- Home
- Entertainment
- రెడ్ లిప్స్ తో హాట్ హాట్ గా అందాల రాక్షసి.. బంగారు బొమ్మలా లావణ్య త్రిపాఠి ఫోజులు అదుర్స్
రెడ్ లిప్స్ తో హాట్ హాట్ గా అందాల రాక్షసి.. బంగారు బొమ్మలా లావణ్య త్రిపాఠి ఫోజులు అదుర్స్
అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది.

అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి చూపులోనే కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.
అందాల రాక్షసి చిత్రం తర్వాత లావణ్య త్రిపాఠి తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా భావించారు. కానీ అంచనాలని అందుకోవడంలో లావణ్య ఎప్పుడూ ఒక అడుగు వెనుకే ఉంటోంది.
కానీ తరచుగా లావణ్యకు మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి. కాకపోతే సక్సెస్ రేట్ ని స్థిరంగా మైంటైన్ చేయడంలో విఫలం అవుతోంది. కానీ లావణ్య గ్లామర్, నటన పరంగా ఫ్యాన్స్ ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయలేదు.
భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి హిట్స్ లావణ్య ఖాతాలో ఉన్నాయి. అంతరిక్షం లాంటి విభిన్నమైన చిత్రాల్లో కూడా లావణ్య నటించింది.
లావణ్య చివరగా 'హ్యాపీ బర్త్ డే' అనే చిత్రంలో నటించింది. ఆమె తదుపరి చిత్రాలు త్వరలోనే ఖరారు కానున్నాయి. ఈ లోపు యువతకు తన గ్లామర్ తో కనువిందు చేస్తోంది.
ఇటీవల లావణ్య ఎక్కువగా ఫోటో షూట్స్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా లావణ్య త్రిపాఠి షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బంగారు బొమ్మలా ఏళ్లలో చుడిదార్ లో లావణ్య ఇచ్చిన ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. చూపులతోనే బాణాలు గుచ్చుతునట్లుగా ఉన్న ఆమె ఇంటెన్స్ లుక్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
లావణ్య ఫోజులు చూస్తుంటే వెన్నెల వెలుగు విరజిమ్ముతున్నట్లుగా ఉంది. అంత అందంగా ఈ డ్రెస్ లో లావణ్య వెలిగిపోతోంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకున్నా లావణ్య చూపులు యువతని ఆకర్షిస్తున్నాయి.