిస్తుంది.
మరోవైపు తన హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మాళవిక మోహనన్. ఆమె అందాలు ఆరబోస్తే ఇక ఆపడం ఎవరి తరం కాదనేలా ఉంటుంది.ఆ విస్పోటనం తట్టుకోవడం కష్టమే అంటుంటారు. బోల్డ్ గా ఫోటో షూట్ చేసి వాటిని అభిమానులతో పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంటుంది.