MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు డేట్స్ కావాలా పూరి.. ఆ సంగతి మరచిపోయి ట్రోలింగ్, జనగణమన పరిస్థితి ఏంటి ?

మహేష్ బాబు డేట్స్ కావాలా పూరి.. ఆ సంగతి మరచిపోయి ట్రోలింగ్, జనగణమన పరిస్థితి ఏంటి ?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ చిత్రంపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 26 2022, 07:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ చిత్రంపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ కి ముందు హైప్ విపరీతంగా పెంచడం.. కథపై ఫోకస్ పెట్టకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకి గురవుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

లైగర్ చిత్రానికి వస్తున్న నెగిటివ్ రెస్పాన్స్ ఇప్పుడు మరో మూవీపై ప్రభావం చూపుతోంది. విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత పూరి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించేందుకు సైన్ చేశాడు. పూరి జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన'లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్డేని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఒక షెడ్యూల్ కూడా షూట్ జరిగినట్లు తెలుస్తోంది. 

37

లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి మాట్లాడుతూ.. లైగర్ కన్నా డబుల్ బడ్జెట్ తో జనగణమన తెరకెక్కిస్తున్నాం అని ప్రకటించాడు. కానీ ఊహించని విధంగా లైగర్ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీనితో 'జనగణమన' ఆగిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు అని నెటిజన్లు అంటున్నారు. ఇదే అదునుగా మహేష్ ఫ్యాన్స్ పూరి జగన్నాధ్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. 

47

జనగణమన చిత్రాన్ని భారీ బడ్జెట్ లో మహేష్ బాబుతో తెరకెక్కించాలని పూరి కొన్నేళ్ల క్రితం భావించాడు. అనౌన్స్ మెంట్ కూడా జరిగింది. కానీ ఆ చిత్రం ఆగిపోయింది. ఆ తర్వాత పూరి ఓ ఇంటర్వ్యూలో.. మహేష్ బాబు తాను హిట్స్ లో ఉన్నప్పుడు మాత్రమే సినిమా చేస్తాడు అని బాహాటంగానే విమర్శించాడు. ప్రస్తుతం తాను ఫ్లాప్స్ లో ఉండడం వల్ల జనగణమన చేయడం లేదని పూరి విమర్శించారు. 

 

57

లైగర్ రిజల్ట్ ఇలా కావడంతో మహేష్ ఫాన్స్ గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. పూరి పూరి జగన్నాధ్ స్క్రిప్ట్స్ పై ఫోకస్ పెట్టడం చాలా ఏళ్ళక్రితమే ఆగిపోయింది అని అంటున్నారు. ఇలాంటి చెత్త సినిమాలు తీస్తూ మహేష్ బాబు డేట్స్ ఇవ్వడం లేదు అని మాట్లాడతావా అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు. 

67

కానీ కామన్ ఆడియన్స్ మాత్రం పూరి జగన్నాధ్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. పూరి ప్రస్తుతం కథలపై ఫోకస్ పెట్టడం లేదు నిజమే. కానీ మహేష్ బాబుని పూరి ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. పోకిరితో మహేష్ కి కొత్త స్టార్ డమ్ అందించాడు. పోకిరి అంత బ్లాక్ బస్టర్ హిట్ కాకున్నా బిజినెస్ మ్యాన్ కూడా హిట్ గా నిలిచింది. బిజినెస్ మ్యాన్ లో మహేష్ మ్యానరిజమ్స్ గమ్మత్తుగా ఉంటాయి. ఇప్పుడు ఫ్లాప్స్ ఇస్తున్నాడని పూరిని మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం సబబు కాదు అంటున్నారు. 

77
Liger Movie

Liger Movie

ఏది ఏమైనా పూరి జగన్నాధ్ కాస్త బ్రేక్ తీసుకుని స్ట్రాంగ్ స్క్రిప్ట్ తో కమ్ బ్యాక్ ఇవ్వాలని సూచిస్తున్నారు. జనగణమన విషయంలో సందిగ్దత కొనసాగుతుందా.. లేక పూరి, విజయ్ ధైర్యంగా ముందడుగు వేస్తారా అనేది వేచి చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
MS Subbulakshmi: మరణించి 20 ఏళ్లు దాటినా.. తిరుమలలో నిత్యం వినిపించే స్వరం, ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి ఖాతాలో చెరపలేని రికార్డులెన్నో..
Recommended image2
Sneha Photos: ఏంజెల్‌లా మెరిసిపోతున్న స్నేహ.. పోజులతో పనిలేదు, చిన్న స్మైల్‌ చాలు.. చూస్తే ఫిదా
Recommended image3
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved